top of page

స్ఫూర్తి ప్రదాత



'Spurthi Pradatha' - New Telugu Story Written By Bhanupriya

Published In manatelugukathalu.com On 18/05/2024

'స్ఫూర్తి ప్రదాత' తెలుగు కథ

రచన: భానుప్రియ


"అమ్మా.. అమ్మా!" అని అరుచుకుంటూ.. "ఏంటి? ఇంకా నాకు టిఫిన్ బాక్స్ రెడీ అవ్వలేదా! నాకు టైం అవుతుంది. నువ్వు ఏది సరిగ్గా నాకు టైం కి అందించవు!" అని చిరాకు మొఖంతో ఎప్పటిలాగానే జానకి పై చిందులు వేస్తూ అరిచాడు అజయ్.

  

"అజయ్! ఎప్పుడో రెడీ చేశాను రా నీ బుక్స్ నీ బ్యాగ్ కూడా రెడీ చేసి అక్కడే పెట్టాను. " అని చెబుతుండగానే అవేవీ పట్టించుకోకుండా "ఓకే లే" అని తన పాటికి తాను కాలేజీకి బయలుదేరుతాడు అజయ్.. 


 ఇక మోహన్ రావు "జానకి నా కళ్ళజోడు, నా పర్సు, టిఫిన్ ఎక్కడ? ప్రతిసారి నిన్ను అడుగుతూ ఉండాలా!! అన్నీ సర్ది టేబుల్ పై పెట్టొచ్చు కదా!" అని అజయ్ లాగానే మోహన్ రావు కూడా జానకి పై విసుగును ప్రదర్శించి అన్ని రెడీ చేసిన బాక్స్ తీసుకొని తన పనికి బయలుదేరుతాడు. 


 ఇక జానకి రోజు నాకు ఉండే గొడవే ఇది అని ఒక చిరునవ్వు నవ్వుకొని చక చక పనులన్నీ చక్కదిద్దుకొని తినడానికి టైం లేక స్కూల్ కి బయలుదేరుతుంది, స్కూల్ టీచర్ గా పని చేసే జానకి.. 


సాయంత్రం బడి వదలగానే ఇంటికి చేరుకున్న జానకి కోపంతో అరుగుపై కూర్చున్న అజయ్ ని చూసి "ఏంటి రా అజయ్.. బయటే కూర్చున్నావు? కీస్ కిటికీలో పెట్టిన తీసుకో అని మెసేజ్ పెట్టాను కదా! చూసుకోలేదా!" అని అంటుండగానే తన తల్లిని పట్టించుకోకుండా కీస్ తీసుకొని లోపలికి వెళ్లి తన బ్యాగును సోఫాపై విసిరేసి "ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అమ్మ.. ఎంతసేపటినుంచి ఎదురు చూస్తున్నా నేను. " అని అంటుండగా "నీకు ఎన్నోసార్లు కాల్ చేశాను రా. నువ్వు లిఫ్ట్ చేయలేదు. అందుకే నీకు మెసేజ్ పంపా. కానీ నువ్వు నా మెసేజ్ కూడా చూడలేదు. "


 "నాకు తలనొప్పిగా ఉంది. వేడివేడిగా కాఫీ చేసి ఇవ్వు" అని రూముకు వెళ్తూ చెప్తాడు అజయ్..

 

 "అయ్యో అవునా అజయ్! కాస్త ఇలా తల పట్టు. నీకు జండుబాం రాస్తా”నని జండూబామ్ తీసుకొచ్చే లోపల అజయ్ తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంటాడు. 


'వీడు ఎప్పుడూ ఇంతే' అంటూ బాధతో కాఫీ చేసి ఇచ్చి తన పనిలో మునిగిపోతుంది జానకి. 


 ఇక మోహన్ రావు ఇంటికి వచ్చి ఆఫీసులో జరిగిన చిరాకు అంత జానకిపై చూపించి తను చేసిన టిఫిన్ తిని తను కూడా తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. 


 జానకి మాత్రం వచ్చిన బిల్లులన్నీ ఒకచోట చేర్చి "అయ్యో! వీళ్ళు ఇంకా కరెంటు బిల్లు, నల్ల బిల్లు, పాల బిల్లు ఇవి ఏవి కట్టలేదు. " అది నిట్టూరుస్తూ రేపు స్కూల్ కి లీవ్ పెట్టి ఈ బిల్లులన్నీ కట్టేయాలని ఇంకా ఏమేం పనులు ఉన్నాయని మార్కెట్ కి వెళ్లాలని ఇలా తన మనసులో ఎన్నో రేపటి పనులకై వ్యూహరచన చేసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది జానకి.. 


 మరునాడు ఉదయం అజయ్ నిద్ర లేస్తూ "అబ్బ ఏంటి? టైం 9 అయ్యిందా! ఏంటి ఈరోజు ఈ అమ్మగారు ఇంకా నన్ను లేపలేదు? అని కోపంతో అమ్మ, అమ్మ అని అరుస్తూ ఉండగా మోహన్ రావు కూడా నిద్రలేచి టైం చూసి ఏంటి? నన్ను ఇంకా లేపలేదు టిఫిన్ తయారు చేయలేదు. "

 జానకి అని ఇద్దరూ కలిసి జానకిని పిలుస్తుండగా ఇంట్లో అంతా నిశ్శబ్దంతో ఉండగా.. 


