స్లీప్ డివోర్స్ నుండి సెకండ్ చాన్స్ వరకు
- Merigi Ramya
- Dec 27, 2025
- 6 min read
#MRamya, #Mరమ్య, #FromSleepDivorceToSecondChance, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Sleep Divorce Nundi Second Chance Varaku - New Telugu Story Written By - M. Ramya Published in manatelugukathalu.com on 27/12/2025
స్లీప్ డివోర్స్ నుండి సెకండ్ చాన్స్ వరకు - తెలుగు కథ
రచన: M. రమ్య
బాగా రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో గేట్ నెంబర్ 12 దగ్గర పాటలు వింటూ ఉంది జాగృతి.
అదే ఎయిర్పోర్ట్లో ముంబై నుండి దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగి, గేట్ నెంబర్ 12 కోసం వెతుకుతూ శ్రావ్య నడుస్తూ ఉంది.
మ్యూజిక్ వింటున్న జాగృతి వెనుక నిలబడి , "భూ " అంటూ జాగృతి వెనక నుండి భుజం మీద చేయి వేసింది శ్రావ్య.
"హే శ్రావ్యా" .... అంటూ జాగృతి శ్రావ్యనీ పట్టుకుంది.
ఎన్ని సంవత్సరాలు అయ్యింది నిన్ను చూసి .అసలు నన్ను ఎలా గుర్తుపట్టావు ..? నేను బాగా లావు అయిపోయాను కదా అని జాగృతి పలికింది
నేను కూడా అలాగే ఉన్నానే .పెళ్లి అయ్యి ,ఇద్దరు పిల్లలు పుట్టాక ,ఇలా ఉండక ఇంకెలా ఉంటామో చెప్పు.. అని శ్రావ్య సమాధానం చెబుతూ ఉంది.
నిజమే చెప్పావు . ఇంతకీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు శ్రావ్య ?
నేను లండన్ వెళ్తున్నాను..
అవునా ..,నేను కూడా లండన్ లోనే ఉంటున్నాను.
శ్రావ్య : నాకు తెలిసే .కానీ ఎక్కడ ఉంటావు అనేది మాత్రం తెలీదు. మన మధ్య స్కూల్ డేస్ తర్వాత కమ్యూనికేషన్ తగ్గింది కదా .
ఇప్పటి లాగా సోషల్ మీడియా మనకు లేదు కదా..
జాగృతి : అవునే నేను నిన్ను సోషల్ మీడియాలో చాలా వెతికాను కానీ ఫలితం లేదు.
శ్రావ్య : ఇంకేంటి విశేషాలు ..?అమ్మానాన్న ఎలా ఉన్నారు..?
జాగృతి : చమర్చిన కళ్ళతో, వాళ్లు చనిపోయి రెండు సంవత్సరాలైంది. అమ్మ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఆ దిగులుతో నాన్న కూడా మూడు నెలలకే చనిపోయారు .
మరి మీ అమ్మానాన్న ఎలా ఉన్నారు..?
శ్రావ్య : వాళ్లు బానే ఉన్నారు .కానీ నాతో మాట్లాడటం లేదు .మా అత్తింటి వాళ్ళకి, పుట్టింటి వాళ్ళకి గొడవ జరిగింది లే..
జాగృతి : అయితే నిన్ను ఒక డ్రమ్ములాగా వాయిస్తున్నారా ..? అని నవ్వుతుంది..
శ్రావ్య : మరి ,బాగా అన్నావు .ఎవరికీ చెప్పలేను . ఇంతకీ నీ సంసారం ఎలా ఉంది..?
జాగృతి : నీది ఉమ్మడి కుటుంబం సమస్య అయితే , నాది స్లీప్ డివోర్స్ సమస్య..
శ్రావ్య : ఏంటి స్లీప్ డివోర్స్ ఆ....?
అంటే మీరు కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారా..?
జాగృతి : అన్ని విడాకులు కోర్టు ద్వారానే అవ్వవు..?
శ్రావ్య : మరి..?
జాగృతి : పద అనౌన్స్మెంట్ వచ్చింది .ఫ్లైట్లో మాట్లాడుకుంటూ వెళ్దాం..
