సోషల్ మీడియా తెచ్చిన తిప్పలు
- Palla Deepika
- Apr 19
- 3 min read
#సోషల్మీడియాతెచ్చినతిప్పలు, #SocialMediaTechhinaThippalu, #PallaDeepika, #పల్లాదీపిక, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Social Media Techhina Thippalu - New Telugu Story Written By Palla Deepika
Published In manatelugukathalu.com On 19/04/2025
సోషల్ మీడియా తెచ్చిన తిప్పలు - తెలుగు కథ
రచన: పల్లా దీపిక
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శివ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆఫీస్ కి వచ్చి తన పనిలో తాను ఉన్నాడు. పనిలో అయితే ఉన్నాడు కానీ తన ఆలోచనలు మాత్రం వాళ్ళ నాన్న మీదే ఉన్నాయి. ఎందుకంటే ఊరిలో వాళ్ళ నాన్న(రమణ)ఒక్కడే ఉంటున్నాడు. దానికి కారణం కొన్ని నెలల క్రితమే వాళ్ళ అమ్మగారు చనిపోవడం.
శివ ఎంత చెప్పినా వాళ్ళ నాన్న హైదరాబాద్ కి రావడానికి అంగీకరించలేదు. ఎప్పుడు అడిగినా అక్కడి వాతావరణం నాకు సరిగ్గా అనిపించదు, లేదా ఇక్కడ ఊరిలో చుట్టూ బంధువులు మిత్రులతో ఉన్న నేను అక్కడ ఒక్కడినే ఏం చేయను, పల్లెటూర్లో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది సిటీలో ఆ కాలుష్యాన్ని నేను భరించలేను అని ఏదో ఒక కారణం చెప్పి రాను అనేవాడు.
ఈసారి ఊరికి వెళ్లి నాన్నను ఎలాగైనా ఒప్పించి హైదరాబాద్ కి తీసుకురావాలన్నది శివ ఆలోచన. అలా అనుకున్నాడో లేదో, వెంటనే ఊరికి వెళ్లాలి అని చెప్పి, బస్ టికెట్ బుక్ చేసుకుని ఆఫీస్ లో లీవ్ కి కూడా అప్లై చేశాడు. మరుసటి రోజు శివ తన ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్లిన వెంటనే వాళ్ళ నాన్న గారితో మాట్లాడి ఒప్పించి హైదరాబాద్ కి తీసుకొచ్చాడు. సరే కొద్ది రోజులు ఇక్కడ గడిపితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు రమణ.
శివ రోజూ ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లేవాడు. శివ ఆఫీస్ కి వెళ్లిన తర్వాత రమణ కి ఏం చేయాలో పెద్దగా తోచేది కాదు. తన కొడుకు ఉండేది ఒక అపార్ట్మెంట్లో, కాబట్టి అక్కడ ఎవరు రమణ కి పరిచయం కూడా అవ్వలేదు. పరిచయం చేసుకోవాలి అనుకున్నా ఎవరి పనులలో వాళ్లు చాలా బిజీగా ఉండే వాళ్ళు. పైగా కూరగాయలు కావాలన్నా లేదా ఏవైనా సరుకులు కావాలన్నా ప్రతి చిన్న విషయానికి శివకి ఫోన్ చేసేవాడు, పనిలో ఉన్న శివ కాల్స్ ని అటెండ్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది.
ఓ రోజు శివ తన నాన్నకి స్మార్ట్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అది చూసిన రమణ "నాకెందుకు రా ఈ స్మార్ట్ ఫోన్లు" అని శివతో అన్నాడు. దానికి శివ "నేను ఆఫీసులో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటానికి కొన్ని సార్లు వీలు కాదు. అదే నువ్వు ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే మెసేజెస్ చేయొచ్చు, ఇంకా నీకు కాలక్షేపానికి కూడా ఉంటుంది" అని అన్నాడు.
అప్పుడు రమణ శివతో "ఈ ఫోన్ ని ఎలా వాడాలో నాకు తెలియదు కదరా" అని అన్నాడు.
అప్పుడు శివ "నేను నేర్పిస్తాను కదా నాన్న" అని చెప్పి ఎలా వాడాలో నేర్పించాడు.
రమణ తన కొడుకు శివ చూపించేవి బాగా గమనించి స్మార్ట్ ఫోన్ ని ఎలా వాడాలో నేర్చుకున్నాడు.
ఆ రోజు నుంచి రమణ కి కాలక్షేపం బాగా అయ్యేది. రమణ సోషల్ మీడియాని ఎలా వాడాలో తెలుసుకుని అందులో ఫోటోలు తీసుకొని పెట్టేవాడు. పోస్టులకు లైకులు కొట్టి మిత్రులకి రిక్వెస్ట్ లు పంపేవాడు.
అలా జరుగుతుండగా ఒకరోజు రమణ ఫ్రెండ్ రాజు తనకి ఒక మెసేజ్ చేశాడు. తనకి యాక్సిడెంట్ అయిందని, తను హాస్పిటల్ లో ఉన్నానని, మాట్లాడే పరిస్థితిలో లేనని ఎమర్జెన్సీగా ఒక పది వేలు డబ్బులు కావాలి అని సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. అది చూసిన రమణ ఏమీ ఆలోచించకుండా రాజు పెట్టిన అకౌంట్ డీటెయిల్స్ కి పదివేలు పంపించాడు.
కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రమణ రాజుని గుడిలో చూసి, దగ్గరికి వెళ్లి పలకరించాడు. ఇద్దరూ కాసేపు వాళ్ళ వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుతుండగా రమణ రాజుతో "ఇప్పుడు నీకు బాగా ఉందా? అసలు ఆరోజు యాక్సిడెంట్ ఎలా అయింది?" అని అడిగాడు.
దానికి రాజు ఆశ్చర్యంగా రమణతో "అదేంటి? అసలు నాకెప్పుడు యాక్సిడెంట్ అయింది?" అని అన్నాడు.
అప్పుడు రమణ "నీకు యాక్సిడెంట్ అయింది అని నాకు సోషల్ మీడియాలో మెసేజ్ చేశావు కదా! నేను నీకు డబ్బులు పంపాను కదా!" అని ఆ మెసేజ్ ని చూపించాడు.
అది చూసిన రాజు "నాకు సోషల్ మీడియా అకౌంట్ లేదు. సోషల్ మీడియాలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి అని నా కొడుకు ఉన్న అకౌంట్ ని తీసేశాడు" అని చెప్పాడు.
అప్పుడు రమణకి విషయం అర్థం అయ్యింది. సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్ లు నిజమైనవా కాదా అని మొదట మనం నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే వారితో మాట్లాడాలి అని అనుకున్నాడు. గుడి నుంచి ఇంటికి వచ్చాక తన మొబైల్ లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్ లలో అత్యవసరమైనవి తప్ప మిగతావి అన్నీ తీసేశాడు.
***
పల్లా దీపిక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : పల్లా దీపిక
వయసు: 21
చదువు: బీటెక్, ఫైనల్ ఇయర్
హాబీ: చిత్రలేఖనం,కథా రచన, కవిత్వం
నివాసం: ప్రొద్దుటూరు కడప జిల్లా ఆంధ్ర ప్రదేశ్.
@The_leo_tv
•7 hours ago
❤