అద్భుతం
- Santhosh Sarma Lakkaraju

- Jul 30
- 1 min read
Updated: Aug 1
సంతోష్ శర్మ లక్కరాజు, అద్భుతం, నిశా సేద్యం, తెలుగు కవితలు, ప్రకృతి కవితలు, భావ కవితలు, ఆధునిక తెలుగు కవిత్వం, తెలుగు సాహిత్యం, కవిత

Adbhutham - Telugu Emotional Poem | Santhosh Sarma Lakkaraju
అద్భుతం - తెలుగు భావోద్వేగ కవిత | సంతోష్ శర్మ లక్కరాజు
Published In manatelugukathalu.com on 30/07/2026
ప్రకృతిలో ప్రతిరోజూ కనిపించే అద్భుతాలను మనం ఎంత సులభంగా మరిచిపోతామో, అలాగే రాత్రి నిశ్శబ్దంలో మనసులో మొలిచే ఆలోచనలు ఎలా కవితలుగా రూపాంతరం చెందుతాయో ఎంతో అందంగా ఆవిష్కరించిన రెండు భావగర్భిత కవితలు ఇవి. సంతోష్ శర్మ లక్కరాజు రచించిన "అద్భుతం" మరియు "నిశా సేద్యం" కవితలు ప్రకృతి సౌందర్యం, మానవ అంతరంగం, సృజనాత్మకతను హృదయానికి హత్తుకునేలా చిత్రిస్తాయి.
అద్భుతం
పెరట్లో పూసే పువ్వు
విరుచుకుపడే సముద్రం
వెలుగు వేడుల రవి
చలువ వెన్నెలల శశి
కనపడకుండా వంటిని తాకే గాలి
మబ్బులు పగిలి కురిసే వర్షం
కదలని కొండ
ప్రవహించే నీరు
ఇవన్నీ అలవాటైపోయిన అద్భుతాలు
ఆగి గమనిస్తే అబ్బురపరిచే సృష్టి సౌందర్యాలు
నిశా సేద్యం
నిద్రపోదామని ఇప్పుడే కళ్ళు మూసాను
ఎవరో నా తడి గుండెలో తలపుల విత్తులు చల్లారు
ఎప్పటిదో ఒక శోకపు జల్లు హోరు హోరుగా కురిసింది
కొన్ని విత్తులు కవితలలా మొలుస్తున్నాయ్
మరి కొన్ని పురిట్లోనే నశిస్తున్నాయ్
ఇక నాకు నిదుర లేదు
***





Comments