స్నేహం
- Neeraja Prabhala

- Aug 3
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #Sneham, #స్నేహం

స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 💐💐
Sneham- New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 03/08/2025
స్నేహం - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
సృష్టిలో తీయనిది స్నేహం - అన్ని బంథాలకు అతీతమైనది ఆ బంధం.అంతులేని ఆనందాన్నందించే పవిత్ర బంథమే స్నేహం.అందమైన ఆ మూడక్షరాలు - అందించును ఆత్మ స్థైర్యం, మనోనిబ్బరం.అనుమానాలకు, అపార్థాలకు తావులేని అమూల్యమైన బంధమే స్నేహం. కష్టాల కడలిలో, అగాథాల సుడిగుండం లాంటి జీవితంలో అండగ నేనున్నానని నిండుగ పలికి చేయందించి దరికి చేర్చే దైవమే స్నేహితుడు.హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు, సఖుడని నామాంతరాలెన్ని ఉన్నా , అంతఃకరణ మనోమందిరంలో నీ రూపం - దేవుని ప్రతిరూపం.నిథులెన్ని ఉన్నా తరగని పెన్నిధి నీవు - చీకటిలో సైతం వెలుగందించే చిరుదివ్వెవు నీవు.నీవు లేని లోకం - చూడలేదు నా మనో నేత్రం.మనసెరిగిన ఓ నేస్తమా! - అందించు నీ హస్తమా!కడదాకా కాదు - మరు జన్మకు కూడా మిత్రమా!

-నీరజ హరి ప్రభల




Comments