శ్రావ్య.., జాగృతి అన్న స్లీప్ డివోర్స్ గురించి ఆలోచిస్తూ ఫ్లైట్ ఎక్కింది..
జాగృతి ఎయిర్ హోస్టర్ తో మాట్లాడి ,తన పక్క ప్యాసింజర్ ని రిక్వెస్ట్ చేసి ,శ్రావ్యను తన పక్కనే కూర్చోబెట్టుకుంది..
ఫ్లైట్ ఫ్లై అవుతూ ఉంది..
శ్రావ్య.., జాగృతిని చూస్తూ ఉంది
జాగృతి : ఏమిటే అలా చూస్తూ ఉన్నావు..?
శ్రావ్య : ఈ స్లీప్ డివోర్స్ ఏంటే, నాకు అసలు అర్థం కావడం లేదు..
జాగృతి : నాకు పెళ్లి అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. నా వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు..
శ్రావ్య : అయితే దానికి ,దీనికి ఏంటి సంబంధం ..?
జాగృతి: చెప్పింది వినవే. నా భర్త ,నేను పది సంవత్సరాలు వరకు బాగానే ఉన్నాం. నేను ఇంటిని చూసుకుంటా అని ,నా భర్త ఉద్యోగం, ఇంటి ఖర్చులు చూసుకుంటాను అని మా పెళ్లిచూపుల్లో మాట్లాడుకున్నాం..
శ్రావ్య : ఆ తర్వాత..
జాగృతి : పని ఒత్తిడి వల్ల నా భర్త నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు . రోజులో కనీసం 20 నిమిషాలు కూడా మాట్లాడటం లేదు .నేను మాట్లాడాలి అని చూసినా," చెప్పు" అన్న పదం తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. తన ఇంటి విషయాలు అదే నా అత్తింటి విషయాలు కానీ ,ఆఫీస్ విషయాలు కానీ ,ఫ్రెండ్స్ విషయాలు కానీ, పిల్లలు విషయాలు గానీ ,ఏ విషయం కూడా నాతో పంచుకోవడానికి ఇష్టపడడం లేదు.
నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా దూరం పెట్టేవారు. అలా నాలో కూడా సహనం నశించింది. నేను దూరంగా ఉంటే ఆయన మారుతాడు అని అనుకున్నాను..
ఈ లోపు మా అమ్మ నాన్న చనిపోవడంతోటి , ఆస్తిపాస్తులు వివరాలు చూసుకోవడానికి ,రెండు సంవత్సరాలు ఇండియాలో ఉండాల్సి వచ్చింది . పిల్లలు చిన్న పిల్లల కావడం వల్ల నాతోనే ఉన్నారు..
ఇంకా అంతే.., నాకు , నా భర్తకి మరింత దూరం పెరిగింది.
దానివల్ల నాలో ఆయన మీద అనుమానం పెరిగిపోయింది. ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఏమైనా ఉందా ..? గర్ల్ ఫ్రెండ్ ఉందా..? నేను లావుగా అయిపోవడం వల్ల ఆయనకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా..? ఇలా రకరకాల ప్రశ్నలు నా మెదడుని తినేస్తూ ఉన్నాయి.
దాంతో నాలో మరింత కోపం పెరిగిపోయింది . అప్పుడప్పుడు నేనే మౌనంగా ఉండిపోతూ ఉన్నాను.
ఆయన ఇండియా వచ్చిన నాతో చనువుగా , మునపటి లాగ ఉండడం లేదు . వర్క్ టెన్షన్లో దూరం పెట్టారు అని, నాకు నేను చాలాసార్లు సర్ది చెప్పుకున్నాను. కానీ ఇండియాలో ఎటువంటి వర్క్ ఉండదు కదా అయినా కానీ దూరం పెట్టేసరికి చాలా బాధపడ్డాను.
పచ్చిగా చెప్పాలి అంటే మంచం అటుపక్క ఆయన , మంచం ఇటుపక్క నేను పడుకుంటున్నాము..
దీనినే స్లీప్ డివోర్స్ అంటారు..
