సమాజానికి శీల పరీక్ష
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Jul 30
- 5 min read
#SamajanikiSeelaPareeksha, #సమాజానికిశీలపరీక్ష, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Samajaniki Seela Pareeksha - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 30/07/2025
సమాజానికి శీల పరీక్ష - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"హాయ్, దివ్యా! కంగ్రాచ్యులేషన్సే. పెళ్లి కుదిరిందటగా. ఎవరే ఆ జగదేక వీరుడు. మీ వాళ్లు ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో ఒక సాకుతో తిరగగొట్టేదానివి. ఇప్పటికి పెళ్లి కళ తెచ్చావే బాలా!" అంటూ ఒకటే జోకులతో అదరగొట్టేస్తోంది చిన్ననాటి ఫ్రెండ్ రాధిక.
"ఔనే, ఎంగేజ్మెంట్ జరిగింది. మా నాన్న గారి ఫ్రెండ్ రంగనాథ్ గారి అబ్బాయి తరుణ్ తో. బిజినెస్ మానేజ్మెంటు చేసి స్విట్జర్లాండ్ లో జాబ్ చేస్తున్నారు. నాకు మేరేజ్ ప్రపోజల్స్ జరుగుతున్నాయని తెల్సి నాన్న గారిని సంప్రదించారట. అబ్బాయి జాబ్ వివరాలు, బయోడేట ఫోటో పంపి నా అభిప్రాయం తెల్సుకోమన్నారట.
నాన్న గారు వివరాలు నాకు చెప్పి అభిప్రాయం అడిగారు. నేను అన్నీ చూసి పెర్సనల్ గా తరుణ్ తో మాట్లాడాలంటె కాంటాక్టు నంబరు ఇచ్చారు. ఆయన అభిప్రాయాలు అభిరుచులు మిగతా విషయాలు పెర్సనల్ గా మాట్లాడిన తర్వాత నాన్న గారికి నా మనసులో మాట చెప్పేను.
పెద్దవాళ్ళు మాట్లడుకున్న తర్వాత మా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేరు. మేరేజ్ తర్వాత నేను సాఫ్ట్వేర్ జాబ్ కి రిజైన్ చేసి స్విట్జర్లేండ్ వెళిపోతానే. ముందు నుంచీ నేను ఫారిన్లో జాబ్ చెయ్యాలని కలలు కనేదాన్ని. ఆ అవకాశం ఇప్పుడు నెరవేరబోతోంది. " తన మనసులోని మాట చెప్పింది దివ్య.
"అదృష్టవంతురాలివే. స్కూల్ డేస్ నుంచి ఫారిన్ లైఫ్ గురించి మాట్లాడేదానివి. ఆ కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నావు. మీ నాన్న గారిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్వేర్ చదివి మంచి జాబ్ కొట్టేసావు. నాలాంటి మద్యతరగతి స్కూల్ టీచర్ కుటుంబంలో అందుబాటులో ఉండే టీచర్ గానే సెటిలయాను. టీచర్నే పెళ్లి చేసుకుని సంసారసాగరం ఈదుతున్నాను. నువ్వు ఫారిన్ పోయి మమ్మల్ని మరిచిపోకేం " అని పరాచికాలాడింది రాధిక.
"లేదే, నిన్నెలా మరిచిపోతానే. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తోడుగా ఆటలు పాటలు చదువులలో ఎంతో ప్రోత్సాహం ఇచ్చావు.. మీ అమ్మ కూడా నన్ను చాల ఆప్యాయంగా చూసేవారు. పెళ్లి డేట్ ఫిక్స్ అవగానే వెడ్డింగ్ కార్డు తీసుకుని అమ్మానాన్నతో మీ ఇంటికి వస్తాము " అని వీడ్కోలు పలికింది.
సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న రంగనాథ్, గోపాల్ రావు కాలేజీ ఫ్రెండ్స్. చదువుల్లో అభిరుచుల్లో ఇద్దరిదీ ఒకే దృక్పథం ఐనందున వారి ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతోంది. ఉద్యోగరీత్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా ఏదో ఒక సందర్భంలో కలుసుకుంటు స్నేహబంధాన్ని కాపాడుతున్నారు. ఇద్దరూ సాంప్రదాయాలకు విలువిస్తారు.
