top of page
Original_edited.jpg

సమాజం ఎటు పోతోంది.. ?

#SudhavishwamAkondi, #SamajamEtuPothondi, #సమాజంఎటుపోతోంది, #సుధావిశ్వంఆకొండి, #SocialProblems, #సామాజికసమస్యలు

ree

Samajam Etu Pothondi - New Telugu Article Written By - Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 03/06/2025 

సమాజం ఎటు పోతోందితెలుగు వ్యాసం

రచన: సుధావిశ్వం ఆకొండి


కలకత్తాలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక వైద్య విద్యార్థిని ఘోరంగా గ్యాంగ్ రేప్ చేసి, చంపేశారు��. చాలా బాధగా అనిపించింది. తలంతా భారంగా ఉంది. 


గ్యాంగ్ లో ఒకడు దొరికాడట. వాడి మొబైల్ లో అన్నీ అశ్లీల వీడియోలే అట! తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హైకోర్టులో పిటిషన్ పెట్టారట. వారు కోరిన ప్రకారం హైకోర్టు ఈ కేసు సిబిఐ కి అప్పగించింది. త్వరగా తెలుస్తారనే ఆశావాదంలో ఉన్నారు. 


వీళ్ళు మనుషులా? నరరూప రాక్షసులా? అనే భావన కలుగుతోంది. రావణాసురుడు, కీచకుడు మొదలైన రాక్షసులే బెటర్ ఏమో వీళ్ళకంటే. శరీరాన్ని హింసించి, ముక్కలు చేసి.. �� ఇదేమి పైశాచిక ఆనందమో.. ?��


ఒక సంఘటన జరిగి, మర్చిపోతున్న దశలో సమాజం ఉలిక్కిపడేలా మరో రాక్షసుడు/లు పుట్టుకొస్తున్నాడు��


ఈ సంఘటనలకు అంతం అనేది లేనే లేదా? ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలంటే ఎలా.. ? తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉండాల్సిందేనా? వీళ్ళను మృగాలుగా, రాక్షసులుగా మారుస్తున్న పాపం ఎవరిది? 'తిలాపాపం తలా పిడికెడు' అన్న చందాన ఇటు రాజకీయం, అటు సినిమాలు ఎక్సేట్రా.. 


ఇవన్నీ ఆగి, సురక్షితమైన సమాజం ఏర్పడాలి అంటే మార్గం ఏమిటి.. ?

ఒక రేప్ సంఘటన జరిగి, న్యూస్ లో కాస్త ప్రాచుర్యం లోకి రాగానే అప్పుడు అందరూ సోషల్ మీడియాలో తమ భావాలు వ్యక్తం చేస్తారు. రేపిస్టుని చంపేయాలి అంటారు. న్యాయం జరగాలని నినాదాలు చేస్తారు. వాడికి శిక్ష పడుతుంది. ఇక చాప్టర్ క్లోజ్! ఎవరి పనుల్లో వారు పడిపోతారు. 


ఓటీటీ లోనో, థియేటర్ లోనో సినిమాలు చూడడం, టీవీ లో బిగ్ బాస్ లు, చిన్నపిల్లల చేత ఐటమ్ సాంగ్స్ చేయించే షోస్ చూడడంలో నిమగ్నం అవుతారు. వీలైతే రోజూ, లేదంటే రెండురోజులకు ఒకసారి అయినా మందు తాగకపోతే తోచదు. మరి సినిమాలో హీరోస్ ఇలాగే వుంటారుగా!

అలా చేసినవాడికి శిక్ష పడినా కానీ ఆ తల్లిదండ్రుల కడుపుకోత తీరుతుందా? పాశవికంగా హత్యకు గురి అయి చనిపోయిన బిడ్డ తిరిగి వస్తుందా? రాదు!


మళ్లీ కొద్దికాలంలోనే మరో పాశవిక సంఘటన జరుగుతోంది. ఇది ఆగేదెలా? దీనికి మూలకారణం ఏమిటనే ఆలోచన మన మేధావులు ఎవ్వరికీ లేదు. కోర్టును, పోలీసులను తిట్టేసి పోతే అయిపోతుంది ఓ పని అనే ధోరణి తప్ప మరోటి లేదు. 


కళలలో అన్నిటికంటే శక్తివంతమైనది దృశ్య మాధ్యమం. విదేశాల్లో హాలీవుడ్ సినిమాలో విచ్చలవిడితనం చూపించడం మొదలు అయిన తర్వాత నుంచే అక్కడి ప్రజల్లో విచ్చలవిడి శృంగారం, నేర ప్రవృత్తి పెరిగాయి సమాజంలో. ఆ తరువాత ఆ మహమ్మారి నెమ్మదిగా బాలీవుడ్ లో ప్రవేశించి, సౌత్ సినీ పరిశ్రమల్లో కూడా విస్తరించి, మనిషికి ఉండాల్సిన కనీస లక్షణాలు కూడా లేని స్థితికి తెచ్చేలా, జనాల మెదళ్ళు సర్వనాశనం చేసింది. 


ప్రపంచ వ్యాప్తంగా జనాల్లో నేర ప్రవృత్తి పెరిగి, తాగుడు, పిచ్చి వీడియోలు చూసి రెచ్చిపోవడం నిత్యకృత్యంగా మారింది. పశువులా కాదు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించడం తయారు అయ్యింది. వావివారుసలు లేకుండా పోయాయి. ����

టీవీ, సినిమా, ఓటీటీ అన్నింటిలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేలా ప్రభుత్వాలు నిర్ణయించి, కఠినంగా అమలుచేస్తే కొంతకాలానికి ఏమైనా బాగు పడుతుంది సమాజం. లేదంటే క్షణక్షణం భయం భయం!


అందుకే ఇటువంటి సమాజంలో ఆడపిల్లలను పువ్వులా కాదు ఎవ్వడైనా ఇలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే చాలు చావగొట్టేలా పెంచాలి. ఏమో ఎవడికి ఏం వెఱ్ఱి పుడుతుందో.. ! అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు.


పేరెంట్స్ ఆడపిల్లలను ధైర్యంగా ఉండేలా, మానసిక స్థైర్యం వుండేవాళ్లుగా పెంచాలి! మగపిల్లలను ఆడవాళ్ళ పట్ల గౌరవ భావంతో ఉండేలా పెంచాలి. పిచ్చి వీడియోలు, సినిమాలు ప్రభావం పడకుండా సాధ్యం అయినంత కాచుకోవాలి!


Feeling very sad��

శ్రీకృష్ణా! నీ చరణాలే మాకు శరణు!

����������



సుధావిశ్వం ఆకొండి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!

 కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది.  ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page