top of page
Original.png

20 తెలుగు కవితలు | రాళ్లబండి సంగం నాయుడు

2 hours ago
8 min read

రాళ్లబండి సంగం నాయుడు 20 తెలుగు కవితలు – మానవత్వం, బాల గేయాలు, ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక విలువలు
రాళ్లబండి సంగం నాయుడు 20 తెలుగు కవితలు – మానవత్వం, బాల గేయాలు, ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక విలువలు

20 Telugu Poems | Rallabandi Sangam Naidu

20 తెలుగు కవితలు | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 06/11/2026


రాళ్లబండి సంగం నాయుడు – 20 తెలుగు కవితలు

సామాజిక కవితలు | బాల గేయాలు | ప్రకృతి కవితలు | మానవతా విలువలు

రచన: రాళ్లబండి సంగం నాయుడు


మనిషి జీవితంలోని అనుభవాలు, ఆకలి బాధలు, బాల్యపు ఆనందాలు, పల్లె జీవన సౌందర్యం, తెలుగు భాష మాధుర్యం, ప్రకృతి విశిష్టత, మానవత్వం, శాస్త్ర విజ్ఞానం వంటి విభిన్న అంశాలను స్పృశించే 20 తెలుగు కవితలను రాళ్లబండి సంగం నాయుడు ఈ సమాహారంలో అందిస్తున్నారు.


ఆకలి నను వరించింది కవితలో కడుపు ఆకలి నుంచి జ్ఞాన తృష్ణ వరకు మనిషి చేసే పోరాటాన్ని ఆవిష్కరించారు. తెలుగు అక్షరం కవితలో మాతృభాష మాధుర్యాన్ని, మా ఊరు కవితలో పల్లె అనుబంధాలను, గిరి'జా తనయ కవితలో ప్రకృతితో మమేకమైన గిరిజన జీవిత విశిష్టతను చిత్రించారు.


బాలల ఇష్టం, ఉడుత ఉడుత ఊచ్, చిలుకమ్మ చిట్టీ కానుక, పాపాయి వంటి కవితలు బాలల ఊహాలోకాన్ని, ఆటపాటలను ప్రతిబింబిస్తాయి.


మానవత్వపు ముద్దులం కవిత పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవం, గురువుల పట్ల భక్తి, చదువు, క్రమశిక్షణ, ప్రకృతి ప్రేమ, పరస్పర సహకారం వంటి మంచి విలువలను పెంపొందించే సందేశాన్ని అందిస్తుంది.


మౌనమే నీ భాష స్త్రీ ఔన్నత్యాన్ని తెలియజేస్తే, సర్వం కల్తీమయం సమాజంలోని కల్తీ ధోరణులపై ప్రశ్నలు సంధిస్తుంది. శాస్త్ర విజ్ఞానం మానవ మేధస్సు, పరిశోధన, విజ్ఞాన ప్రాధాన్యాన్ని చాటుతుంది.


ఈ కవితలు బాలలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, తెలుగు సాహిత్యాభిమానులకు ఆసక్తికరంగా ఉంటాయి.


ఈ 20 కవితలను చదివి మీకు నచ్చిన కవితను వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి.

ప్రచురణ: మనతెలుగుకథలు.కామ్


1.

ఆకలి నను వరించింది

2.

తెలుగు అక్షరం

3.

మా ఊరు

4.

గిరి'జా తనయ

5.

ఆనందం ఆనందం

6.

బాలల ఇష్టం

7.

ఉడుత ఉడుత ఊచ్

8.

చిలుకమ్మ చిట్టీ కానుక

9.

సీతకోకచిలుక

10.

బొప్పాయి మా ఇంటి పాపాయి

11.

బువ్వ తిందాం

12.

మానవత్వపు ముద్దులం

New

13.

మౌనమే నీ భాష

14.

రావోయి విద్యార్థి

15.

పాపాయి

16.

కమలం ఆ నయనం

17.

తపోవనిత

18.

సర్వం కల్తీమయం

19.

శాస్త్ర విజ్ఞానం

20.

