top of page

స్నేహమేరా జీవితం

#SnehameraJeevitham, #స్నేహమేరాజీవితం, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

ree

Snehamera Jeevitham - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 31/08/2025

స్నేహమేరా జీవితం - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


 

“అరేయ్ రాజు! యియన పేరు శంకర్ గౌడ్, స్థలాలు అమ్ముతాడు, కొంటాడు. ఒక మంచి వెంచర్ చేప్పాడు. నాకు నచ్చింది. నువ్వు కూడా సరే అంటే ఇద్దరం రేపు ఆదివారం వెళ్లి చూసి వద్దాం” అన్నాడు మురళి. 


మురళి, రాజు యిద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు, ఏది కొన్నా యిద్దరూ కొంటారు, లేదంటే మానేస్తారు. 


“స్థలం కొనడం ఎందుకురా, అందుట్లో ఊరికి ముప్పై కిలో దూరం, మనం వెళ్లి చూసుకోగలమా? ఎవ్వడో ఆక్రమిస్తే కోర్టు చుట్టూ తిరగలేము. నీకు ఓపిక ఉంటే నువ్వు కొనుక్కో. నాకు వద్దు” అన్నాడు రాజు. 


“సార్ దూరం అయినా బంగారంలాంటి స్థలం, పది సంవత్సరాలు వూరుకుంటే యాబై లక్షలు దాకా పోతుంది” అన్నాడు శంకర్ గౌడ్. 


“అదేబాబు నేను అనేది. పోతుంది” అని అన్నాడు రాజు నవ్వుతూ. 


“ఒరేయ్! రెండు వందల గజాలు లక్ష రూపాయలు, పోతే లక్ష, వస్తే యాబై లక్షలు. నీ కొడుకుని డాక్టర్ చెయ్యచ్చు. ఈ గుమస్తా ఉద్యోగం లో ఏమి దాస్తావు?” అన్నాడు మురళి. “మొన్ననే మా అబ్బాయి స్కూల్ ఫీజులు కి అరవై వేలు జీపీఫ్ పెట్టి తీసుకున్నాను. నాకు వెనుక డబ్బులు పంపించే వాళ్ళు ఎవ్వరు లేరు. నన్ను బలవంతం పెట్టకు” అన్నాడు రాజు. 


“సరే నీ యిష్టం, సారి అండి, మేము కొనలేము ఏమి అనుకోకండి” అన్నాడు శంకర్ గౌడ్తో మురళి. 


“సార్! యింకోసారి ఆలోచన చెయ్యండి, రేపు మళ్ళీ వస్తాను” అని వెళ్ళిపోయాడు శంకర్ గౌడ్. 


క్యాంటీన్ లో టీ తాగుతో “ఎందుకు రా రెండు లక్షలకి ప్రొవిడెంట్ ఫండ్ లోన్ పెట్టావుట” అని అడిగాడు స్నేహితుడు మురళి ని. 


“అవసరం పడిందిలే. మన దగ్గర బ్యాంకు బాలన్స్ లేదుగా. అందుకే లోన్ పెట్టాను” అన్నాడు మురళి. 


రాజు కూడా ఇహ ఏమి మాట్లాడకుండా వూరుకున్నాడు. 


రోజులు అన్నీ మనవి కాదు అన్నట్టుగా మురళి కి వరంగల్ ట్రాన్స్ఫర్ అయ్యింది. వెళ్ళక తప్పదు, కొన్ని రోజులు ఉదయం అరుగంటలకు ట్రైన్ లో బయలుదేరి వరంగల్ వెళ్లి రాత్రి పదిగంటలకు ఇంటికి చేరేవాడు. శని, ఆదివారం స్నేహితులు కుటుంబంతో సహా బయటకు తిరిగే వాళ్ళు. ఒక శనివారం మురళి తన స్నేహితుడు రాజుతో అన్నాడు, “నాకు తెల్లవారిజామున లేచి వరంగల్ వెళ్లడం కష్టంగా వుంది. అందుకే మకాం హైదరాబాద్ నుంచి వరంగల్ మార్చేద్దాం” అని. 


