top of page
Original.png

సేవే జీవనార్థం

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #SeveJeevanartham, #సేవేజీవనార్థం


Seve Jeevanartham - New Telugu Poem Written By Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 04/12/2025

సేవే జీవనార్థం - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


సకల ప్రాణులన్నీ దైవ సృష్టి

సమస్త జీవరాశులను చూడాలి సమదృష్టి 

సర్వ జీవకోటి హృదయాల్లో పరమాత్మ రూపం 

సేవే సత్యం

మానవుడే నిజమైన దైవ ప్రతినిధి సేవే నిత్యం


ప్రేమ, సేవా భాగ్యం 

మానవులకే సాధ్యం

మదర్ థెరిసా మన కాదర్శం 


సత్య అహింసలే దైవం సేవే ధర్మం

మనసు ధర్మం మానవ లక్షణం

 అబద్ధం, ప్రాణ హాని తనకే నష్టం


నిత్య సత్య కర్మ లన్నీ భగవదర్పనం ప్రధానం

అరిషడ్వర్గాల త్యజించి

ఆత్మానుభూతి లో ఆధ్యాత్మిక జీవనం ఆచరణాత్మక సత్కర్మలే 

భక్తికి ముఖ్యం యోగులే ఆదర్శం 


అనాధలకు, రోగ పీడితులకు చేసే సాయం ఎంతో విలువైనా 

దానం, తపస్సు, 

యజ్ఞం మానవ ధర్మం 

భగవంతుని శరణo కోరు భక్త జనుల సేవే జీవనార్థం


 కోరికలు కోరు 

భౌతిక దేహం అశాశ్వతం

జీవాత్మ పరమాత్మ చేరడం శాశ్వతం

 

మూగజీవాల రక్షణ, అంగ వైకుల్యం పట్ల ఆదరణ మానవుడి తో ఈశ్వరునికి ఆనందం 


మంచి మనసుతో పంచుటే ఇతరుల కష్టాలు తీర్చుట పరమార్థం

మానవ సేవే మాధవసేవ చేతల తో చైతన్యం

హృదయంతో హితసేవే ఇస్తుంది మధురానందం 


కాయ కష్టజీవుల, 

చెమట చుక్కల ప్రేమించి 

గౌరవించుట మాధవసేవ 


తల్లిదండ్రుల సేవ, పిన్నల పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవం నిత్య సత్కర్మలను భగవత్సంబంధం ప్రధానం శాశ్వత పుణ్యం



ప్రకృతి సేవే పరమాత్మ ఆశయం

వృక్షజాతులను వృద్ధి చేయు

 వృత్తు లను గౌరవించి ప్రోత్సహించు పాడిపంటలను పెంపొందించు

ధరణి మాతను సేవించు జీవితం పవిత్రం 


సకల భూతములను ఆదరించు 

నేను, నాది కన్నా దేవుని స్మరించు

మానవ సేవలో మనసు సంతోషం సమాజం ప్రకాశవంతం



***


-యశోద గొట్టిపర్తి





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page