వెలుగు వేకువులం


ఆకలి నను వరించింది


ఆకలి నను వరించింది

అవును పుట్టిక నుంచి నేటి వరకు

కణ కణ మండే నిప్పుల ఆకలి నను వరించింది

బుక్కెడు బువ్వ కోసం

అలుపెరగని కష్టం

ఒక ముద్ద అన్నం కోసం

కాళ్లలో మాంసం అరిగేలా తిరుగులు

బతుకు పోరాటం

జీవిత ఆరాటం

బతుకు బాటలో దారి పొడుగునా కన్నీటి స్నానాలు

ఆకలి కేకలు

నా కడుపులో

నిత్యం ఆకలి బడబాగ్ని

నా మనసనే అగ్నిపర్వతంలో

ఆకలి తనువును నిలువునా కాల్చే కౌగిలి

మెధడులో ఆలోచనల ఆకలి

మేధస్సు మధన ఆకలి

ఆకలి జ్ఞానాన్ని కప్పుకున్న కంబళి

అనునిత్యం ప్రశ్నల ఆకలి

జ్ఞాన తృష్ణ ఆకలి

ఆకలి నా జ్ఞాన వాకిలి

చిన్నప్పుడు ఆకలి నను వరిస్తే

తెలిసోచ్చాక ఆకలిని నేను వరించాను

అపుడు కడుపు మంట

జ్ఞాన మంట అయింది

నా కడుపు మంటకు సమాధానం పిడికెడు అన్నం

నా జ్ఞానమంటకుసమాధానం

విచ్చుకున్న శివుని మూడో నేత్రం 


తెలుగు అక్షరం

 

జుంటి తేనె 

పనస తొన

పల్లె బాట 

పిల్లాడి ఆట 

పంచ దార 

జ్ఞాన ధార 

మంత్రం 

మంత్రపుష్పం 

నెమలి అందం 

కోయిల కూత 

మామిడి పూత 

వెలుగుల తేట 

పసిడి మూట 

పలుకుల ఈట 

చందమామ 

మేనమామ 

నిండు పున్నమి 

పండు వెన్నెల 

నల్లని చీకటి 

వెలుగుల కిటికీ 

ఇంద్రధనుస్సు 

సంగీతం 

సమ్మోహనం 

యశో వర్షం 

జాతి హర్షం 

పిల్ల తెమ్మర 

అవు పాలు 

సింహం జూలు 

పొలాన పైరు 

తర తరాలకు

తరగని పేరు 

వేటగాని చేతి బాణం 

విలువుల భూషణం 

మధుర భాషణం 

ఒకటేమిటి 

అనంతం 

విశ్వం 


మా ఊరు 


మా ఊరు 

అనురాగాల ఏరు 

ఆప్యాయతల జోరు 

మమతల హోరు 

ప్రేమల సౌరు 

అసమానతల పోరు 

మా ఊరు 

అమ్మ లాలీ 

నాన్న కేళి 

రస రమ్య రంగేళి 

అత్త అబ్బురం 

మామ మురిపెం 

పిన్ని కౌగిలి 

బాబాయ్ పొంగలి 

ముగ్గుల ముంగిలి 

ముద్దులలోగిలి 

ఎరువాకల ఎంగిలి 

పచ్చదనాలా పొదలి 

సారవంత నాగలి 

కట్టుబాటుల తల్లి 

సంప్రదాయం చెల్లి 

ఇదే ఒరవడితో వెళ్లి 

తరించాలి నానాటికి 


గిరి'జా తనయ


గిరి'జనుడు '