“పర్వాలేదు ఫోన్లు వున్నాయిగా మాట్లాడుకుందాం. నువ్వు యిబ్బంది పడకూడదు. వరంగల్ లో మంచి ఇల్లు తీసుకుని వెళ్ళిపో. అప్పుడప్పుడు నువ్వు హైదరాబాద్ రా, నేను వరంగల్ వస్తాను” అన్నాడు రాజు. 


పదిరోజుల తరువాత మురళి ఫ్యామిలీ తో వరంగల్ వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొన్నాళ్ళు రోజు, వారం కి ఒకసారి, ఆతరువాత నెలకు ఒకసారి మాట్లాడుకుని చివరికి కొత్త స్నేహం తో తరచుగా మాట్లాడుకోవడం ఆగిపోయింది యిద్దరి మధ్య. 


పిల్లలు పెద్దవాళ్ళు కూడా అవుతున్నారు. రాజుకి ప్రమోషన్ వచ్చింది. విషయం ఫోన్ చేసి చెప్పాలని ఎంత ప్రయత్నం చేసినా మురళి నుంచి జవాబు లేదు. ఒకరోజున వరంగల్ నుంచి వచ్చిన అటెండర్ చెప్పాడు, ‘మురళి గారు మీకు ఈ కాయితాలు ఇవ్వమన్నారు, ఆయన పరిస్థితి బాగుండలేదు, లంగ్స్ సరిగ్గా పనిచెయ్యడం లేదు, ప్రస్తుతం హాస్పిటల్ లో వున్నారు’ అని. 


కంగారు తో మురళి పంపిన కవర్ చింపి చూసాడు. అందులో ఒరిజినల్ సేల్ డీడ్ తోపాటు ఒక లెటర్ వుంది. 


‘ఒరేయ్ రాజు. హైదరాబాద్ నుంచి వచ్చిన తరువాత ఒక సంవత్సరం బాగానే వుంది. ఆతరువాత నాకు ఇన్స్పెక్షన్ వింగ్ కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో తెలంగాణా జిల్లాలో ప్రయాణం ఎక్కువ అయ్యింది. కొత్త స్నేహితులు, కొత్త అలవాట్లు. అందరూ నా రాజు లా వుండరు కదా. 


ఆ అలవాటు నా కొంప ముంచి హాస్పిటల్ పాలు చేసింది. చేతిలో వున్న డబ్బులు అయిపోయాయి. నీకు గుర్తుందా, పది సంవత్సరాల క్రితం మనల్ని స్థలం కొనమని ఒక అతను వచ్చి బలవంతం చేసాడు.. అప్పుడు నువ్వు ముందుకు రాలేదు.. నాకెందుకో ఆ స్థలం చూసిన తరువాత కొనడం మంచిది అనిపించింది. అయితే నువ్వు కొనుక్కోకుండా నేను కొనడం యిష్టం లేక నేను రెండు లక్షలు ప్రొవిడెంట్ నుంచి తీసుకొని రెండు ప్లాట్స్ కొన్నాను, ఒకటి నీకు, ఒకటి నాకు అని. 


యిప్పుడు నీ కొడుకు కర్ణాటక లో మెడిసిన్ చేస్తున్నాడు అని తెలిసింది. నా కూతురు ఎంబీఏ చదువుతోంది. ఈలోపు నాకు ముంచుకు వచ్చింది, హైదరాబాద్ లో కూడా చూపించుకున్నాను. కష్టం అన్నారు. నీకు నా విషయం తెలిస్తే తట్టుకోలేవని నిన్ను కలవలేదు. యిప్పుడు సమయం దగ్గర పడింది, నీ కోసం కొన్న స్థలం నీ పేరున విల్లు రాసాను. 