ఇప్పుడు ఆయన ఒక బెడ్రూంలో ,నేను ఒక బెడ్రూంలో, పిల్లలు వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్స్ లో పడుకుంటున్నారు.
ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియడం లేదు శ్రావ్య అని కన్నీరు కారుస్తూ ఉంది.
శ్రావ్య : జాగృతి చెయ్యి పట్టుకొని , నువ్వు నాకు చెప్పావు కదా ,బాధపడకు ,నేను నీ మునపటి జీవితాన్ని నీకు వచ్చేలాగా చేస్తాను. నీది నాది ఒకటే వయసు అయినా సంసార జీవితం నేను ముందుగా ప్రారంభించాను. కాబట్టి నాకు అనుభవం ఎక్కువ.
జాగృతి : కళ్ళు తుడుచుకుంటూ, నువ్వు లండన్ కి ఎందుకు వస్తున్నావు ..? ఎక్కడ ఉంటావు? నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు కదా..
శ్రావ్య : మేడం.., నేను నా కూతురు డెలివరీ కోసం వస్తున్నాను..
జాగృతి : ఏంటి నువ్వు అమ్మమ్మ కాబోతున్నావా ..?
శ్రావ్య : నేను ఆల్రెడీ అమ్మమ్మనే అయిపోయానే .ఇది సెకండ్ డెలివరీ.
జాగృతి : అవునా అస్సలు ఊహించలేదు.
ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. జాగృతి మొహం చిన్న బోయింది . శ్రావ్య దూరం అవుతుంది అనే బాధ జాగృతి మొహం లో కనబడుతూ ఉంది.
ఇద్దరూ లగేజ్ తీసుకొని ఎగ్జిట్ వైపు వెళ్తూ ఉన్నారు..
"హాయ్ జాను" ఎలా ఉన్నావు? మీ పిల్లలు మా కజిన్స్ తో కలిసి వండర్ లా కి వెళ్లారు అని చెబుతుంది దక్షిత..
జాగృతి : నవ్వుతూ.., తిను నా ఫ్రెండ్ శ్రావ్య. ఈమె దక్షిత, నా నైబర్ అని ఒకరికి ఒకరు పరిచయం చేస్తూ ఉంది.
శ్రావ్య : అవునా దక్షి చెప్పనేలేదు..
దక్షిత : అమ్మ.., జాగృతి, మీరు ఫ్రెండ్స్ ఆ ఆ ..?
ఇది ఎప్పటినుండి..?
శ్రావ్య : మేము చిన్ననాటి స్నేహితులం..
దక్షిత : ఓహో పండు అంటే తినేనా..?
శ్రావ్య : అవును. పదండి ఇంటికి వెళ్దాం..
జాగృతి : మొహం లో ఆనందం వెళ్లి విరిసింది అందరూ ఇంటికి చేరుకున్నారు..
జాగృతి బాయ్ శ్రావ్య మళ్లీ కలుద్దాం అంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది.
సాయంత్రం అయ్యేసరికి జాగృతి పిల్లలు ఇంటికి వచ్చేసారు .ఎదురుగా ఉన్న జాగృతిని చూసి హాయ్ మామ్ అని చెప్పి ,వాళ్ళ రూమ్స్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు..
ఆ తర్వాత జాగృతి భర్త డేవిడ్ వచ్చి, హాయ్ డార్లింగ్ అంటే ఒక సైడ్ హగ్ ఇచ్చి, తన బెడ్రూం లో కి వెళ్ళి పోయారు..
జాగృతికి ఈ పరిస్థితులు కొత్త ఏమీ కాదు .బాగా అలవాటైపోయింది.
ఒక సినిమా చూసి ,తను కూడా రూమ్ లోకి వెళ్లి , ఫోన్ చూసుకుంది. ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి ఈ మెసేజ్ అని జాగ్రతి ఫోన్ వైపు చూసింది .గూగుల్ నుండి హ్యాపీ బర్త్డే విష్ వచ్చింది.
జాగృతి ..,తన మొహంలో చిన్న చిరునవ్వు తెచ్చుకొని ,పోనీలే దేనికైనా గుర్తుంది అని అనుకుంటూ మంచం మీద పడుకుంది.
