top of page
Original.png

స్నేహమంటే..

స్నేహమంటే కథ, తెలుగు స్నేహ కథ, గొర్రెపాటి శ్రీను కథలు, నిజమైన స్నేహం, స్నేహితుడి విజయం, తెలుగు భావోద్వేగ కథ, ఇంటర్మీడియట్ జ్ఞాపకాలు, ప్రేరణాత్మక తెలుగు కథ, స్నేహ బంధం, తెలుగు కథలు, friendship story in Telugu, emotional Telugu story, motivational Telugu story, college friendship

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'స్నేహమంటే' కథలో పదేళ్ల తర్వాత కాలేజీ వార్షికోత్సవంలో కలుసుకున్న ఇద్దరు స్నేహితులు, జాతీయ స్థాయి గాయకుడిగా ఎదిగిన వివేక్‌ను గర్వంగా చూస్తున్న నాగేంద్ర.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'స్నేహమంటే' కథలో పదేళ్ల తర్వాత కాలేజీ వార్షికోత్సవంలో కలుసుకున్న ఇద్దరు స్నేహితులు, జాతీయ స్థాయి గాయకుడిగా ఎదిగిన వివేక్‌ను గర్వంగా చూస్తున్న నాగేంద్ర.

Snehamante - Telugu Emotional Story | Gorrepati Sreenu

స్నేహమంటే.. - తెలుగు భావోద్వేగ కథ | గొర్రెపాటి శ్రీను

Published in manatelugukathalu.com on 22/06/2026


స్నేహం అనేది కేవలం కలిసి గడిపిన సమయాల జ్ఞాపకం కాదు. కాలం, దూరం, పరిస్థితులు మారినా ఒకరి విజయాన్ని మరొకరు హృదయపూర్వకంగా ఆనందించగలగడం నిజమైన స్నేహం. గొర్రెపాటి శ్రీను రచించిన "స్నేహమంటే.." కథ అలాంటి ఆత్మీయ బంధానికి అద్దం పడుతుంది. కాలేజీ జీవితంలో మొదలైన స్నేహం, పదేళ్ల తర్వాత మరింత గొప్పగా వికసించిన భావోద్వేగ గాథ ఇది. స్నేహితుడి విజయంలో తన ఆనందాన్ని చూసుకున్న ప్రతి పాఠకుడి మనసును ఈ కథ తప్పక తాకుతుంది.


నేను కాలేజ్ క్లాస్ రూం లోకి అడుగు పెట్టే సమయానికి క్లాసంతా సందడిగా ఉంది. 


లెక్చరర్ గారు అప్పటి కే క్లాస్ రూం కి వచ్చినట్లు గా అర్థమవుతుంది. 


ఎప్పుడు సీరియస్ గా ఉండే పార్థసారథి సార్ ఆ రోజు జోయల్ గా స్టూడెంట్స్ తో మాట్లాడుతుండడం నాకు నచ్చింది. 


సార్.. నా అభిమాన ఫిజిక్స్ లెక్చరర్!

పార్థసారథి అయ్యర్ సార్ క్లాసంటే మా అందరికీ ఇష్టం. నిజానికి మిగతా అన్ని సబ్జక్ట్స్ కంటే ఫిజిక్స్ టఫ్ సబ్జెక్ట్. 


సార్ బోధిస్తుంటే మా అందరికీ ఆ సబ్జెక్ట్ తేలిక గా అర్థమవుతుంది. 


మరీ ఇంతలా సార్ గురించి చెబుతూ క్లాస్ కి ఆలస్యంగా ఎందుకు వచ్చాననే గా మీ సందేహం!!

అందుకు కారణం మా వివేక్ గాడు. 

వాడు నేను క్లాస్మేట్స్. 

మేమంతా ఇంటర్మీడియట్ లో కొత్తగా జాయిన్ అయ్యాము. 

ఇంటర్మీడియట్ నల్లగొండ జూనియర్ ప్రభుత్వ కళాశాల స్టూడెంట్స్ మి. 

వాడేమో నా వెనుకగా ఉండి క్లాస్ లోకి తొంగి చూస్తున్నాడు. 


పార్థసారథి అయ్యర్ సార్ మా వైపు చూస్తున్నారు. 

మేమిద్దరం తలొంచుకుని గుమ్మం బయట నుంచున్నాము. 


"సార్! మే ఐ కమిన్!" నా స్వరం మృదువు గా పలికింది. 

"ఓ. కే. కమిన్.. " మమ్మల్ని పెద్దగా కోప్పడకుండా సీరియస్ గా చూడ్డం మాత్రం గ్రహించి.. 