యిహ నా వైద్యం కోసం ఖర్చు పెట్టడం అవసరం అనిపించడం లేదు, నిన్ను చూడాలి అని వుంది. కానీ నువ్వు నన్ను చూసి తట్టుకోలేవు అని నా కోరిక చంపుకుంటున్నాను. నువ్వు నా తరువాత నా కూతురు కి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యి అంతే చాలు. స్నేహం మంచివాళ్ళతో చేస్తే జీవితం బాగుంటుంది, లేకపోతే నా జీవితం లా మధ్యలో ముగిసిపోతుంది, సెలవు, ఇట్లు నీ మురళి’. 


కన్నీళ్లు తుడుచుకుంటున్న రాజు ని చూసి, “మురళి సార్ మీ బంధువా?” అన్నాడు అటెండర్. అంతకంటే ఎక్కువ అని, మురళి సెలవు చీటీ రాసి తన ఆఫీసర్ కి పంపించి వెంటనే కారులో భార్యతో సహా బయలుదేరాడు. అటెండరు తో చెప్పాడు “నువ్వు కూడా మాతో రా, మురళి వాళ్ళ ఇల్లు చూపించాలి” అన్నాడు. 


వరంగల్ రాగానే ముందుగా మురళి వున్న హాస్పిటల్ కి వెళ్లారు. మంచం మీద బల్లిలా అతుక్కుపోయి ముక్కుకి ఆక్సిజన్ ట్యూబ్ తో వున్న మురళిని చూడగానే ఒక్కసారిగా బావురుమన్నాడు చాలా రోజుల తరువాత చూడటంతో. రాజుని చూసిన మురళి కదిలిక లేకుండా కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. 


నర్స్ ని అడిగాడు, ‘ఒక్కసారి నేను పేషెంట్ తో మాట్లాడొచ్చా’ అని.


“మీరు మాట్లాడండి, ఆయనని మాట్లాడించకండి, ఆక్సిజన్ మీద వున్నారు” అంది బయటకు వెళ్తో. 


“ఏమిటి రా మురళి, యింత జరుగుతున్నా నాకు చెప్పాలి అని అనిపించలేదా, నాకోసం నీడబ్బు తో స్థలం కొన్నవాడివి, నీ విషయాలు ఏమి తెలియకుండా ఎందుకు దాచావు, యిప్పుడు ఏమి కాలేదు, రేపు ఉదయంకి మా అబ్బాయి వస్తాడు, వాడు బెంగళూరు లో నాలుగో సంవత్సరం మెడిసిన్. నిన్ను మేము బెంగళూరు తీసుకుని వెళ్లి శానిటోరియం లో చేరిపించుతాము. కొన్ని నెలల్లో మామూలు మనిషి వి అయిపోతావు, నేను వచ్చేసా కంగారు పడకు” అన్నాడు రాజు. 


రాజు మాటలు విన్న మురళి చిన్నగా నవ్వి పక్కన వున్న పుస్తకం లో యిలా రాసాడు. “నా చివరి స్టేజిలో నిన్ను చూసాను, అది చాలు, నాకు ఒక కూతురు వుంది తెలుసుగా, దాని పెళ్ళి నీ చేతుల మీద చేసి నా కోరిక, నా స్థలం అమ్మేసి దానికి పెళ్ళి చేసి మిగిలిన డబ్బులు మీ సిస్టర్ కి యిచ్చేసేయి” అని రాసాడు. 


“నీకు ఆబ్జెక్షన్ లేకపోతే నీ కూతురిని నా కోడలుగా చేసుకుంటను, నువ్వే నీ కూతురు కి కన్యాదానం చేస్తావు, కంగారు పడకు అన్నీ సవ్యంగా జరుగుతాయి, నీ మెడికల్ లీవ్ అన్నీ నేను ఆఫీసు వాళ్ళ తో మాట్లాడి చేయిస్తాను, నీకు తగ్గగానే మళ్ళీ హైదరాబాద్ వచ్చేద్దువుగాని” అని ధైర్యం చెప్పాడు రాజు. 


