వారం వారం బహుమతులు - సెప్టెంబర్ 2026 ఫలితాలు

వారం వారం బహుమతులు - సెప్టెంబర్ 2026 ఫలితాలు
Results of Weekly Prizes - September 2026
నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్ | ప్రచురణ: 15/10/2026
మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్న NON STOP PRIZES – వారం వారం బహుమతులు కార్యక్రమం సెప్టెంబర్ 2026 ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఈ పోస్టులో బహుమతి పొందిన కథలు, విజేతలైన రచయితల వివరాలతో పాటు సెప్టెంబర్ 2026 ఉగాది షడ్రుచుల కథల పోటీ ఫలితాలను అందిస్తున్నాం. కథల పేర్లపై క్లిక్ చేసి బహుమతి కథలను చదవండి; రచయితల పేర్లపై క్లిక్ చేసి వారి ప్రొఫైళ్లను సందర్శించండి. విజేతలందరికీ మనతెలుగుకథలు.కామ్ తరఫున హృదయపూర్వక అభినందనలు.
వారం వారం బహుమతులు - సెప్టెంబర్ 2026 ఫలితాలు
ప్రతి వారం ఒక ఉత్తమ కథకు బహుమతి అందించే ఈ కార్యక్రమంతో పాటు ఉగాది షడ్రుచుల కథల పోటీలు, విజయదశమి 2026 కథల పోటీలు వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తెలుగు కథా రచయితలను ప్రోత్సహిస్తున్నాం. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న స్పాన్సర్లకు, రచయితలకు, పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
విషయ సూచిక
1). బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )
2). విజయదశమి 2026 కథల పోటీలు
3). ఉగాది షడ్రుచుల కథల పోటీలు
4). NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) సెప్టెంబర్ 2026 ఫలితాలు
5). సెప్టెంబర్ 2026 ఉగాది షడ్రుచుల కథల పోటీల ఫలితాలు
1). బహుమతులకు సహకరిస్తున్న వారు
వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.
రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు. బహుమతి కథ మీరే ఎంపిక చేయవచ్చు.
వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.
ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.
*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*శ్రీ భళ్ళముడి నాగరాజు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*G. S. S. కళ్యాణి గారు తమ అమ్మమ్మాతాతయ్యలు కీ. శే. ఉప్పలూరి సత్య ఫల్గుణ వెంకట అప్పారావు మరియు కీ. శే. ఉప్పలూరి లలిత నాంచారమ్మ దంపతుల జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని స్పాన్సర్ చేస్తున్నారు. అంతేకాక బహుమతుల ఎంపికలో కూడా మాకు సహకరిస్తున్నారు.
గతంలో కొసమెరుపు కథల పోటీలు, హాస్య కథల పోటీలు స్పాన్సర్ చేసిన శ్రీ కర్లపాలెం హనుమంత రావు గారు ఇప్పుడు ఉగాది షడ్రుచుల కథల పోటీలు స్పాన్సర్ చేస్తున్నారు.
( ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/khrao )
*M. K. కుమార్, భళ్ళముడి నాగరాజు, Dr. లక్ష్మీ రాఘవ కామకోటి, Dr. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, Dr. M. N. బృంద, శ్రీపతి లలిత, భట్టు వెంకటరావు, కర్లపాలెం హనుమంత రావు, ఇంకా మరికొందరు రచయితలు తమ పారితోషకం మొత్తాన్ని ఇతర రచయితల బహుమతుల కోసం వెచ్చించమని కోరుతున్నారు.
తెలుగు రచయితలను ప్రోత్సహించాలనే మా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నందుకు వీరందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
2). విజయదశమి 2026 కథల పోటీలు:
విజయదశమి 2026 కథల పోటీ బహుమతుల వివరాలు :
ఏకైక ప్రథమ బహుమతి : రూ: 5000 /-
ఐదు విశిష్ట(ప్రత్యేక) బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-
పూర్తి వివరాలు ఈ లింక్ లో చూడండి:
3). ఉగాది షడ్రుచుల కథల పోటీలు:
కీ.శే. కర్లపాలెం మోహనరావు గారి స్మారక పురస్కారం
🥇 ప్రథమ బహుమతి – ₹500
🥈 ద్వితీయ బహుమతి – ₹300
🥉 తృతీయ బహుమతి – ₹250
👉 ప్రతి నెల 3 బహుమతులు
👉 మొత్తం 12 నెలలు ఈ పోటీ కొనసాగుతుంది
👉 ఒక రచయితకు ఒకసారి మాత్రమే బహుమతి.
బహుమతులను శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు.
పూర్తి వివరాలు ఈ లింక్ లో చూడండి:
4). NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) సెప్టెంబర్ 2026 ఫలితాలు:
అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/09/2026 వరకు పొడిగిస్తున్నాము.
రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.
బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.
విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.
వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.
సెప్టెంబర్ 2026 వారం వారం బహుమతుల ఫలితాలు: ( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి.
06/09/2026 | ||
06/09/2026 | ||
06/09/2026 | ||
06/09/2026 | గంటి ఆశ పద్మిని | |
13/09/2026 | ||
13/09/2026 | ||
13/09/2026 | ||
20/09/2026 | ||
20/09/2026 | ||
20/09/2026 | ||
20/09/2026 | ||
20/09/2026 | ||
27/09/2026 | ||
27/09/2026 | ||
27/09/2026 | ||
27/09/2026 |
5). సెప్టెంబర్ 2026 ఉగాది షడ్రుచుల కథల పోటీల ఫలితాలు: ( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి.)
ప్రథమ బహుమతి | ||
ద్వితీయ బహుమతి | ||
తృతీయ బహుమతి |
విజేతలకు మా అభినందనలు.
వారికి వ్యక్తిగత మెయిల్స్ తో పాటు ప్రశంసాపత్రాలు 22/10/2026 లోగా పంపబడతాయి.
బహుమతి మొత్తం 22/10/2026 లోగా పంపడం జరుగుతుంది.
పాఠకులకు, రచయితలకు మరొకమారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మల్లవరపు సీతారాం కుమార్
గౌరవ సంపాదకులు




Comments