నిశ్శబ్ధంగా లోపలికి నడిచాము !


వివిధ గ్రామాల నుండి నల్లగొండ పట్టణానికి చదువు కోసం వచ్చాము మేమంతా. 

అందరం ఇక్కడ మంచి స్నేహితులం అయ్యాము. 

వివేక్ గాడు మాత్రం నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. 

సార్ అటుతిరిగి ఉన్నప్పుడు జయశంకర్ మా బెంచ్ లోకి మారాడు. 


"ఏంట్రా!? క్లాస్ కి ఆలస్యంగా వచ్చారు?"


"మనోడే కారణం.. పాటల పోటీకి పేరిస్తానని ఒకటే గొడవ. మనకెందుకురా ఆ పాటల గొడవ, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఎన్నో పోటీలు జరుగుతున్నాయి. క్రికెట్ లో పాల్గొందాం అంటున్న నా మాటలు పట్టించుకోవడం లేదు వీడు. నువ్వైనా నచ్చజెప్పరా. " 


జయశంకర్ వివేక్ గాడికి ఏదో చెప్పబోతున్న సందర్భంలో.. సార్ వెనక్కి తిరిగారు. 


"మరోసారి చెబుతున్నాను. ఎవరెవరు ఏ ఏ పోటీలలో పార్టిసిపేట్ చేస్తారో సాయంత్రం వరకు నేమ్స్ ఇవ్వండి. రేపు లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇది మీ ప్రతిభను చాటుకునే వేదిక. ఇప్పటి వరకు స్కూల్స్ లో చదువుకున్నారు. 


ఇది కాలేజ్. మీరు గాని ఈ పోటీలలో గెలుపొందితే పొందే పేరు గొప్పది. పైగా మన ఎం. ఎల్. ఏ గారి చేతుల మీదుగా బహుమతి అనుకునే అవకాశం. " అంటూ సార్ అందరికీ ఉత్సాహాన్ని అందిస్తూ తన రూం వైపు నడిచారు. 


వివేక్ గాడి గొడవ మళ్ళీ స్టార్ట్. 

"అరే నువ్వు నా క్రికెట్ టీం లో ఉండాలి. అంతే. ఇంకే పోటీలో అయినా పార్టిసిపేట్ చేయి నీ ఇష్టం " ఒకింత దురుసుగా నే మాట్లాడుతూ నా క్యారేజ్ తీసుకుని లంచ్ చేయడానికి కాస్త దూరంగా వెళ్ళాను. 


వాడు క్రికెట్ బాగా అడతాడు. 

వాడి బౌలింగ్ నాకు నచ్చుతుంది. 

నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం. 


ఎలాగైనా ఈ పోటీల్లో విజయం సాధించి మా ఇంట్లో వాళ్ళకి, మా ఊళ్ళో వాళ్ళ కి నా ప్రతిభను చూపించాలనేది నా పట్టుదల. 


ఈ పోటీల్లో వాడు కనుక పాటల పోటీ ల్లో పేరిస్తే.. ఇక వాడి ధ్యాసంతా పాటలపైనే ఉంటుందని నా బాధ. 

అర్థం చేసుకోడు. 


యుక్తవయస్సులో సాధించే విజయాలు రేపటి మన ఘనచరిత్రను ప్రపంచానికి పరిచయం చేసే అనవాళ్ళు.. అని నా అభిప్రాయం!


ఏదైతేనేం ఆ వార్షికోత్సవ సంబరాల్లో విజయాన్ని సాధించిన టీం లీడర్ గా కళాశాల అంతా నా పేరు మారు మ్రోగిపోయింది. 


"బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్.. నాగేంద్ర" విన్నింగ్ అవార్డు ఎం. ఎల్. ఎ వెంకట్ గారి నుండి సగౌరవంగా అందుకున్నాను. 


పద్నాలుగు టీం లు పాల్గొన్న పోటీ లో మా టీం జయకేతనం ఎగరేసి మొదటి స్థానాన్ని పొందింది. 

జూనియర్స్ అయిన మా టీం సీనియర్స్ సైతం ఎక్కువగా పాల్గొన్న టీం ల ని ఓడించడం మరో ఘనత. 

*

సౌమ్య పిలుస్తుంటే ముందు గదిలోకి వచ్చాను. 

మీ ఫోన్ రింగ్ అవుతుంది అంటుంటే.. చేతుల్లోకి తీసుకున్నాను. 


అవతల వాయిస్ వింటుంటే మనసంతా ఆనందపరవశం అయింది. 


