top of page

రిపోర్టర్ మాయ



'Reporter Maya' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 06/12/2023

'రిపోర్టర్ మాయ' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఒరేయ్ ఆనంద్! నీకు కాబోయే పెళ్ళాం.. టీవీ న్యూస్ రిపోర్టర్ అంట కదా!"


"అవును రా విజయ్! మొన్ననే పెళ్ళి చూపులు అయ్యాయి.. "


"అమ్మాయి నచ్చిందా? అమ్మాయి అందంగా ఉంటుంది కదా!"


"అందుకే కదా!... రిపోర్టర్ జాబ్ చేస్తోంది" అన్నాడు ఆనంద్


"అదీ నిజమే... అందంగా ఉంటేనే, ఇలాంటి జాబ్ ఇస్తున్నారు !"


"అమ్మాయి నచ్చింది... సూపర్... "


"మరి ఏమిటి?" అడిగాడు విజయ్


"ప్రతిదానికి ముందు రెండు సార్లు, వెనుక రెండు సార్లు విషయాన్ని సాగదీస్తూ.. చెబుతూనే ఉంటుంది... వినాల్సి వస్తోంది... అదే ఆలోచిస్తున్నాను... "


మొన్న.. పెళ్ళి చూపులలో...


"నేను మీకు నచ్చానా?" అని అడిగాను..


దానికి ఆ అమ్మాయి " మా అమ్మ కు నచ్చితే.. నాకు నచ్చినట్లే, మా నాన్న కు నచ్చితే.. నాకు నచ్చినట్లే... మా తల్లిదండ్రులకు ఇద్దరికీ నచ్చితే.. నాకు నచ్చినట్టే... వాళ్లకు నచ్చి, నాకు నచ్చకపోయినా... నాకు నచ్చి, వాళ్లకు నచ్చకపోయినా... చివరకు నాకు నచ్చాలి.. " అని చెప్పింది


"భలే తికమక గా చెప్పింది కదా!"


"ఇదేమి చూసావు విజయ్... ! బ్రేకింగ్ న్యూస్ అయితే... ఇంక అంతే సంగతులు.... కనీసం పది సార్లు తిప్పి తిప్పి చెబుతుంది... " అన్నాడు ఆనంద్


"మంచి జీతం అంట కదా! సాహస యాత్రలు చేస్తే... ఇంకా ఎక్కువ జీతం అంట కదా... విన్నాను అంతే!"


"అవును! నువ్వు చెప్పింది నిజమే!... మా ఆవిడ మల్టీ టాలెంటెడ్.. రిపోర్టర్, న్యూస్ రీడర్.. " అన్నాడు ఆనంద్.


"ఏమో ఆనంద్!... నీకా, ఉద్యోగం అంతంత మాత్రం... అంత సంపాదించే అమ్మాయి... కోరి, నిన్ను చేసుకుంటానంటే.. ఇంకేమిటి ఆలోచన?"


"మా ఇంట్లో కూడా... అదే అంటున్నారు... "


"అయితే ఇక ఆలోచను మాని, మాకు పెళ్ళి భోజనం ఎప్పుడు పెట్టాలో ఆలోచించు! ఈ జన్మకి, ఇలా కానీ రా ఆనంద్!.... లైఫ్ సెటిల్ అయిపోతుంది గా"..


ఆనంద్.. రిపోర్టర్ మాయ ని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి కి అన్ని టీవీ ఛానల్లో, కవరేజ్ పెట్టించుకుంది మాయ. వారం రోజులు తర్వాత ఫ్రెండ్ కు ఫోన్ చేసాడు ఆనంద్..


"ఒరేయ్ విజయ్! మనం ఒక సిట్టింగ్ వెయ్యాలి రా! ఎప్పుడు కలుద్దాం చెప్పు?"


"మీ ఆవిడ ఒప్పుకుంటుందా?"


"ఇది మన పర్సనల్ సిట్టింగ్... ఎప్పుడూ చేసేదే రా!"


"అయితే సరే.. ఎప్పుడూ కలిసే చోటే కలుద్దాం! రేపు సాయంత్రం ఐదు కు"


"అలాగే" అన్నాడు విజయ్


ఇద్దరు మిత్రులు సాయంత్రం ఐదు కు ఎప్పుడూ కలిసే బార్ లో కలిశారు.