రంగనాథ్ గారి ఏకైక పుత్రుడు తరుణ్ చిన్నప్పటి నుంచి ఆధునిక భావాలు,హాస్టల్ జీవితం, ఫ్రెండ్స్ తో జులాయిగా తిరిగేవాడు. సినేమాలు, షికార్లతో జల్సాలు చేస్తు బిజినెస్ స్కూల్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్విట్జర్లాండ్ లో జాబ్ దొరికితే వెళిపోయాడు. ఫారిన్లో ఉన్నా ఇండియన్ ఫ్రెండ్స్ ని మరిచిపోలేదు. ఎప్పుడూ వారితో టచ్ లో ఉంటున్నాడు. యవ్వనవయసు వారి ఆలోచనలు అభిప్రాయాలు వర్షాకాలపు నీటి ప్రవాహంలా పరుగులు తీస్తుంటాయి. పుస్తకాలు, ప్రసార మాద్యమాల్లో పెళ్లి ప్రేమ ఫేమిలీ ఇవే ముచ్చట్లు వారివి.
దివ్య- తరుణ్ ఒకరితో ఒకరు పరోక్షంగా సంప్రదింపుల తర్వాత పెద్దవాళ్లు ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తిచేసారు. పురోహితుల్ని సంప్రదించి పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయమైంది. ఫంక్షన్ హాల్, వెడ్డింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ పూర్తయాయి. రెండు కుటుంబాల బంధువులు, ఆప్త మిత్రులు పెళ్లికి వచ్చారు. పెళ్లి వేడుకలు సాంప్రదాయ
పద్దతిలో ఘనంగా జరుగుతున్నాయి.
ఇటు తరుణ్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడివారో పెళ్లికి వచ్చి వారికి కేటాయించిన అతిథి గృహాల్లో విడిది చేసారు. తరుణ్ కి ఊపిరి తీసుకోకుండా ఒకటే సందడి. జోకులు, పరిహాసాలు.. నవ్వుతూ పెళ్లి ముహూర్తం వరకు గడిపేసారు. తను ఫేమిలీతో స్విట్జర్లాండ్ వెళిపోతె మళ్లా కలవడం ఎప్పుడో కాని అవదని పెళ్లి అయిపోయినా రెండు మూడు రోజులు తనకి టైంపాసుకి ఉండమంటె కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండిపోయారు.
ఇరు కుటుంబాల సందడితో తరుణ్ - దివ్యల పెళ్లి ఘనంగా జరిగింది. తెల్లవారుజామున పెళ్లి ముహూర్తం అయినందున వధూవరులతో అందరూ పెళ్లి సందడులతో అలసి పోయారు. ముందు నుంచి పెళ్లి వేడుకలు, ఫ్రెండ్స్ రాకతో దివ్యకు సరైన నిద్ర లేక కడుపు అప్ సెట్ అయింది. తల తిరుగు తున్నట్టు అనిపించినా తమాయించుకుంటు తదుపరి పెళ్లి సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పెళ్లి తర్వాత యధావిధిగా శోభనానికి ఏర్పాట్లు చేసారు. దివ్యకు వంట్లో బాగులేక పోయినా అన్నిటికీ సిద్ధపడక తప్పడం లేదు. అదీగాక ఇంట్లోకి రాని దినాలైనందున బహిస్టు ఆగడానికి టేబ్లెట్లు మింగినందున అదొక సమస్య బాధ పెడుతోంది. పురోహితులు పెట్టిన ముహూర్తం ప్రకారం నవ వధువు దివ్యను అలంకరించి శోభనం గదిలోకి పంపేరు ముత్తయిదువులు.
వేయి కలలతో ముందే పెళ్లి కొడుకు తరుణ్ శోభనం గదిలో దివ్య రాకకోసం ఎదురు చూస్తున్నాడు. ఫ్రెండ్స్ ముచ్చట్లతో శోభనం గదిలో ఎలా వ్యవహరించాలో ఏవేవో ఊహించుకుంటున్నాడు.
తెల్లటి మధుపర్క చీరలో కల్యాణతిలకం దిద్దిన ముఖం, మెడలో ధగధగ మెరిసే మంగళసూత్రాలు బారెడు జడనిండా మల్లెపువ్వులు, గోరింటాకు వేళ్ళతో పాలగ్లాసుతో వచ్చిన దివ్యను చూసి ముగ్ధుడయాడు తరుణ్.
గుమ్మం లోపల సిగ్గుతో నిలబడిన భార్యను వీపు వెనుక చెయ్యి వేసి పువ్వులతో అలంకరించిన పెళ్లి పాన్పు దగ్గరకు తీసుకు వచ్చి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు.
దివ్యకు అప్పటికే తల తిరుగడంతో పాటు వాంతి అవుతున్నట్టు అనిపిస్తోంది. ఆమె చేతిలోని పాలగ్లాసు తన చేతిలోకి తీసుకుని తను కొన్ని పాలు తాగి మిగతావి దివ్యను తాగమన్నాడు. అప్పటికే వాంతి అవుతున్న భ్రమలో ఉన్న దివ్య పరుగున వాష్ రూమ్ కెళ్ళి వాష్ బేసిన్లో వాంతి చేసుకుంది.
