top of page
Original.png

అమ్మకు అన్నీ సమస్యలే!

29 minutes ago
2 min read

ఇంట్లో దుమ్ము, గిన్నెలు, బట్టలు వంటి చిన్న చిన్న పనులను గమనిస్తున్న తెలుగు తల్లి — అమ్మకు అన్నీ సమస్యలే, కొత్త విరిత రచన.

Ammaku Annee Samasyale - Telugu Inspirational Article | Kotha Viritha

అమ్మకు అన్నీ సమస్యలే! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 15/10/2026


ఇంట్లో టీవీ మీద దుమ్ము, టేబుల్ మీద మరక, సింక్‌లో గిన్నెలు, సోఫా మీద బట్టలు… ఇవన్నీ మనకు చిన్న విషయాలే! కానీ అమ్మకు మాత్రం ఒక్కొక్కటీ పెద్ద సమస్యే!

అమ్మకు ఎందుకింత పట్టింపు? ప్రతి చిన్న పనినీ ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటుంది?

సరదాగా ప్రారంభమై, అమ్మ కనిపించని శ్రమను గుర్తుచేస్తూ మనసును కదిలించే రచన “అమ్మకు అన్నీ సమస్యలే!” — కొత్త విరిత గారి కలం నుంచి.



ఇంట్లో అందరికీ సమస్యలు ఉంటాయి…

కానీ అమ్మకు మాత్రం అన్నింటిలోనూ సమస్యే!


టీవీ మీద కనిపించని దుమ్ము కణం కూడా

అమ్మ కంటికి స్పాట్‌లైట్‌లో కనిపిస్తుంది.

టేబుల్ మీద చిన్న మరక ఉంటే…అది కూడా అమ్మ మనశ్శాంతికి పెద్ద సమస్యే!


కిచెన్ ప్లాట్‌ఫామ్ కాస్త జిడ్డుగా ఉంటే… “అది సమస్యే!”

సోఫా మీద మడతపెట్టని బట్ట కనిపిస్తే… అదీ మరో సమస్య!

సింక్‌లో రెండు గిన్నెలు ఉంటే… అవి కడిగే వరకు సమస్యే!


బట్టలు ఉతకకపోయినా సమస్యే…

ఉతికినవి ఆరేయకపోయినా సమస్యే!


ఆరేసినవి మడతపెట్టకపోయినా సమస్యే…

మడతపెట్టినవి సరైన చోట పెట్టకపోయినా సమస్యే!


ఇంట్లో ఎవరికీ కనిపించని చిన్న చిన్న పనులన్నీ అమ్మకే ఎందుకో స్పష్టంగా కనిపిస్తాయి.

అందుకే మన దృష్టిలో అమ్మకు ప్రతి విషయంలోనూ సమస్యే!


కానీ ఒక్కసారి ఆలోచిస్తే…ఆ “సమస్యలు” లేకపోతే ఇల్లు ఎలా కనిపిస్తుంది?


శుభ్రంగా ఉన్న నేల వెనుక అమ్మ చేతులు కనిపించవు.

చక్కగా సర్దిన గది వెనుక ఆమె కష్టం కనిపించదు.


సమయానికి దొరికే బట్టల వెనుక ఆమె శ్రమ కనిపించదు.

వేడిగా దొరికే భోజనం వెనుక ఆమె అలసట కనిపించదు.


మనకు కనిపించేది… చక్కగా ఉన్న ఇల్లు మాత్రమే.

అమ్మకు కనిపించేది… ఆ ఇంటిని అలా ఉంచాల్సిన బాధ్యత.


ఒక్కరోజు అమ్మ ఏ పనీ చేయకుండా ఉంటే…

ఆమె “సమస్యలు” ఎంత అవసరమో మురికి ఇల్లు మనకే చెప్పేస్తుంది.


సమస్యల మధ్య జీవితకాలం సతమతమవుతూనే ఉంటుంది.

ఏంటో పిచ్చి అమ్మ!


మన కోసం ఇంత కష్టపడటం కూడా ఒక సమస్యే కదా… 


***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page