"ఇప్పుడు చెప్పారా ఆనంద్! ఏమిటి విషయాలు?” అంటూ అడిగాడు విజయ్... గ్లాస్ కు చీర్స్ చెబుతూ... !


"పెళ్ళాం తో హనీమూన్ ఎలా ఎంజాయ్ చేసావు?"


"ఏం హనీమూన్ రా! హనీమూన్ అని ఊటీ వెళ్ళామా! అక్కడ దిగంగానే, ఒక ఆక్సిడెంట్ చూసాము... వెంటనే, మా ఆవిడ... బ్రేకింగ్ న్యూస్... అంటూ మొదలెట్టేసింది... "


"సెలవులో ఉందనుకుంటాను మీ ఆవిడ.. "


"అయినా సరే! బ్రేకింగ్ న్యూస్ దొరికితే, కెమెరా లేకపోయినా, మొబైల్ తీసి మరీ షూట్ చేసి స్టూడియో కు పంపిస్తుంది... అలవాటు లో పొరపాటు"


"తర్వాత రూమ్ తీసుకొని, హ్యాపీ గా ఎంజాయ్ చేసుంటారు కదా!"


"అది ఏమి అడిగావు లే! స్నానం చేద్దామని, గీజర్ వేసింది మా ఆవిడ! పని చేయకపోయేసరికి.... మళ్ళీ మొదలెట్టింది...


‘ప్రముఖ హోటల్ లో గీజర్ పనిచేయట్లేదు... అంత డబ్బులు ఎందుకు కట్టాలి?’ అని ఒక న్యూస్…”


“స్నానం చేసాక, ఇంకేమి సమస్య ఉండదేమో కదా…”


స్నానం చేసి తెల్ల చీర కట్టుకుని వస్తుందని.. ఎంతో ఆశ పడ్డాను... సూట్ వేసుకుని వచ్చింది రా!


‘అదేంటి?’ అని అడిగితే..


"నైట్ టైం క్రైమ్ కవరేజ్ అంట.... కంఫర్ట్ కోసం అలవాటైపోయిందంట... ఇంకేముంది... అరచి.. అరచి... తర్వాత నిద్రొచ్చింది... పడుకుంది... "


"ఉదయం ఫ్రెష్ గా మంచి కాఫీ తెచ్చి.. ఇచ్చి ఉంటుందేమో కదరా!... అసలే నీకు కాఫీ అంటే ఇష్టం కదూ!.... "


"నేనూ అలాగే అనుకున్నా... ఉదయం లేవగానే.... రెడీ అయ్యి... ఊటీ వెదర్ రిపోర్ట్ అంట... పంపించమని వాళ్ళ బాస్ అడిగాడంటా.... వీడియో తీసి పంపించాలంటూ వెళ్ళిపోయింది... "


"మీ ఆవిడ వర్క్‌హోలిక్... అందుకే ఇలాగ.... " అన్నాడు విజయ్


“ఇంక లాభం లేదని వెంటనే టికెట్స్ బుక్ చేసి ఇంటికి వచ్చేసాము... ఇంట్లో అయితే ఈ గోల ఏమి ఉండదని…”


"అయితే నీ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా మరి?"


"ఇంటికి వచ్చిన తర్వాత! బట్టలు ఉతకడానికి పని మనిషి వచ్చింది...


‘ఎంతిస్తారు ఏమిటి పనిమనిషి కి?’ అని అడిగింది మాయ.


"మూడు వేలు.. ఇక్కడ అందరూ, అంతే ఇస్తారు" అని అన్నాను.


‘పని తక్కువ డబ్బులు ఎక్కువ... ఇక్కడ పనిమనుషుల పనికి -’ అని ఒక న్యూస్ తయారు చేసింది నా పెళ్ళాం…”


"నీకో సలహా ఇవ్వనా ఆనంద్! నువ్వు హనీమూన్ కు ఒక ద్వీపం కి వెళ్ళు... అక్కడ... మనుషులు ఎవరూ ఉండరు.... మొబైల్ సిగ్నల్ ఉండదు... న్యూస్ కూడా అంతగా ఏమీ ఉండదు... "


"సరైన సలహా ఇచ్చావు మామ! షిప్ బుక్ చేస్తాను.. సముద్రం మధ్యలో ద్వీపానికి... "


**************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ

63 views0 comments
bottom of page