ప్రకృతి ఆరాధకుడు

సనాతనవాది

సనూతన వాది

నాగరికత నాధుడు

'ఏక'త్వ లవ్యుడు

సిసలైన మా'నవతా'వాది

మా.... నవతా వాది

పార్వతి సిగలో గిరి పుష్పం

'గిరి'జా తనయుడు

సదా శివ సంచారి

సర్వమయుడు

మోసానికి యముడు

సహృదయుడు

దయామయుడు

నిష్కపటి

మెహమాటి

సుమనస్కుడు

సుందరుడు

విశ్వనరుడు

నాగరికత సంధానకర్త

మానవత్వప్రియుడు

చిలిపి అల్లరి

అటవీ నివాసి

కళా పిపాసి

ముక్కు సూటి మనిషి

మనీషీ మహనీయుడు

ఆదర్శ స్వభావి

విలువుల విలుకాడు

అర్జునుడి చెలికాడు

హృదయాలేలు రేడు

ఆత్మీయతల అందగాడు

మనిషితనం జీవగర్ర

కుళ్ళు కపటానికి ఆ'మడ' దూరం

నాగరికత పునాది రాయి

సదాచార సంస్కృతల కనుదోయి

చెడు విరోధి

అవసర అనవసరాలు తూచు తక్కెడ

మంచి చెడుల జల్లెడ

అభిమానాలు అల్లెత్రాడు

గిరి బాలకుడు

సమస్త భూమండల పాలకుడు

వి"గ్రహా"ల నిగ్రహకుడు

కానుకుల కొండ

ఆశయాల అండ

సర్వ మానవాళి కైదండ

సమస్త ప్రపంచ గ్రంథ సారం

సమస్త విశ్వ జన స్వేద ఫలం

త్యాగమయుడు

ప్రపంచానికి కరుణ(రామ)రసం

రాముడు నడిచిన దారి(రామాయణం)చూపిన బోయవాడు

ధర్మానికి ద్రోణుడు

విక్టరీకి పేటెంట్

గురుకులంలో

శిష్యోన్నతుడు

ప్రకృతి పరిశీలకుడు

నేర్చుటలో నేర్పరి

దూరవిద్య దిట్ట

రాతిని గురువు చేసే బాట

యావత్ శిష్యలోకం తరుపున

గురు రుణం తీర్చిన శరం

మూఢ నమ్మకాల మాడు పగలుకొట్టి

ఆత్మయే పరమాత్మని చాటిన

భక్తకన్నప్ప

ఆత్మాభిమాని

మనిషికి దేవుడికి మధ్య నిచ్చెన

ప్రకృతికి మనిషికి మధ్య వారధి

సజ్జనలకు సారధి

తూర్పు రవి

ప్రపంచాన

ఆది కవి

ఆది గురువు

గురువులకు గురువు

జీవిత పడవ నావికుడు

స్వార్థపు చీకటి చీల్చు వెలుగు

విశ్వావానికి వేకువ

విశ్వసానికి విశ్వం

ఆకాశ కొలనులోని ఈ కలువ

యావత్ మానవజాతి విలువ

అడవి తల్లి పుత్ర

విశ్వ నాగరికత పరిణామంలో

అనితర సాధ్యం నీ పాత్ర


ఆనందం ఆనందం 


ఉదయస్తున్న సూర్యుణ్ణి 

చూస్తే ఆశల ఆనందం 

నింగిలోఎగిరే పక్షుల గుంపు

చూస్తే నయనానందం

చిరుగాలి సంగీతం 

శ్రవణానందం

పుడమిని తాకే తొలకరి చినుకు 

మధురానందం   

మట్టిని చీల్చుకోచ్చే గరిక 

ఆత్మవిశ్వాసానందం 

సెలయేటి పరుగు 

పరిమళానందం 

కోకిలమ్మ కూత 

వీచే గాలి స్పర్శ 

తాకిడి ఆనందం 

పున్నమి వెన్నెల చంద్రుడు 

వెలుగుల ఆనందం 

కోనేటి తామరలు 

స్నేహ ఆనందం 

సిరిమువ్వ కదలిక 

నెమలి నడకలు 

నాట్యానందం 

తెలుగు పలుకులు పలకటం 

జిహ్వానందం 

చిన్ని పాప బోసినవ్వు 

కేరింతలానందం 

అమ్మ తాత నోటి కతలు 