కొడుకు వచ్చిన తరువాత అంబులెన్సు లో మురళి ని ఎక్కించుకుని బెంగళూరు తీసుకుని వెళ్ళి శానిటోరియంలో జాయిన్ చేసారు. ముందు తనతో తెచ్చిన లక్ష రూపాయలు హాస్పిటల్ కి కట్టాడు రాజు. పరీక్ష చేసిన డాక్టర్స్ లంగ్ ఫైబ్రాయిస్ అనుకుని బయపడ్డాము, ప్రకృతి వైద్యం ద్వారా మీ స్నేహితుడు కి తగ్గించగలమని నమ్మకం వుంది, అయితే కనీసం ఆరు నెలలు యిక్కడ ఉండాలి, డబ్బు ఖర్చులు ఉంటాయి, అందుకు మీరు సిద్ధం అయితే వెంటనే వైద్యం మొదలుపెడతాము, తరువాత దేవుడి దయ అన్నాడు హాస్పిటల్ హెడ్డ్ దయానిధి. 


డబ్బులు గురించి మీరు ఆలోచించకండి, నాకు తెలియచేయ్యగానే మీకు పంపుతాను, మా వాడిని రక్షించండి అన్నాడు రాజు. 


నాలుగు రోజులు బెంగళూరునే వుండి తనకి ఆఫీస్ లో పని ఎక్కువగా వుండటంతో హైదరాబాద్ వచ్చేసాడు. 


రాజు వాళ్ళ అబ్బాయి సతీష్ ప్రతి వారం వెళ్ళి మురళి ని చూసి వస్తున్నాడు. మురళి కూతురు రాధిక కూడా తండ్రికి సహాయంగా శానిటోరియంలో ఉంటోంది. నెలాఖరు కి శానిటోరియంలో రెండు లక్షలు కట్టాలిసి రావడంతో తన యింటి మీద అప్పు తీసుకుని బెంగుళూరు వెళ్ళి 

మురళని చూసి వచ్చాడు. ఆరోగ్యం లో పెద్దగా తేడా లేకపోయినా మురళి మోహంలో జీవకళ కనిపించింది. రెండు మూడు నెలలో మురళి ఆరోగ్యం బాగా కుదుటపడి ఆక్సిజెన్ అప్పుడప్పుడు తీసివేసినా యిబ్బంది లేకుండా గాలి పీల్చుకొగలుగుతున్నాడు అని డాక్టర్ దయానిధి చెప్పాడు. 


ఇటువంటి అద్భుతమైన వైద్యం క్రిస్టియన్ శానిటోరియంలోనే దొరుకుతుంది అనిపించే విధంగా మురళి పూర్తిగా ఎనిమిది నెలలకు కోలుకుని శానిటోరియం నుంచి బయటకు రాగలిగాడు. డాక్టర్ దయానిధి ఫీజులో ఇరవై అయిదు పరసెంట్ తగ్గించి తీసుకున్నాడు. 


రాజు కొడుకు సతీష్ డాక్టర్ చదువు పూర్తి అయ్యింది, పై చదువుకు వెళ్లే లోపు కొడుకు కి పెళ్ళి చేద్దాం అనుకుని మురళి కూతురు రాధిక తో వివాహం జరిపించాడు. మురళి కూతురుని సతీష్ చేతుల్లో పెట్టి రాజుని కౌగిలించుకుని ‘నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం’ అన్నాడు. 


 నిజమే గా బంధువులు చెయ్యలేని త్యాగం స్నేహితుడు చేస్తాడు. స్నేహామేరా జీవితం పాట నిజమే. 


 మంచి స్నేహితులని వదులుకోకండి. 


                              శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree












Comments


bottom of page