top of page
Writer's picturePitta Govinda Rao

స్నేహం అంటే..


'Sneham Ante' New Telugu Story


Written By Pitta Gopi


'స్నేహం అంటే..' తెలుగు కథ


రచన: పిట్ట గోపి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


స్నేహానికి వయసు తో పనేముంటుంది.. చరణ్ కంటే.. ఉదయ్ కాస్త పెద్దోడే అయినా ఇద్దరు ఒకరినొకరు విడిచి వెళ్ళలేని స్నేహం. చరణ్ చిన్నతనంలోనే తండ్రి పోగా తల్లితో మాత్రమే ఉంటున్నాడు. ఉదయ్ కి ఒక ఫ్యామిలీ ఉన్నా.. అతడి ఇష్టాలు అతడి కష్టాలు వారికి పట్టవు. ఉదయ్ కఠిన పరిస్థితులు అతడిని మంచి ఆలోచన పరుడిగాను కష్టపడే తత్వాన్ని అలవాటు చేశాయి. కుటుంబంతోనే ఉంటూ కుటుంబం నుండి ఏమి ఆశించకుండా ఎదగాలనే ప్రయత్నం కొనసాగించేవాడు. చరణ్ ఉదయ్ ఇంటికి వస్తుంటాడు. ఉదయ్ తోనే ఉండటం వలన చరణ్ కి కూడా ఉదయ్ స్వభావాలు తలకెక్కేవి. అయితే ఉదయ్ కి చరణ్ తప్ప వేరొకరు అవసరం లేదు. ఇంకొకడికి నమ్మడు. కానీ.. చరణ్ మాత్రం మరికొందరితో స్నేహం చేసేవాడు. ఏ అవసరం ఉన్నా ఎక్కడ కి వెళ్ళాలన్నా.. ఇద్దరు కలిసి వెళ్తారు. ఇచ్చిపుచ్చుకునే తత్వం వాళ్ళది. కొంతకాలానికి చరణ్ ఉదయ్ ఇంటికి రావటం తగ్గించాడు. దీంతో ఉదయ్ స్వయంగా చరణ్ ఇంటికి వెళ్తు కలిసి వస్తుండేవాడు. పని ఉంటే పనికి వెళ్ళి లేకపోతే చరణ్ ఇంటికి వెళ్తుంటాడు. ఉదయ్ కి ఉద్యోగం రాలేదు. స్నేహానికి అర్థం తెలిసిన వ్యక్తి కదా.. అందుకే.. చరణ్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఆర్థికంగా సాయం చేసేవాడు. చరణ్ భవిష్యత్ తనలా కాకూడదని తను పనికెళ్తూ డబ్బులు సమకూర్చి ఇచ్చేవాడు. విలువైన తన అనుభవాలను సలహాలు ను ఇస్తుండేవాడు. చరణ్ కుటుంబానికి మూల ధైర్యంగా ఉదయ్ నిలుస్తూ వచ్చాడు. ఉదయ్ ఇంత చేసినా.. చరణ్ మనసులో ‘తానంటే ఉదయ్ కి ఎంత ప్రేమ.. ’ అని ఎప్పుడూ అనుకోలేదు సరికదా ఉదయ్ కి సహాయం చేయవల్సి వచ్చినపుడు తప్పించుకుని తిరిగేవాడు. అదే తన అవసరమున్నప్పుడు.. ఉదయ్ ని తీసుకెళ్ళి పని పూర్తి చేయించుకునేవాడు. అలా ఉదయ్ తన సరదాలు సంతోషాలు తన కష్టం చరణ్ కోసం ధారపోశాడు. చరణ్ పైకి వస్తే తనకు ఎప్పటికైనా గుర్తించడా.. అని ఆ స్నేహితుడి ఆశ. ఎట్టకేలకు చరణ్ ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. ప్రయాణానికి డబ్బులు లేకపోతే ఉదయ్ ని అడగమనిని తల్లి అనగా వద్దని చెప్పి వేరొకరి దగ్గర అప్పు తీసుకుని మరీ ఉద్యోగానికి బయలుదేరాడు చరణ్. రెండు రోజుల తర్వాత చరణ్ ఇంటికి వచ్చిన ఉదయ్ చరణ్ గూర్చి ఆరాతీశాడు. ఉద్యోగం వచ్చింది అని వెళ్ళి రెండు రోజులైందని చరణ్ తల్లి చెప్పింది. వెంటనే చరణ్ కి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని అవసరముంటే తనకు చెప్పమని చెప్తాడు. ఉదయ్ కి నెలవారీ వేతనం ఎక్కువ రాకపోవడంతో ఉన్న డబ్బులు చరణ్ కోసం ఖర్చు చేయటం వలన పెళ్ళి కూడా చేసుకోలేదు. కొంతకాలానికి