తీయని ఆనందం 

అమ్మ పాడే లాలీ జోలా 

బాల్యం ఆనందం 

నాన్న ఆడించే ఏనుగాట 

విజయాల ఆనందం 

అమ్మ ఊపే ఊయల 

అనురాగపు ఆనందం 

జీవితం పతీ అడుగులోనూ 

బతుకు పతీ మలుపులోనూ 

క్షణం క్షణం పరుగు ఆనందం 

నిమిషం నిమిషం పరుగు ఆనందం 


బాలల ఇష్టం


బాలలం మేము బాలలం 

రేపటి బంగారు భవితకు 

వారసులం 

తునీగ రెక్కలతో 

ఆకాశంలో ఎగరడం ఇష్టం 

పక్షిలా కిల కిల రావాలు 

కూయడం  ఇష్టం 

చిలకమ్మలా చిలుక పలుకులు 

పలకడం ఇష్టం 

నల్లని మబ్బునై వర్షించడం ఇష్టం 

తొలకరి జల్లులో తడిసి ముద్దవడం ఇష్టం 

పైట చాటునుండి అమ్మ స్థన్యం గ్రోలడం ఇష్టం 

అమ్మ గుండెలను నా ఆట స్థలంగా 

మలుచుకోవడం ఇష్టం 

నెల వంకతో 

ఇల వంకలకు దిష్టి తీయడం ఇష్టం 

మురిపెమైన  నా మేను ముత్యాలు 

చెమట చుక్కలంటే నాకిష్టం 

ధైర్యం నాకిష్టం 

సాహసం నాకిష్టం 

నాలా నేనుండడం నాకిష్టం 

బ్రహ్మ రాతను, నా తల రాతను 

అక్షర జ్ఞానంతో  చేరిపేయడం 

నా కిష్టం 

ఆటలు పాఠాలు పాటలు 

నాకిష్టం 

మూఢ విశ్వాసాలు తిరోగమన ఆలోచనల 

అంతు చూడడం నాకిష్టం 

పాత దారులుకు బై బై చెప్పి 

కొత్త దారులు వేయడం.

నాకిష్టం 

వెన్నెల నాకిష్టం 

వేకువ నాకిష్టం 

వెలుగులు నాకిష్టం 

తెలుగు వెలుగు నాకిష్టం 

తెల వారని తెలుగు నాకిష్టం 

అమ్మ అవకాయ గోంగూర నాకిష్టం 

కథామృతం నాకిష్టం 

మురళి గానం నాకిష్టం 

నాకిష్టం నాకిష్టం 

ప్రపంచాన సంపద స్సష్టి 

కులమతాలు కూలదోయడం 

ఎక్కువ తక్కువ వర్గ వైషమ్యాలు తొలగించడం 

నాకిష్టం నాకిష్టం 


ఉడుత ఉడుత ఊచ్ 


ఉడుత ఉడుత ఊచ్ 

మా ఇంటికి ఎందుకోచ్చావ్ ఊచ్ 

ఉడతను ఉడతను ఊచ్ 

మీ ఇంటికి మీ అబ్బాయి కోసం వచ్చాను ఊచ్ 

మా అబ్బాయి తో ఏమీ చేస్తావ్ ఊచ్?

మీ అబ్బాయి తో ఆటలు ఆడుతాను ఊచ్ 

మా అబ్బాయితో ఏం ఆటలు ఆడతావ్ ఊచ్?

మీ అబ్బాయితో కర్ర బిళ్ళ, కోతి కొమ్మాచ్చి, దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళ  ఆటలు ఆడుతానోచ్ 

ఉడుత ఉడుత మా అబ్బాయికి ఏం తెచ్చావోచ్?

మీ అబ్బాయికి తోట నుండి పళ్ళు తెచ్చానోచ్ 

ఉడుత ఉడుత మా అబ్బాయికి ఏం నేర్పు తావోచ్?

ఉడుతను  ఉడుతను మీ అబ్బాయికి పక్షుల కూతలు నేర్పుతానోచ్ 

ఉడుత ఉడుత మా అబ్బాయి నుంచి ఏం నేర్చుకుంటావోచ్?

ఉడతను ఉడతను మీ అబ్బాయి నుంచి తెలుగు అక్షరాలు నేర్చుకుంటానోచ్ 

ఉడుత ఉడుత మా బుడతుడికి చివరిగా ఏం చెప్పుతావోచ్?

మీ బుడతుడికి స్నేహమేరా జీవితం స్నేహమే రా శాశ్వతం అని చెబుతానోచ్!!!


