top of page

సీతాకోకచిలుక - పుస్తకావిష్కరణ

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Seethakokachilika, #సీతాకోకచిలుక, #బాలగేయాలు, #పుస్తకావిష్కరణ

ree

గద్వాల సోమన్న "సీతాకోకచిలుక" పుస్తకావిష్కరణ ఆలూరులో


Seethakokachilika - Book Unveiling ceremony At Alur - Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/08/2025

సీతాకోకచిలుక - పుస్తకావిష్కరణ - తెలుగు వ్యాసం

రచన: గద్వాల సోమన్న


నందవరం మండల పరిధిలోని నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త బాలబంధు గద్వాల సోమన్న రచించిన 75వ పుస్తకం "సీతాకోకచిలుక"పుస్తకావిష్కరణ కృష్ణాష్టమి సందర్బంగా బ్రెయిలీ భగవద్గీత ఆలయం, ఆలూరు, కర్నూలు జిల్లాలో ఘనంగా జరిగింది. జనప్రియ కవి, పద్య కిరీటి ఏలూరు వెంగన్న, విశ్రాంత ప్రధానాచార్యులు డా. యన్. రంగస్వామి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు యన్. పి. వీరస్వామి, ప్రపంచ తొలి బ్రెయిలీ భగవద్గీత అనువాదకర్త, గీతావధాని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు బూర్గ తిక్క లక్ష్మన్న మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద పుస్తకావిష్కరణ గావించారు. అనంతరం ఈ పుస్తకాన్ని క్రిష్ణారెడ్డి కాపిరెడ్డి దంపతులకు అంకితమిచ్చారు. అత్యల్ప కాల వ్యవధిలో 77 పుస్తకాలు ముద్రించి, పలు చోట్ల ఆవిష్కరించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న కవి రవి గద్వాల సోమన్న విశేష కృషికిగాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభ సమన్వయకర్త శ్రీమతి మహాదేవమ్మ, విశ్రాంత గ్రంథాలయ అధికారి నీరుగంటి వెంకటేశ్వర్లు, కవులు, కళాకారులూ, భక్తులు, ఆలయ కమిటీ కార్యవర్గం, కార్యకర్తలు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. 'సీతాకోకచిలుక 'కృతికర్త గద్వాల సోమన్నను పాఠశాల హెడ్మాస్టర్ ఏ. జాన్సన్, తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు అభినందించారు. 











-గద్వాల సోమన్న













Comentarios


bottom of page