top of page
Original.png

 సాహస సైనిక సోదరా! వందనం నీకు!!

#SahasaSainikaSodaraVandanamNiku, #సాహససైనికసోదరావందనంనీకు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Sahasa Sainika Sodara Vandanam Niku - New Telugu Poem Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 10/05/2025

సాహస సైనిక సోదరా ! వందనం నీకు !! - తెలుగు కవిత

రచన: కందర్ప మూర్తి


వీర సైనిక సోదరా ! వందనం నీకు

మతం, జాతి, కులం, ప్రాంతీయ

భావన లేక క్రమశిక్షణ గొడుగు కింద

మూడు రంగుల జండా రెపరెపల సవ్వడిలో

దేశ సరిహద్దుల నిశిత పహరాతో

ఎల్ల వేళల భరతమాతకు రక్షణలో

నీ కర్తవ్యం అమోఘం! సైనికా !!


అమ్మను కాదని, నాన్నను వదిలి

తోబుట్టువుల చింతలేకుండా

ఆలు బిడ్డల ఆలోచన మరిచి

సర్వ వేళల దేశ ప్రజల

రక్షణ బాధ్యతే కర్తవ్యంగా

మంచు గడ్డకట్టి వణికించే చలిలో 

హిమాలయాల శిఖర అంచుల్లో

వేడి సెగలు రేపే ఎడారి ఇసుక రేణువుల్లో

శత్రువులకు దడ పుట్టించే

శతఘ్ని భీకర శబ్ధాలతో

నిరంతర సరిహద్దుల పహారా 

దేశ రక్షణలో నీ దృఢ సంకల్పం

ఎంత పొగిడినా తక్కువే సోదరా!


దేశ అంతర్గత కల్లోలాల్లో

ప్రకృతి వైపరీత్యాల ఆపదల్లో

నీ ప్రాణాలకు తెగించి ప్రజల

రక్షణే బాధ్యతగా నీ సాహసం

ఎందరో యువతకు స్ఫూర్తి!


నూనూగు మీసాల యవ్వనంలో

దేశ రక్షణ దళాలలో చేరి

అకుంఠిత సుదీర్ఘ సేవలు చేసి

యవ్వనాన్ని ధారపోసి

నెరసిన తల వెంట్రుకలతో

నడి వయసులో ఇంటికి వచ్చే

సైనిక..


నీ కర్తవ్య సాధనకు

దేశ సరిహద్దుల రక్షణలో

శత్రు మూకల ఖర్కశ దాడిలో

అమరులైన వీర సైనిక సోదరులకు

సెల్యూట్ ! సలాం !! అభివందనం!!!

***

కందర్ప మూర్తి

 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page