ఉదయం లేచి తన పనులతో పాటు, ఇంటి పనులను చూసుకుంటూ ఉంది .బాయ్ మామ్ అంటూ పిల్లలు స్కూల్ కి , బాయ్ డార్లింగ్ అంటూ భర్త ఆఫీస్ కి వెళ్ళిపోయారు.
ఇంటి పనులు చేసి చేసి అలసట కలిగి ,ఒక కప్పు కాఫీ తో టీవీ ముందు కూర్చుంది.
"హ్యాపీ బర్త్డే టూ యు" అంటూ పాడుతూ శ్రావ్య కేక్ తో జాగృతి ఇంట్లోకి వచ్చింది.
జాగృతి మొహం నిరుత్సాహంగా ఉంది..
జాగృతి : థాంక్యూ ..,నా బర్త్ డే నీకు ఇంకా గుర్తుందా..?
శ్రావ్య : నేను మర్చిపోలేదు నీలాగా.., ముందు కేక్ కట్ చెయ్యి.
జాగృతి ..,కేక్ కట్ చేసింది .శ్రావ్య కేక్ మొక్కని జాగృతికి తినిపించింది .ఇద్దరు కేక్ ని సరదాగా మొఖానికి పూసుకొని, కాసేపు ఆడుకున్నారు.
శ్రావ్య : ఎందుకే ఇందాక అంత డల్ గా ఉన్నావు . డేవిడ్ మరియు పిల్లలు విష్ చేయలేదా నీకు..
జాగృతి : నీకు ఎలా తెలుసు అంటూ శ్రావ్య ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది..
శ్రావ్య : జాగృతిని ఓదారుస్తూ, నేను ఈ చేదు అనుభవాలన్నీ కూడా ఎదుర్కొన్నాను..
జాగృతి : మరి ఈ సమస్యలన్నిటి నుండి ఎలా బయటపడ్డావు..?
శ్రావ్య : ముందు నన్ను నేను యాక్టివ్ చేసుకున్నాను. నాకు నేను ఎక్సర్సైజ్ ని నెమ్మదిగా అలవాటు చేసుకున్న, ఒక నెల వాకింగ్ తర్వాత రెండు కేజీలు తగ్గాను. ఆ తర్వాత డైట్ చేస్తూ మరింత బరువుని తగ్గాను .నా బరువు తగ్గడాన్ని నేను ఎంజాయ్ చేసేదాన్ని. నాతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయడం మొదలు పట్టాను..
జాగృతి : అంటే..?
శ్రావ్య : ఇంటి పనుల, నా భర్త ,పిల్లలు, అత్త మామ పనులు పూర్తిచేసి.., మిగిలిన టైం ని నాకు నచ్చే పనులు చేయడానికి కేటాయించాను. అంటే నాకు నచ్చిన పాటలు వినడం, నచ్చిన ఫుడ్ వండుకొని తినడం మొదలు పట్టాను..
అప్పుడప్పుడు బయట ఫుడ్ తినాలని, ఏవైనా కొనుక్కోవాలని అనిపించింది..
అలా కొనుక్కోవడానికి నా దగ్గర తగిన డబ్బు ఉండేది కాదు .ఎవరినైనా అడగాలి అంటే నా మొహమాటం అడ్డు వచ్చేది..
పది సర్లు వెళ్లి నేను ఎందుకు అడగాలి అని అనిపించింది..
అప్పుడే నాకు తెలిసిన టైలరింగ్ స్టార్ట్ చేశాను. చిన్న మొత్తంలో డబ్బు రావడం మొదలైంది .ఆ డబ్బు నా చిరు కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించుకున్న..
అలా సంపాదనలో నా అడుగులు పడుతున్నప్పుడే, నా భర్త కష్టాలు నాకు అర్థం అయ్యాయి.
నా భర్తకి ఆర్థికంగా నేను సహాయ పడితే ,ఆయన నాతో టైం స్పెండ్ చేస్తాడు అని ఆలోచించాను..
