top of page

క్షీరసాగర మథనము - 23

Updated: Apr 19

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 23 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 18/04/2025

క్షీరసాగర మథనము - 23 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 23 చదవండి..


118.

వచనము.


ఆ సమయంబున రాహువును గుర్తించిన సూర్యచంద్రులు మోహినిని గాంచి కనుసైగ చేయగా.


119.

తేటగీతి.


సూర్యచంద్రుల సైగతో జూపు ద్రిప్పి 

చక్రమున్ గొని మోహిని సత్వరముగ

దుష్ట రాహువు కంఠమున్ దునిమివేయ 

తనువు కూలగన్ మిగిలెనా తలయొకటిగ.//


తాత్పర్యము.


సూర్యచంద్రులు సైగ చెయ్యగానే మోహిని చూపు త్రిప్పి రాహువును గమనించి,వెంటనే తన చేతిలోకి చక్రమును తెచ్చుకొని ఆ రాహువు కంఠమును ఖండించింది. రాహువు శరీరం నిర్జీవంగా కూలిపోయింది. తలమాత్రం మిగిలిఉంది.//


120.

తేటగీతి.


కంఠమందు నమృత బిందు కణము జార

ప్రాణవంతుడై రాహువు బ్రతికిపోయి 

వత్సరంబున కొకమారు పగవహించి 

మ్రింగవచ్చునా ఘనచంద్రమిత్రవరుల.//


తాత్పర్యము.


మోహిని రాహువు యొక్క కంఠమును ఖండించేసరికి ఒక అమృతబిందువు రాహువు యొక్క కంఠసీమవరకు జారింది. అందుకని రాహువు తల జీవముతో మిగిలి ఉండగా, అతడి మొండెముమాత్రము కూలిపోయింది. అయితే మోహినికి తన నిజస్వరూపము గురించి తెలిపారని రాహువు పగతో సంవత్సరానికి ఒకసారి సూర్యచంద్రులను మ్రింగటానికి వస్తున్నాడు.//


(సశేషం )



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page