చిలుకమ్మ చిట్టీ కానుక 


చిలుకమ్మా... చిలుకమ్మా 

రావమ్మా మాఇంటికి 

వచ్చి కానుకలీయవమ్మా

 మా బుజ్జాయికి 

అడవి నుంచి వచ్చిన 

చిలుకమ్మను చిలుకమ్మను 

చిట్టీ చిలుకమ్మను 

పొట్టి చిలుకమ్మను గట్టి చిలుకమ్మను 

మీ బుజ్జాయి దగ్గరకు వచ్చాను 

కానుకలెన్నో తెచ్చాను 

బుజ్జిగాడికి చిలుక పలకులు తెచ్చాను 

పచ్చ పచ్చని రంగును తెచ్చాను 

జామ పల్లును తెచ్చాను

కోకిలమ్మ లాలీ పాటను తెచ్చాను  

కోతిబావ చేష్టలు తెచ్చాను 

కలకాలం బతకాలని కాకమ్మ ఆశీర్వాదం తెచ్చాను 

హంస గుణంను తెచ్చాను 

తునీగ రెక్కలు తెచ్చాను 

పక్షుల కూతలు తెచ్చాను 

అడవి అందాన్ని తెచ్చాను 

తేనె తీయదనం తెచ్చాను 

కారుమబ్బును కాటుకగా తెచ్చాను 

కొండముచ్చు ముఖాన్ని దిష్టి బొమ్మగా తెచ్చాను 

నదిలో నడిచే పడవను తెచ్చాను 

లేగ దూడ చెంగును పాల పొంగును 

తెచ్చాను 

లేడీ దూకుడును నెమలి నాట్యన్ని తెచ్చాను 

ఏటి పరుగును సెలయేటి జీలుగును తెచ్చాను 

వెన్నెల చల్లదనాన్ని మేఘం ఘర్జనను తెచ్చాను 

చిలుకమ్మ తెచ్చిన చిట్టీ కానుకలు 

మీ బుజ్జాయికి నూరేళ్ళ ఆయువులు 

పేరు ప్రఖ్యాతులు సిరులు శ్రీమంతాలు 


సీతకోకచిలుక 


సీతకోకచిలుక 

సప్తవర్ణాల చంద్రిక 

రైతుకు చేయూత 

పుప్పొడి మేత 


పువ్వు పువ్వుకు నేస్తం 

పువ్వులపై నీ సంతకం 

సృష్టిని కళ్ళకు కట్టడం 

పువ్వుకు పువ్వుకు 

పర పరాగ సంపర్కం 

సీతకోకవల్లనే సాధ్యం 


పువ్వు చుట్టూ నీ చక్కర్లు 

మౌన సంగీతాలు 

సప్త రాగాల సంగీతం 

నీ సప్త వర్ణాల సొంతం 

సప్త వర్ణ శోభత నీ జీవితం 

సృష్టిలో మిగిలిన జీవులకు ఆదర్శం 


పేరులో చిలుకున్న 

రామచిలుకవు కావు 

ప్రకృతిలోని రంగులను 

కోకగా చుట్టుకున్నావు 

కోక పేరుతో ఉన్న నువ్వు 

ఆధునిక పోకడలకు బహు దూరం 

అవునఆధునిక పోకడలకు పొతే 

సృష్టిని ఎలా నడపగలవు 

పువ్వును పిందెగా ఎలా మార్చుతావు?

రైతుకు, మానవునికి ఎలా సాయపడగలవు?


సీతకోక చిలుక 

నీ శ్రమైక్య జీవన సౌందర్యం 

మానవుల సొంతం 

నీ ఓపిక సహనం 

మానవులకు అవసరం 

నీ శ్రమ జీవితం నుండి 

మానవులెంతో నేర్చుకోవాలి 

నీ జీవితాన్ని ఆదర్శంగా 

తీసుకొనిస్తావా? సీతకోక చిలూకా?

పువ్వు రెమ్మలాంటి 

లేలేత రెక్కలకు 

మానవుల సలాం 

నీ రెక్కలు ఆడాలి 

సృష్టి కొనసాగాలి 

మానవుల డొక్కలు 

గాదెలు నిండాలి 

సీతాకోక చిలుక 

గాధలు విశ్వమంతా వినిపించాలి 


బొప్పాయి మా ఇంటి పాపాయి

 

బొప్పాయి 

మా పెరటి చెట్టు పాపాయి 

మా ఇంటి బుజ్జాయి 

షుగర్ ఉన్న వాళ్ళు తింటే హాయి 

ఔషధ గుణాలెన్నో బొప్పాయి లో 

కలవోయి 

విటమిన్లు ఉన్నాయి బొప్పాయిలో 

ఖనిజలవణాలున్నాయి బొప్పాయిలో 

ధర తక్కువ 

ఫలితం ఎక్కువ బొప్పాయితో 

తరచూ బొప్పాయి 

తినవోయి పాపాయి 

ఆరోగ్యమెంతో మెరుగుపడునోయి 

ఆకలికి బొప్పాయి 

అమ్మ చేతి గోరుముద్దొయి 

రా చిన్న బొప్పాయి తిందాం 

రా కన్న ఆరోగ్యం కాపాడుకుందాం 

బొప్పాయి బొప్పాయి 

మా పెరటి బుజ్జాయి 

మా ఇంటి పెన్నిదోయి 


బువ్వ తిందాం 


బువ్వ తిందాం 

బుద్దిగా ఉందాం 

మంచి బుజ్జాయిలు గా ఉందాం 

పెరుగు బువ్వ తిందాం 

ఏపుగా పెరుగుదాం 

పాల బువ్వ తిందాం 

ఇతరుల బాధల్లో 

పాలు పంచుకుందాం 

చారు బువ్వ తిందాం 

చలాకిగా ఉందాం 

గంజి బువ్వ తిందాం 

గట్టిగా తయారవుదాం 

రాగి బువ్వ తిందాం 

రాటు దేలుదాం 

సజ్జల బువ్వ తిందాం 

తాజాగా ఉందాం 

అమ్మ చేతి బువ్వ 

అమృతం కాదా?

పప్పు బువ్వ తిందాం 

పడనిసలు పాడుదాం 

నాన్నమ్మ చేతి బువ్వ తిందాం 

నాయుకులుగా తయారవుదాం

అమ్మమ్మ చేతి బువ్వ తిందాం 

ఆనందంగా తయారవుదాం 

అత్తమ్మ చేతి బువ్వ తిందాం 

అందంగా తయారవుదాం


వెలుగు వేకువులం 


పిల్లలం పిల్లలం 

వెలుగుకి వేకువులం 

చీకటి చీల్చు 

చిరు దివ్వెలం  

ఆటపాటల 

అరుణ కిరణాలం 

వివేక సూర్యులం 

మట్టిలో మాణిక్యాలం 

రాటుదేలిన 

రత్నాలం 

సూర్యోదయం 

పూర్వం నిద్రలేస్తాం 

పొద్దున్నే పుస్తకాలు 

చదువుతాం 

చక్కగా స్నానం చేసి 

ఉతికిన బట్టలు కట్టుకుంటాం 

తలను దువ్వుతాం 

అందంగా ముస్తాబు 

అవుతాం 

తల్లితండ్రులకు 

నమస్కరించుతాం 

వడి వడిగా 

బడికి పోతాం  

పలక బలపం 

చేత పట్టేస్తాం 

అక్షరాలతో 

దేశ భవిష్యత్తు 

దిద్దుతాం 

అసమానతలను 

సరిచేస్తాం 


 

మౌనమే నీ భాష

============

మౌనమే నీ భాష

ఓ తరుణీ మనసా....

అమ్మగా, అక్కగా, ఆలిగా

విభిన్న పాత్రలు

నిజజీవితంలో పోషిస్తూ

ఎన్నెనో అవమానాలు ఎదురుకుంటున్న

వాటన్నింటికి సమాధానం

నీ మౌనం

నీ చిరునవ్వు

పల్లెత్తి మాటాడవు

ఎందుకుంటే

మగాళ్ల తల రాత

నీ చేతు(త)ల్లోనే....

నీ స్పర్శ లేని రోజు

యావత్ పురుష జాతి

పెను తుఫానికి వణుకుతున్న

చిగురుటాకవుతుంది

నీ సహనం భూమాతకు

సరిసమానం

నీవు లేని రోజు పురుష జాతి

మనుగడ ప్రశ్న్తార్ధకం

పుడమిపై పూచిన అరుదైన

పూకొమ్మవు నువ్వు

నిన్ను పూజించిన ఎడ

సకల దేవతలును పూజించినట్టే

నిన్ను తూలనాడిన చోట

సకల దేవతల మానానికి భంగం కలిగినట్టే

బ్రహ్మ మొదటో బొమ్మ గీస్తే

అది అమ్మయింది

అమ్మకు ఆది అంతం లేదు

ముల్లోకాల్లో

అమ్మ జగతి స్వరూపం

అమ్మకు అవమానం

సర్వ జగతకు ప్రమాదకరం

అవనిలో ఆణువణువన అమ్మే

అమ్మే లేని చోటు

అతివ లేని ఇల్లు

ఎంత వెదికినా

ప్రపంచాన కానరావు

అవతార పురుషులు సైతం

అమ్మ గీసిన బొమ్మలే

అతివ ఎప్పుడూ సబలే

ఎందుకంటె అతివ లేని చోట

చీకటి మయం

అతివ తెగువ చూపనినాడు

అబలే

కాబట్టి మగువులు ఈ మగాళ్లని పురుషోత్తములుగా

శ్రీరామ చంద్రులు గా తీర్చి దిద్ది

మగ జాతిని తరింప చేస్తారని........

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో

మీ తనయులు 


రావోయి విద్యార్థి 

-----------------------

రావోయి విద్యార్థి

బడికి రావోయి విద్యార్థి 

బడిని పిలిస్తున్న 

భవిష్యత్తుని పిలుస్తున్న 

తేట తెలుగు నిస్తా 

వేకువ వెలుగు నిస్తా 

కలిమినిస్తా 

చెలిమినిస్తా 

జుంటి తేనె నిస్తా 

ఆవు పొదుగులో 

పాలనిస్తా 

లేగ దూడలనిస్తా 

జింక పిల్లల్నిస్తా 

జున్నును ఇస్తా 

పనస తొనలనిస్తా 

పంచదార నిస్తా 

ఆవకాయ నిస్తా 

అరిటాకు భోజనమిస్తా 

గోంగూర పచ్చడిస్తా 

అమ్మ నవుతా

అమ్మ పాట నవుతా

ఏరు నిస్తా 

ఏటిలోని పడవునిస్తా 

పడవ తెరచాపనిస్తా 

హరివిల్లునిస్తా 

ఆకాశాన్ని ఇస్తా 

మెరుపు నిస్తా 

కొసమెరుపు ఇస్తా 

మబ్బు నిస్తా 

వాననిస్తా వరదను ఇస్తా 

తాటి ముంజు లిస్తా 

రావోయి విద్యార్థి 

రావోయి విద్యార్థి 

బడిని పిలుస్తున్నా 

బంధాన్ని పిలుస్తున్నా 


పాపాయి 


పాపాయి 

ఇటు రావోయి 

చందమామనిస్తాను 

చల్లగాలిని ఇస్తాను 

మా బుజ్జాయితో ఆడుకోవోయి 

అందాల బుజ్జాయి 

మా నోముల పంట 

మా బుజ్జాయి ఏడిస్తే 

నే చూడలేను 

రావోయి రావోయి పాపాయి 

మిఠాయిలిస్తాను 

లడ్డులు, జిలాబిలిస్తాను 

తల్లో ముడచుకోవడానికి 

గులాబీలిస్తాను 

చామంతులు, బంతి పూలు ఇస్తాను 

ఆడుకోటానికి ఆటబొమ్మలిస్తాను 

రావోయి బుజ్జాయి 

నీ నవ్వుమాకీయవోయి  

నీవు మా బుజ్జాయి దగ్గరకొస్తే 

ఆటలు నేర్పుతాను 

పాటలు నేర్పుతాను 

మంచి మంచి కథలు చెపుతాను 

కిత కితలు పెడతాను 

నవ్విస్తాను 

అమ్మానై అన్నం పెడతాను 

ఆనక పాలు పెడతాను 

ఆకలి తీర్చుతాను 

బుజ్జాయి బుజ్జాయి 

నాకో ముద్దుఇవ్వవోయి 

మా పాపాయి కీ నీకు స్నేహం 

కుదిరితే అదే పదివేలోయి 

బుజ్జాయి బుజ్జాయి 

ఇటు రావోయి ఇటు రావోయి


కమలం ఆ నయనం


కమలం లాంటి కన్నులతో

కులుకుతున్న నీ ఆదరం మధురం

తుమ్మెదల ఝాంకారాలతో నీ అదర మధుర సుధలు గ్రోలి

నీ కమ్మని లేలేత పురేకుల్లాంటి పెదవులపై పనస తొనల లాంటి నా పెదాలు పదాలు పలికితే

ఆ అమృతపు స్పర్శ

నీ నిశ్వానం

ఆ నయాగరా ఝరి నా ఉచ్చ్వసం

అదైత్వత ఆ మన మనువుల

కమనీయము రమనీయ సంభాషణ

మనోల్లాస తటాకంలో నావ వలె పయనించుచున్నది నిరంతరం  


తపోవనిత


నీ ముగ్ద సుమనోహర

సుందర రూపం

తామర పూవులాంటి కనురెప్పల కింద నీవు కన్న కలలో

నా రూపం అపురూపం

తదేక దృష్టితో తపోవనితవై

నన్ను ధ్యానించు నీ కొంటెతనం

నాలో చైత్రమై భావేశ అంకురాలు రగుల్కొల్పుతుంది

నా మనుసులోంచి జాలువారిన ప్రేమక్షరాలు

మన్మధుని చేతి చెరుక కోరికలై

చెలరేగుతున్నాయి

ఆహా సుందర లావణ్యం

వేయి వేణువులు నా హృదిలో

మొగిస్తున్నాయి

సుస్వప్న లోకాల ప్రేమ దేవత

ప్రత్యేక్షమై

నా జన్మను చరతార్దమ్ చేసింది. 


సర్వం కల్తీమయం 


కల్తీ కాసుల కక్కుర్తి 

ఓసిల జాస్తి 

తేరగా తెరచాటు కుస్తీ 

ప్రజలకు కస్తి 

విలువల స్వస్తి 

వివేకంనాస్తి 

రాజకీయ నాయకుల హస్త వాసి 

పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం 

కల్తీ కల్తీ సర్వం కల్తీ 

వ్యవసాయంలో విత్తనాలు కల్తీ 

దవాఖానాల్లో మందులు కల్తీ 

పిల్లల పాలు కల్తీ 

స్వామీ వారి ప్రసాదంలో 

నెయ్యి కల్తీ 

తల్లీ పాలులో కల్తీ 

విషపు మందులు వలన 

హోటల్ ల్లో ఆ హారం కల్తీ 

త్రాగు నీరు కల్తీ 

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు కల్తీ 

పురుగులు మందులు కల్తీ 

పిల్లల పుస్తకాలు కల్తీ 

బడి భోజనం కల్తీ 

గాలి కల్తీ 

సంసారాలు కల్తీ 

సన్యాసం కల్తీ 

ప్రేయసి ప్రియురాలు కల్తీ 

ప్రియుడు కల్తీ 

సింగారం కల్తీ సిగ్గు కల్తీ 

బంగారం కల్తీ 

బంగారం లాంటి శృంగారం కల్తీ 

మనుషుల మనసలు కల్తీ 

మనసుల ప్రేమలు కల్తీ 

బంధాలు కల్తీ 

అనుబంధాలు కల్తీ 

పిల్లలు కల్తీ 

పెద్దలు కల్తీ 

పంటలు కల్తీ 

ఏ చోట చూసిన ఏముంది సర్వకారణం 

సర్వం కల్తీల మయం 

స్వాహాల పర్వం 

అదే అదే కలికాలం 

మనుషుల పోయే కాలం 

మనుషులు కళ్ళు తెరిచి 

ఓట్ల కల్తీ ఆపకపోతే 

ఇక అంతే(గా) అంతే(గా)


శాస్త్ర విజ్ఞానం 


శాస్త్ర విజ్ఞానం 

శాస్త్రీయం శాస్త్రీయం 

సశాస్త్రీయం సశాస్త్రీయం 

శుభోదకం సుభోదకం 

వ్యక్తం అభివ్యక్తం 

తర తరాల మానవ మేధో వికాసం 

యుగ యుగాల మానవ నాగరికత పరిమళం 

తరగని తారా లోకం 

ప్రశ్న సుపుత్రం 

జిజ్ఞాస మేరు నగం 

ఆసక్తి వేరు తనం 

ఆలోచన పేరు ధ(ద)నం 

మస్తిష్క రవి కిరణం 

మానవుని తొలి సంతకం 

మానవుని మరో జన్మ 

నరుని కన్న అమ్మ 

నరవతార నాంది ప్రస్థానం 

ఆచారాల ప్రయోగ శాల 

ఆచరణల అనుభవ శీల 

శాస్త్ర సంకేతం 

శాస్త్ర సాంకేతికం 

సూర్యుని నుదుటిన తిలకం 

చంద్రునిలోని కమలం 

మానవ ఆవిరళ కృషి ఫలితం 

మానవ అనంత గగన ప్రయాణం 

మానవీయ కోణం 

శివుని మూడో నేత్రం 

మానవుని రక్త నిప్పు కణం 

భగభగమండే సూర్య గోళం 

దృఢంలో వజ్రం 

మానవ చరిత్రలో కేడియం బంగారం 

మానవ ప్రయత్నపూర్వక జ్ఞానోదయం 

ఊషోదయం నిశోదయం విజ్ఞానోదయం 

నీరషోదయం పరిశోధనల మయం 

జగం సర్వం శాస్త్ర మయం 

శాస్త్రం లేని జగం శూన్యం 

విజ్ఞానం లేని లోకం అనూహ్యం 



*** 


రాళ్లబండి సంగం నాయుడు

-రాళ్లబండి సంగం నాయుడు


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page