ఓ కాఫీ బ్రేక్ కథ

O Coffee Break Katha - Telugu Moral Story | Harish Babu Pondugula
ఓ కాఫీ బ్రేక్ కథ - తెలుగు నీతి కథ | హరీష్ బాబు పొందుగుల
Published in manatelugukathalu.com on 31/08/2026
“ఓ కాఫీ బ్రేక్ కథ” ఒక సాధారణ ఆఫీస్ సంఘటనలా కనిపించినా, మనిషి ప్రవర్తన గురించి చాలా ముఖ్యమైన జీవిత పాఠాన్ని చెబుతుంది. మనకు అవసరమైనప్పుడు సహాయం చేసే వ్యక్తిని గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ కథ గుర్తుచేస్తుంది.
రోహిత్, బాలాజీ అదే కంపెనీలో దాదాపు ఒకేసారి జాయిన్ అయ్యారు.. కానీ బాలాజీకి పని మీద పట్టు తక్కువ. సో.. రోహిత్ హెల్ప్ తీసుకుంటూ ఉండేవాడు..
ఒక రోజు.. పొద్దున్నే ఆఫీస్‌కి వచ్చిన రోహిత్... లాప్‌టాప్ బ్యాగ్ కేబిన్ దగ్గర పెట్టేసి.. టీ తాగుదామని క్యాంటీన్‌లోకి వెళ్ళాడు.. తన టీమ్ అంతా ఒకే టేబుల్ దగ్గర చేరి బాతాకాని కొడుతున్నారు... తను కూడా మాటలో మాట కలిపాడు..
"హే 'మనం' మూవీ ఎలా ఉందట.." ఎవరో అడిగారు.
"నేను చూసాను... పెద్దగా నచ్చలేదు.." తన ఒపీనియన్ చెప్పాడు.. రోహిత్..
వెనకాలే బాలాజీ అనే అతను అన్నాడు "తెలుగులో చూడలేదేమో.." అని.
అందరూ గొల్లున నవ్వారు....
రోహిత్‌కి ఈ బాలాజీ కామెంట్స్ నచ్చలేదు.. తనని కార్నర్ చేసి అవమానించినట్టు అనిపించింది... అక్కడి నుంచి వెంటనే తనకి కాల్ ఉంది అని లేచి వచ్చేసాడు...
ఇది జరిగి కొంత కాలం అయింది... ఒకరోజు బాలాజీ హడావిడిగా రోహిత్ దగ్గరకు వచ్చాడు... "రోహిత్ రోహిత్ త్వరగా రా... నాకు కాన్ఫరెన్స్ కాల్ నడుస్తోంది. ఏం చెప్తున్నారో అర్థం కావటం లేదు..." అన్నాడు.
రోహిత్ వెళ్లి కాల్ విన్నాడు.. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థమైంది... "సరే నాకు అర్థమైంది నేను చేసి ఇస్తాలే" అని అన్నాక "ఆ ఫైల్ నాకు మెయిల్ చెయ్ బాలాజీ" అని చెప్పి అక్కడి నుంచి డెస్క్ దగ్గరకు వచ్చేసాడు....
బాలాజీ రోహిత్‌కు ఫైల్ పంపాడు.
రోహిత్... తన పని తను చేసుకుంటున్నాడు...కాసేపు వెయిట్ చేశాక బాలాజీ రోహిత్ డెస్క్ దగ్గరకు వచ్చాడు... "ఏంటి రోహిత్ నా వర్క్ చేశావా?"
"చేయలేదు నా వర్క్ చేశాక చేస్తా"
"లేదు రోహిత్ నాకు అర్జెంటు.. ఇప్పుడే చేయి" గట్టిగా అన్నాడు బాలాజీ.
"ఏంటి అరుస్తున్నావ్... నేను ఇప్పుడు చేయను.. కావాలంటే నువ్వు చేసుకో వెళ్లి.... లేదా వెయిట్ చెయ్.."
"ఇప్పుడు చేస్తావా చేయవా.... రోహిత్." ప్లీజ్ అనే పదం కూడా వాడటానికి ఇష్టపడలేదు బాలాజీ...
మన అవసరం ఉన్నపుడు కోపం పక్కన పెట్టాలి... మనకు సహాయం చేసే వాడిని చులకనగా మాట్లాడకూడదు.... లాంటి ప్రాథమిక సూత్రాలు పక్కన పెట్టాడు... పాపం... బాలాజీ.
"ఈ భయం నా మీద జోకులేసి నవ్వుతున్నపుడు ఉండాల్సింది... సరే నాకు పని ఉంది. నువ్వు ఇంకెవరుతోనైనా హెల్ప్ తీసుకుని నీ పని చేయించుకో... అయినా కూడా అది చాలా సింపుల్ ఎక్సెల్ వర్క్... పెద్ద కష్టం కాదు.. కావాలంటే ఎలా చేయాలో చెప్తాను.. కూర్చో.... సరే మరీ..."
"లేదు నువ్వే చెయ్యి... నాకు రాదు"
"ఐ యామ్ సారీ.. చేసుకుంటే చేస్కో లేదా వెళ్ళు.... డోంట్ డిస్టర్బ్ మీ.... నౌ ప్లీజ్ గో.."
ఎర్రబడ్డ మొహంతో... అవమాన భారంతో... అక్కడి నుంచి బాలాజీ వెళ్లిపోయాడు.... అవమానం అంటే ఏంటో అవతలి వాళ్లకు కూడా తెలియాలి కదా... మళ్ళీ ఆ రోజు రోహిత్ దగ్గరకు రాలేదు బాలాజీ... ఆ తరువాత.... వారం రోజులు ఆఫీస్‌కి కూడా రాలేదు... నెల రోజులు గడిచాక.. రోహిత్‌కు తెలిసింది.. బాలాజీని జాబ్ నుంచి తీసేసారు అని.......
విషయం తెలుసుకుని రోహిత్ బాధపడ్డాడు.. కానీ తప్పదు కొన్ని విషయాలు అనుభవమే నేర్పాలి..
"జీతం ఇచ్చేవాడి మీద జోకులు వేయకూడదని.. సహాయం చేసినవారి పైన నవ్వితే నవ్వుల పాలు కావలసి వస్తుందని తెలుసుకోకపోతే కష్టం.." అనుకున్నాడు..
-- సమాప్తం ---
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:
హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: హరీష్ బాబు పొందుగుల
ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు. వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష .









Comments