"అవునా.. అలాగే... " అన్నాను వాడి మాటలు వింటూ. 

సాయంత్రం సమయం.. 

చల్లని గాలులు వీస్తున్నాయి. 


సూర్యభగవానుడు పడమటి కొండల్లో కి జారుకుంటున్న వేళ ఆకాశం అంతా అరుణ వర్ణాన్ని పులుముకుంది. 

దారికి ఇరువైపులా వున్న పచ్చని చెట్లు కాలేజ్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. 


ఇంటర్మీడియట్.. ఒకప్పుడు నేను చదువుకున్న కాలేజ్ లోకి దాదాపు పదేళ్ళ తర్వాత అడుగుపెడుతుంటే మనస్సు రాగరంజితం అవుతుంది. ఇప్పుడు కూడా నేను ఉంటున్న ఊరు ఇదే. నల్లగొండ బస్ డిపోలో ఫోర్మెన్ గా వర్క్ చేస్తున్నాను. 


ఆరున్నర అవుతుంది. 


మరికొద్ది నిమిషాల్లో నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయన్న ఆలోచన నా మనస్సు ఉద్వేగానికి కారణమవుతుంది. 

అక్కడి వాతావరణం ఒక్కసారిగా కోలాహలంగా మారిపోయింది. 


ముందు వరసలో కూర్చుని ఉన్న నాకు ఇదంతా అర్థమవుతుంది. 

స్టూడెంట్స్ అంతా ఇటు వైపే చూస్తున్నారు. 

చుట్టూ ఉన్న వారికి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ముందుకు కదులుతున్న వ్యక్తి ని చూస్తుంటే.. ఆశ్చర్యం ఆనందం కలగలిపిన అనుభూతి. 


నేను ఊహించలేదు. 

అతడు నా దగ్గరకు వచ్చాడు. 

ఆలింగనం చేసుకుంటుంటే తడబడుతూ దగ్గరయ్యాను. 


నా చేయి పట్టుకుని మరింత ముందు వరసకి తీసుకువెళుతుంటే మాటలే రాని మౌనాన్ని ఆశ్రయిస్తూ అనుసరించాను. 


నాకు అతి సమీపంలో ఎం. ఎల్. ఏ వెంకట్ గారు. 

రెండు చేతులు జోడిస్తూ నమస్కరించాను. 


ఇంత గొప్ప వ్యక్తి, సదా సమాజ శ్రేయస్సు ను కోరుకునే శ్రీ వెంకట్ గారి కరచాలనం అత్యంత ఆనందాన్ని కలిగించింది. 


కానీ ఇంతటి మహద్భాగ్యాన్ని కలిగించిన వ్యక్తి ని ఎలా ప్రశంసించాలి!?

నా నయనాల నిండా కృతజ్ఞతాభావం !

వాడే.. నా స్నేహితుడు వివేక్ గాడు !

సారీ.. వివేక్ !


తన పాట కోసం అందరూ ఎదురు చూస్తున్న వేళ సుమధుర గళం పంచిన అమృత ఝరి సదా జ్ఞాపకం !

కాలేజీ వదిలి పదేళ్లయినా.. వాడు నన్ను మర్చిపోలేదు! 

జాతీయ స్థాయి లో గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఘనత సాధించినా నన్ను మర్చిపోలేదు !


ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగినా, పాటల మాధుర్యంతో సింగర్ గా, జానపద కళాకారుడిగా, ప్రజా గాయకుడి గా గుర్తింపు, గౌరవాన్ని పొందుతున్నా మా స్నేహం, కాలేజ్ చెట్ల కింద కూర్చుని చెప్పుకున్న కబుర్లు మర్చిపోలేని మంచితనం మా వాడి స్వంతం. 


తనలోని ప్రతిభను తొలినాళ్ళలో గుర్తించిన వారిలో మొదటివాడిని నేనేనని సభలో చెబుతున్న వేళ.. మిత్రుడ్ని, ప్రముఖ తెలుగు గాయకులు శ్రీ వివేక్ గారి ని ఆనందభాష్పాలు నిండిన నయనాలతో మనస్ఫూర్తిగా అభినందించాను. 


స్నేహమేరా జీవితం.. 

మన విజయాలే కాదు.... మన స్నేహితులు అందుకున్న విజయాల్ని మనస్ఫూర్తిగా అభినందించడం నిజమైన స్నేహానికి భాష్యం ! 


***

గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .

తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు

ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.

చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)

వెలువరించిన పుస్తకాలు:

"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),

"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),

"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).

ప్రస్తుత నివాసం: హైదరాబాద్.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page