తరుణ్ రాయిలా అయిపోయాడు. ఏమిటి ఇలా జరిగిందనుకున్నాడు. దివ్య నోరు శుభ్రం చేసుకుని వచ్చి సారీ చెప్పి పెళ్లి వేడుకల సందర్భంలో సరైన నిద్ర లేక ఎసిడిటీ ప్రోబ్లమ్ వంట్లో బాధలు వివరంగా చెప్పింది.
ఆమె పరిస్థితి చూసి మరేమనలేక మంచం మీద చెరో వైపు తిరిగి పడుకున్నారు ఆ నూతన దంపతులు. తెల్లారింది. ఎప్పటిలా అమ్మలక్కలు దివ్యను గది బయటకు తీసుకు వెళ్లేరు. తరుణ్ తొట్టిగ్యాంగ్ ఎప్పటిలా హాస్యంగా మాట్లాడుతు ఫస్టు నైట్ ఎలా ఎంజాయ్ చేసావని కూపీలాగేరు.
తరుణ్ నీర్సంగా రాత్రి జరిగిన సంఘటన తెలియచేసాడు వారికి. తరుణ్ చెప్పిన మాటలు విని నవ్వుతూ తెలిసీ తెలియని పరిజ్ఞానంతో "ఒరేయ్, తరుణ్! ఇదేదో డౌట్ కేసులాగుంది. నీ కన్న ముందు ఎవరితోనొ లవ్ లో పడిందేమో? నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి ప్రెగ్నెన్సీ లాగుంది.
ఒక పని చెయ్యి. ప్రిగనెన్సీ రేపిడ్ కిట్ కొని ఆమె యూరిన్ టెస్టు చేయించు. పరిస్థితి తెలుస్తుంది. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం" అని సలహా ఇచ్చారు ఆ ప్రబుద్ధులు.
ఆధునిక సమాజంలో కొందరు ఆవారాలు, జులాయిలు అశ్లీల సాహిత్యం సినేమా, టీవీలలో వచ్చే కార్యక్రమాలు చూసి అవగాహన లోపంతో పవిత్రమైన వివాహ వ్యవస్థను కించపరుస్తున్నారు.
వెనకా ముందు ఆలోచించని నేటి యువతలో ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు. రెండవరోజు శోభనం గదిలో అడుగుపెట్టిన దివ్యను ఎగాదిగా చూసిన తరుణ్ తను దాచిన ప్రెగ్నెన్సీ రాపిడ్ కిట్ పైకి తీసి కంటైనర్ బాటిల్లో కొంచం యూరిన్ తెమ్మన్నాడు.
దేనికని దివ్య అడగ్గా "ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ టెస్టు కోసమని" అమాయకంగా చెప్పేడు తరుణ్. దివ్యకు చెళ్లున చెంప మీద కొట్టినటైంది. తక్షణం శోభనం గది నుంచి ఏడుస్తు బయటకు వచ్చి జరిగిన విషయం పెద్ద వాళ్లకు తెలియచేసింది.
బయటకు చెబితే రభస జరిగి పరువు పోతుందని తెల్లవారే వరకు ఆగి ఉదయం మిత్రుడు రంగనాథ్ ను పిలిచి రాత్రి జరిగిన విషయం బాధతో తెలియచేసాడు గోపాలరావు.
వెంటనే రంగనాథ్ కొడుకును పిలిచి " పెద్ద చదువులు చదివి హోదా ఉద్యోగం సంపాదించిన నీకు ఇవేం చెడుబుద్ధులు పుట్టా"యని చెడామడా తిట్టేడు. మిత్రుడు గోపాలరావును క్షమాపణ కోరి వెంటనే కోడలిని గేస్ట్రో ఎంటరాలజిస్టుకు చూపి వైద్యం చేయించాడు.
తన ఇంగిత జ్ఞానం నశించి ఫ్రెండ్స్ అనాలోచిత సలహా వల్ల తను ఎంత నష్టపోయిందీ తెలుసుకుని భార్య దివ్యను, మామగారు గోపాలరావును జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరి కథ సుఖాంతం చేసాడు తరుణ్.
గమనిక: టి. వీ వార్తలో ఉత్తరప్రదేశ్ ఒక జిల్లాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రాసిన స్వీయ రచన.
కొన్ని యదార్థ సంఘటనలను వాస్తవ రూపానికి తేవడానికి ఎవరూ సాహసించడం లేదు. ఫేక్ న్యూసని కొట్టి పారేస్తున్నారు. తప్పు ఎటు జరిగినా బలిజంతువుగా మారేది మహిళలే.
-కందర్ప మూర్తి.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments