సంత్ ఏకనాథ్
- Pratap Ch
- 2 days ago
- 2 min read
#Ch.Pratap, #ఏకనాథ్, #Santh Ekanath, #TeluguDevotionalStory

Santh Ekanath - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 06/07/2025
సంత్ ఏకనాథ్ - తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
ఏకనాథ్ మహారాజ్ వార్కరీ సంప్రదాయానికి చెందిన గొప్ప తపస్వి, మరాఠీ సాహిత్యంలో భక్తి ఉద్యమానికి నిలయంగా నిలిచిన ధార్మిక ప్రముఖుడు. 1533లో మహారాష్ట్రలోని పైఠాన్ గ్రామంలో జన్మించిన ఆయన, చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. తాత భానుదాస్ ద్వారా భక్తి మార్గం అభివృద్ధి చెందగా, గురువు జనార్దన్ స్వామి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక బాటలో అడుగులు వేసారు.విఠోబా భగవంతుడి నిష్ఠ భక్తుడిగా ఏకనాథ్ తన జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేశారు. జ్ఞానేశ్వరుడు, నామదేవుల వంటి తపోనిష్ఠుల తరం తరువాత, తుకారాం, సమర్థ రామదాసుల వంటి భక్తులకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఆయన రచనలు, ఆచరణలు భక్తి, సమానత్వం, సహనానికి జీవాంతకంగా మారాయి.ఆయన యాత్రల ద్వారా దేశమంతా సంచరించి, వృద్ధావన్, ప్రయాగ్, బద్రీ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ‘ఏకనాథ భాగవతం’, ‘భావార్థ రామాయణం’ వంటి రచనలు ఆయన తాత్విక దృక్కోణాన్ని ప్రతిబింబించేవి. భరూద్ పాటల ద్వారా సామాజిక చైతన్యం కలిగించారు.ఏకనాథ్ తన తత్వంలో శుద్ధతకు అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. “మానసిక పవిత్రత లేకుండా బాహ్య పవిత్రత నిస్సారమైనది” అనే భావనను ప్రబోధించారు.
దేవుడు అందరిలో ఉన్నాడని, కుల, మత, జాతి అనే భేదాలన్నీ మానవకృతమని స్పష్టం చేశారు. నిజమైన తపస్వి లక్షణం ఇతరుల లోపాలను కోపం లేకుండా అంగీకరించగలగడమే అని ఏకనాథ్ మహారాజ్ విశదీకరించారు. భక్తి లేకపోతే జ్ఞానానికి ప్రాముఖ్యత లేదని, అలాగే భక్తిలో అనుభూతి లేకుండా జీవన పరిపూర్ణత సాధ్యం కాదని ఆయన అభిప్రాయం.
భక్తి మార్గంలో ప్రేమ, వినయం, అహంకార విరహితం, సమాజ సేవ వంటి గుణాలను అత్యంత కీలకమైనవిగా పేర్కొన్నారు. భక్తి, జ్ఞానం, కర్మ — ఈ మూడింటినీ సమతుల్యంగా సమన్వయం చేసుకుంటూ, జీవితం ద్వారా భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించాలన్నదే ఆయన తాత్త్విక దృక్కోణం. భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ సమానులే; భగవంతుని ముందు ఎటువంటి భేదాలు ప్రసక్తించవని ఆయన రచనలు నిశ్చితంగా ప్రకటించాయి.
ఆయన జీవితం చివర్లో గోదావరి నదిలో జలసమాధి తీసుకున్న ఘట్టాన్ని గుర్తుగా ‘ఏకనాథ షష్ఠి’గా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతారు.ఏకనాథ్ మహారాజ్ రచనలు అజరామరమైనవిగా నిలిచాయి. తరం తరాలకు మార్గదర్శకంగా నిలిచి, లక్షలాది హృదయాలను మారుస్తూ, ధర్మం, భక్తి, సమానత్వాన్ని చాటిచెప్పే ధార్మిక ప్రసాదంగా నిలిచారు.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.
Comments