జీవిత సారం

Jeevitha Saaram - Telugu Inspirational Article | Thokala Rajesham
జీవిత సారం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | తోకల రాజేశం
Published in manatelugukathalu.com on 23/10/2026
జీవితం అంటే ఏమిటి? కష్టాలు, అనుభవాలు, విజయాలు మనకు నేర్పే జీవిత సత్యాలు ఏమిటి? తోకల రాజేశం రచించిన “జీవిత సారం” వ్యాసం పట్టుదలతో ముందుకు సాగుతూ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి స్ఫూర్తినిస్తుంది.
మహాసముద్రం లోతును ఎవ్వరూ ఖచ్చితంగా నిర్ధారించలేరు. అలాగే జీవితాన్ని కూడా 'ఇది' అని చూపెట్టలేం. జీవితం అంచనాలకు అందనిది.
జీవితం గురించి ఎవ్వరు ఏం చెప్పినా అవన్నీ పాక్షిక సత్యాలే. ఆకాశం మనకు అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది, కానీ అది అందదు. నిజానికి ఆకాశం అనేది ఏదీ లేదు.
అనంతమైన శూన్యాన్ని మనం ఆకాశంగా భ్రమపడుతున్నాం. జీవితం కూడా అంతే. 'తామరాకు మీది నీటిబొట్టు లాంటిది' బతుకు. ఒక మనిషి బతుకుతూ ముందుకు వెళ్లడం బతుకు.
ఆ బతుకు సమాజంతో అల్లుకుపోతేనే అది జీవితమవుతుంది.
అంతా మన చేతుల్లోనే ఉందనుకుంటాం. కానీ మన ప్రమేయం లేకుండా జరిగే సంఘటనలు ఒక్కొక్కసారి మన జీవితాన్ని శాసిస్తాయి.
అనుకూల ప్రభావాన్నో, ప్రతికూల ప్రభావాన్నో కలిగిస్తాయి. అట్లాంటి సందర్భాల్లో మన చేతిలో ఏదీ లేదనే నిస్పృహ కలుగుతుంది.
దాన్ని పట్టుకొని ముందుకు వెళితే ఎవరూ ఏదీ కూడా సాధించలేరు. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతుంది.
జీవితాంతం పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. నిస్పృహ ఆవరించిన పరిస్థితులలో జీవితం మన చేతుల్లో లేదనే నిర్ధారణకు వచ్చి మన చలనశీలతను కోల్పోకూడదు.
ఒకరకంగా ఆలోచిస్తే జీవితం మన చేతిలోని మట్టిముద్ద. దానితో మనకు నచ్చిన ఆకృతిని మలుచుకోవచ్చు. జీవితాన్ని కళామయంగా మార్చుకోవచ్చు.
లోకంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే మనకు ఒక జీవిత సత్యం బోధపడుతుంది.
వారెవరి జీవితాలు కూడా మొదట్లో 'వడ్డించిన విస్తరి' లాంటివి కావు. చాలా మామూలు మనుషులు వాళ్లు.
ఒక పూట కూడా తినడానికి తిండిలేని దైన్యం నుంచి ధైర్యాన్ని కూడగట్టుకొని జీవితాలను గెలిచినవాళ్లు.
ఏ రంగంలో తీసుకున్నా మనకు ఆదర్శంగా నిలబడగలవాళ్లందరూ నిజాయితీగా కష్టపడటం ద్వారా మాత్రమే ఎదిగినవాళ్లు.
అబ్దుల్ కలాం లాంటి వాళ్ల జీవితాలను అధ్యయనం చేస్తే ఈ సత్యం బోధపడుతుంది. విజయానికి దగ్గరి తోవలు ఉండవు.
అలాగే జీవితం 'ఇదిగో ఇలాగే సాగాలనే నిబంధనలకు' అసలు లొంగదు. అందుకే ప్రసిద్ధ కవి బాలగంగాధర తిలక్ "న్యూ సిలబస్" అనే కవితలో— 'ప్రిజం లాంటిది జీవితం, వేర్వేరు కోణాలను ప్రదర్శిస్తుంది' అంటాడు.
మనిషి జీవితం విస్తారమైనది. అందులో అనేక సామాజిక అనుభవాలు ఉంటాయి. అవే ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి.
జీవితం సరళరేఖ సాగినట్టు నడుస్తుంది అనుకుంటే పొరపాటు. సరిగ్గా చెప్పాలంటే జీవితం అచ్చంగా ఒక నదిలాంటిది. నది అనేక కాలువలను తనలో సంలీనం చేసుకుంటుంది.
పెద్ద పెద్ద కొండలు అడ్డుతగిలినప్పుడు తలవంచుకొని పక్కదారిలో వెళ్తుంది. చిన్న చిన్న పర్వతాలు వస్తే కోసుకుంటూ ముందుకు సాగుతుంది.
భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తన గమనాన్ని మార్చుకుంటూ ముందుకే నడుస్తుంది. తన పరిసరాలను పచ్చగా దీవిస్తూ హుందాగా నడుస్తుంది.
జీవితం కూడా తన దారిలో ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగితేనే పదిమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇదే జీవిత సారం.
— తోకల రాజేశం
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.







Comments