నా భర్తకి ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్న. ముందు నా భర్త నేను సంపాదిస్తున్న డబ్బుని నిరాకరించిన, తర్వాత కాలంలో తీసుకునేవారు.
అతనికి ధైర్యం వచ్చింది . ఒక నెల నేను ఇంటికి డబ్బులు ఇవ్వకపోయినా, నా భార్య ఆ భారాన్ని మోయగలదు అని నమ్మారు..
అలా నేను ఆయన ఆర్థిక భారాన్ని పంచుకున్న, కొద్ది కొద్దిగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి వెళ్ళిపోయారు. అత్తమామలు తీర్థయాత్రలు అంటూ దేశాలు తిరుగుతూ ఉన్నారు..
ఇంట్లో ఎవరూ లేకపోవడం, నేను ఆయన మాత్రమే ఉండడం ,ఆర్థిక భారం, పిల్లల టెన్షన్ తగ్గడం వల్ల.., మళ్ళీ మేము ఒకరికి ఒకరు దగ్గర అయ్యాము..
మా మధ్యన ఉండే బంధం మరింత గట్టిపడింది. నువ్వు చెప్పిన స్లీప్ డివోర్స్ కాస్త మాయం అయిపోయింది. ఇప్పుడు లవ్ బర్డ్స్ లాగా లవ్ చేసుకుంటూ ఉన్నాం.
నీకు నేను తోడు ఉంటాను జాగృతి. ముందు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడడానికి ట్రై చెయ్యి, ఆ తర్వాత భర్త ,పిల్లలు నీ వైపే తిరుగుతారు.
నువ్వే మౌనంగా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతారు చెప్పు. నీకు స్పేస్ కావాలి అని అనుకొని వదిలేస్తారు. అందుకే నేను అంటాను ముందు మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని..
జాగృతి ..,ఒక సంవత్సరం వరకు నేను ఇక్కడే ఉంటాను. నిన్ను దగ్గరుండి నేను చూసుకుంటాను. నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాను.
జాగృతి కన్నీళ్లు తుడుచుకొని శ్రావ్యనే గట్టిగా కౌగిలించుకుంది..
****
కొన్ని నెలలకి జాగృతి బరువు తగ్గడంతో పాటు పిల్లలకి దగ్గర అవ్వడం మొదలయింది. పిల్లలు కూడా జాగృతిని ఫ్రెండ్ గా చూడడం మొదలుపెట్టారు . కేర్ గా కూడా చూసుకుంటూ ఉన్నారు. కొన్ని నెలలు తర్వాత డేవిడ్ జాగృతికి దగ్గర అవుతూ ఉన్నాడు..
డేవిడ్ : సారీ జాగృతి ,నాకే తెలియకుండా తప్పు చేశాను. తల్లిదండ్రులని ఒకరి తర్వాత ఒకరిని పోగొట్టుకొని బాధ పడుతున్న నీకు ఓదార్పుగా ఉండవలసింది పోయి, నేనే తిరిగి నిన్ను బాధ పెట్టాను . ఐ యాం సారీ జాగృతి అంటూ డేవిడ్ జాగృతి చేతిని పట్టుకున్నాడు..
జాగృతి : నేను కూడా సారీ అండి .మీ ఆఫీస్ విషయాలు నాకు తెలియకపోయినా ,ఏదో మాట్లాడాలి కాబట్టి ఏవేవో సలహాలు ఇచ్చి ,మీకు చిరాకు తెప్పించాను. అలాగే ప్రతి చిన్న విషయం మీకు చెప్పి మిమ్మల్ని విసిగించాను . పిల్లల్ని నేను హ్యాండిల్ చేయలేక ,ఆ చిరాకు అంతా మీ మీద చూపించాను . నన్ను క్షమించండి..
డేవిడ్ : మళ్ళీ మన మధ్యన ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకుందాం అంటూ జాగృతిని కౌగిలించుకున్నాడు..
"మార్పును మనలో చూసినప్పుడే ,ఎదుటివారిలో మార్పు మనం గుర్తించగలుగుతాం" అని జాగృతి తన ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ ఉంది.
ముగింపు
M. రమ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: M. రమ్య




Comments