top of page
Original.png

ఎర్రటి గులాబీల మధ్య ఎర్రటి రక్తం

#PuliRevanth #పులిరేవంత్, #సైనికులు, #Army, TeluguSpecialArticle


Errati Gulabila Madhya Errati Raktham - New Telugu Article Written By Puli Revanth Published in manatelugukathalu.com on 15/02/2026

ఎర్రటి గులాబీల మధ్య ఎర్రటి రక్తం - తెలుగు వ్యాసం

రచన: పులి రేవంత్


ఒకవైపు ఎర్రటి గులాబీ పూలతో ప్రేమికులు, మరోవైపు ఎర్రటి రక్తపు గుండెలతో సైనికులు.


ఒకవైపు చుట్టూ సమాజాన్ని మరిచిన మైకం, మరోవైపు సైనికుల బలిదానాలపై కన్నవారి శోకం.


ఒకవైపు కామంతో కూడిన హద్దులు దాటిన ముద్దులు, మరోవైపు కడతేరి పోయినోడి ఆ భార్య కన్నీటి ముద్దులు.


ఒకవైపు పార్కుల్లో, పబ్బుల్లో మితిమీరిన కామ దేహాలు, మరోవైపు ఆంబులెన్సుల్లో, జీపుల్లో సైనికుల కాలిన దేహాలు.


ఒకవైపు టీవీల్లో అమర ప్రేమ అంటూ గగ్గోలు, గప్పాలు, మరోవైపు కన్నీటిలో ఆ అమరవీరుల పిల్లలు, వాళ్ళ జీవితాలు.


దేశంలో పడక సుఖానికి, ప్రేమకి, కామానికి అలవాటు పడ్డ, కాదు కాదు పడేట్టు చేసే ఈ మీడియా మార్కెటింగ్ కి ఒక్క లైన్, ఒక్క లైన్ అమరవీరుల కథలను, వారి కుటుంబ ప్రేమ గాథలను రాయగలరా? కనీసం చూపించగలరా? ఇక మన బిజీగా ఉన్న మహా యువత అయితే ఒక్క స్టేటస్ అయినా ఈ జవాన్ల గురించి పెట్టగలరా?


ముక్కలు ముక్కలుగా పడివున్న ఆ శవాల దిబ్బలపై జరుపుకోండిరా మీ ప్రేమికుల దినాన్ని, మీ దినాన్ని.


ఓ వీర జవానుడా! ప్రేమికుల దినమంటూ, ఫిబ్రవరి 14th అంటూ మీ త్యాగాలను పట్టించుకోకుండా, మిమ్మల్ని స్మరించుకోకుండా, దేశం కోసం బలిదానమైన ఓ అమర జవానుడా! నీకు జోహార్లు. కన్నీటి వీడ్కోలు. జై జవాన్, జై భారత్, భారత్ మాత కీ జై.


-పులి రేవంత్

భాగ్యనగర్


పులి రేవంత్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:పులి రేవంత్

సామాజిక, సాంస్కృతిక, దేశభక్తి మరియు దేశ రాజకీయ అంశాలపై వ్యాసాల రచన పై ఆసక్తి. సమాజంలో చైతన్యం కలిగించే అంశాలను స్పష్టంగా, ప్రభావవంతంగా పాఠకులకు అందించడమే నా రచనల ప్రధాన లక్ష్యం. నేను B.com (Honours) పూర్తి చేసి ప్రస్తుతం LLB చదువుతున్నాను. నేను చదువుకుంటూ విద్యార్థి సంఘం లో విద్యార్థుల సమస్యల పై పోరాడుతుంటాను. నాది భాగ్యనగర్ నివాసం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page