సద్గురువులు
- Addanki Lakshmi
- Sep 5
- 3 min read
#TeluguKavithalu, #Kavithalu, #TeluguPoems, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #Sadguruvulu, #సద్గురువులు, #గజల్

Sadguruvulu - New Telugu Poem Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 05/09/2025
సద్గురువులు - తెలుగు కవిత
రచన: అద్దంకి లక్ష్మి
మంచిచెడుల భేదములను
వివరించును సద్గురువులు
జ్ఞానజ్యోతి మనసులోన
వెలిగించును సద్గురువులు
తిమిరములను రూపుమాపి
వెలుగునిచ్చు మేధావిగ
అక్షరాల పూదోటన
ఆడించును సద్గురువులు
మట్టి ముద్ద బాలలనూ
మనసు పెట్టి మలచు చుండు
సుందరముగ శిల్పములా
చూపించును సద్గురువులు
అక్షరమే ఆయుధముగ లక్షణములు గమనించును
విద్యార్థుల విజయాలకు
సూచించును సద్గురువులు
చిరునవ్వుల చల్లదనము
కురిపించును దినము దినము
నీతి నేర్పు కథలు ఎన్నొ
వినిపించును సద్గురువులు
నవ యువతకు నాణ్యమైన
బాట వేసి చూపగలరు
క్రొవొత్తిగా తాను మారి రాణించును సద్గురువులు
అలుపెరుగని శ్రామికులుగ
అహర్నిశలు శ్రమపడుతూ
ఆణి ముత్యముల కొరకే
జీవించును సద్గురువులు

Guruve Kula Daivamu - New Telugu Poem Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 05/09/2025
గురువే కులదైవము - తెలుగు కవిత
రచన: అద్దంకి లక్ష్మి
1
జ్ఞాన బీజం నాటి
విజ్ఞానులను జేయు
అంధకారము నుండి
యాశయాలకు జేర్చు
మట్టి బొమ్మలు తెచ్చి
మాణిక్యములు చేయు
బండ పిల్లల తెచ్చి
బాగుగ తీర్చిదిద్దు
ప్రతిభ వెలికితీయును
ప్రగతి పథంన నిలుపు
విద్యలను బోధించు
వినయమును నేర్పించు
గురువులందరు మనకు
కల్పతరువులు కొలువ
గురు బ్రహ్మ గురు విష్ణు
గురువే కులదైవము
2
మంచి చెడులను తెలిపి
మార్గదర్శన చేయు
చదువు చెప్పెడి గురువు
చరణములు వేడుకో
భావి తరాల వారి
భవిష్యత్తును చూపు
సమాజ శ్రేయస్సుకు
శ్రేయోభిలాషులూ
అనుసరించు గురువుల
అనుదినము పూజించు
క్రొవొత్తిలా కరుగుచు
కొత్త వెలుగులు నిచ్చు
ఆదర్శనీయులేగ
ఆచార్యులే మనకు
శ్రీవిద్యా నిలయుము
శ్రీ గురువుల హృదయము
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,
Comments