చరణ్ స్వగ్రామం వస్తాడు. చాలా డబ్బు సంపాదిస్తాడు. ఉదయ్ చరణ్ ఇంటికి రావటం మానేశాడు.. సొంత ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ నుండే ఉద్యోగం కొనసాగిస్తాడు చరణ్. ఉదయ్ కష్టాలు చరణ్ కి తెలియవు. తెలుసుకోడు. ఉదయ్ తన ఇంటికి రావటం లేదని చాలా మారిపోయాడని తరుచుగా తల్లి కి చెప్తుంటాడు చరణ్. తల్లి కి మాత్రం చరణ్ తప్పు చేస్తున్నాడని తెలిసినా.. ఎదురు చెప్తే తనను పట్టించుకోడని భయపడింంది. చరణ్ పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి తంతు నుండి ముగింపు వరకు ఉదయ్ సహాయం చేశాడు. పెళ్ళి లో సరదాగా గడిపాడు. దీంతో చరణ్ కి ఏదో తేడాగా కనిపించింది. అసలు ఉదయ్ మారాడా మారింది నేనా.. అని తన నీడ తనను ప్రశ్నించింది. చరణ్ రెండు రోజుల నుండి విచారంగా కనిపించటం తల్లి చూసి ఆరా తీసింది. చరణ్ జరిగింది తల్లి కి చెప్తాడు. అప్పుడు తల్లి " మారింది వాడు కాదురా.. నువ్వే" అని చెప్పింది. "స్నేహానికి ఒక ఖచ్చితమైన అర్థం నువ్వు తెలుసుకోలేకపోయావు. ఎందుకంటే చాలామంది తో స్నేహం చేసే నీకు నిజమైన స్నేహితుడు యొక్క త్యాగం కనపడలేదు" అంటుంది. "నేను ఇంటికి వచ్చాక నన్ను చూడ్డానికి కూడా ఉదయ్ రాలేదమ్మ" అంటాడు చరణ్. "అదేరా నువ్వు ఉదయ్ ని అర్థం చేసుకోలేదు కాబట్టే వాడు ఎందుకు రాలేదో.. నీకు చెడ్డగా కనిపించింది. నీకోసం ఎన్నో త్యాగాలు చేసి వాడు నష్టపోయాడు. ఆ నష్టాలు పూడ్చడానికి తీరిక లేకపోయి ఉంటుంది. అంతేనా.. నిజమైన నిజాయితీ గల స్నేహితుడు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీ గడపతొక్కడు. నువ్వు కష్టాలలో ఉన్నప్పుడే నీ వెన్నంటే ఉంటాడు. " అంటుంది తల్లి. "ఉదయ్ కి నీలో స్పష్టమైన మార్పు కనపడింది కాబట్టే.. నువ్వు ప్రయేజకుడివి అయ్యాక నీ గడపతొక్కితే ఎక్కడ ఆశిస్తాడోనని భయపడతావని అర్థం చేసుకుని ఉండొచ్చు. ఇంత చేసినా.. పెళ్ళి కి స్వయంగా వెళ్ళి పిలవకుండా మధ్యవర్తి తో పిలిచినా.. తన స్నేహనికి ఒక స్పష్టమైన అర్థం ఇచ్చాడు. చివరకు నిన్ను నమ్ముకుని తానే బ్రహ్మచారి గా అయినాడు. " అని కన్నీరు పెట్టుకుంటుంది చరణ్ తల్లి. తాను చేసిన తప్పుకు మనోవ్యధ తో మంచం పట్టాడు చరణ్. విషయం తెలుసుకుని ఉదయ్ రాగా.. అతనికి బంగారు పళ్లెంలో కాళ్ళు కడిగాడు చరణ్. బాగోలేనగానే ఉదయ్ తన ఇంటికి రావటం చూసి తన తల్లి చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి చరణ్ కి. నిజమైన స్నేహితులు కష్టాల్లోనే నీ దగ్గరకు వస్తారు. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కాదు. స్నేహానికి అర్థం తెలియని తనకు గొప్ప స్నేహితుడిని దేవుడు బహుమతిగా ఇవ్వటం బాధగా ఉందని మనసులో అనుకుంటూ.. కాస్త గట్టిగా హత్తుకున్నాడు ఉదయ్ ని. ***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం.




88 views0 comments

Comments


bottom of page