హాల్లో పడుకుని ఉన్న జానకిని చూసి "అమ్మ.. అమ్మ ఇంకా లేవలేదు. నన్ను లేపలేదు. ఏం మొద్దు నిద్ర పోతావు లే!" అంటూ చిరాకులతో తనను నిద్ర లేపుతుండగా జానకి ఎంతకూ కళ్ళు తెరవకపోవడంతో "నాన్న.. అమ్మకు ఏమైంది? కళ్ళు తెరవడం లేదు. " అని ఇద్దరు కంగారుతో డాక్టర్ కి ఫోన్ చేసి సమాచారం అందించగా డాక్టర్ ఇంటికి వచ్చి జానకిని చూసి తను ఈ లోకాన్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిందని చెప్పగా "అయ్యో అదేలా డాక్టర్ రాత్రి బాగానే ఉంది. " అని అంటూ బాధపడతారు. 


 ఇక జానకిని చూడడానికి కాలనీ వాళ్ళందరూ ఒకరు వెనుక ఒకరు వస్తూ "అమ్మా జానకి.. నువ్వు మా అందరికీ ఎంతో సహాయం చేసే దానివి. ఎంత మంచి మనసు గల నీకు అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయి. " అంటూ ఒక్కరొక్కరు జానకి తమకు చేసిన మేలుని చెపుతూ ఉంటే అజయ్ మోహన్ రావు లు జానకి ఇన్ని పనులు చేసిందా! ఎప్పుడు మేము తనను పట్టించుకోకుండా తనకు ఏ పని చేతకాదు. అని తనను మనిషిలా కూడా చూడలేదు. అయ్యో! అంటూ తమ మనసులో బాధపడుతుంటారు. 


 ఇక జానకి పని చేసే పాఠశాలలోని ఉపాధ్యాయులు, పిల్లలు కూడా జానకి మృతదేహం చూసి బోరున విలపిస్తారు.

 

అందులో ఒక అమ్మాయి "మేడం మీరు లేవాలి. ఫీజు కట్టలేక ఆ తల్లిదండ్రులు నా చదువు ఆపాలని చూస్తే మీరు మీ కమ్మలు అమ్మి నన్ను చదువుపిస్తున్నారు. కావాలి టీచర్ మీలాంటి మంచివారు చనిపోకూడ”దంటూ ఆ అమ్మాయి జానకి చెయ్యి పట్టుకొని విలపించడం అజయ్, మోహన్ రావులనే కాకుండా అక్కడ ఉన్నవారు అందరిని కంటతడి పెట్టిస్తుంది. 

 

 హెడ్మాస్టర్ కూడా "నీకే కాదమ్మా, జానకి తన సంపాదన చిన్నదైనా ఇంకా నీలాగా చదువుకోలేని పిల్లలకు ముగ్గురికి తను ఓవర్ టైం చేసి డబ్బులు సంపాదించి వారిని చదువుపిస్తుంది. ఇలాంటి గొప్ప మనిషి, గొప్ప టీచర్ ఇంత తొందరగా పైకి వెళ్లిపోవడం" అని ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పడం.. 


ఇంకా ఎంతోమంది జానకి చేసే మంచి పనులను చెప్తూ ఉంటే "అయ్యో మా ఇంటి దేవతను మేము గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించిన మేము తనను చేరుకోలేని సుధీర తీరాలకు తాను వెళ్లిందని" తండ్రి కొడుకులిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని మనం ఎంత తప్పు పని చేశామంటూ పశ్చాత్తాప పడి జానకి శవం దగ్గర తన చేయి పట్టుకొని “క్షమించు అమ్మ”, “క్షమించు జానకి” అంటూ ఇరువురు ‘లే జానకి లే జానకి’ అంటూ' విలపించడం అందరినీ కలిచి వేస్తుంది. 


"ఇక సాయంత్రం కావస్తుంది. ఎంత ఏడ్చినా తను తిరిగి రాదు కదా! ఇక జరగవలసిన కార్యం చేయండి” అని అంటుండగా జానకి సహ ఉపాధ్యాయురాలు "జానకి మేడం తన మరణాంతరం తన అవయవాలను దానం ఇవ్వాలని హాస్పిటల్లో తన పేరును నమోదు చేసుకుంది.. " అని రోదిస్తూ చెప్పగా


"బతికుండగా ఏనాడు తనను భార్యగా ప్రేమగా తన మంచి చెడ్డలను చూడలేదు. తను తలనొప్పి అన్నా కూడా ఏనాడు హాస్పిటల్ కి తీసుకు వెళ్లలేదు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తను ఏ కోరిక కోరలేదు. నాలాంటి భర్త ఎవ్వరూ ఉండరు” అంటూ ఏడుస్తూ తన చివరి కోరిక అయినా నెరవేర్చాలని హాస్పిటల్ కి ఫోన్ చేసి జానకి మరణ వార్తను అందిస్తాడు. 

 డాక్టర్స్ జానకి ఇంటికి చేరుకొని జానకి అవయవాలను సేకరించుకొని ఒక ఐదు మంది పేషెంట్లకు జానకి అవయవాలను అమరుస్తారు.. 


జానకి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని తన స్ఫూర్తిని నింపుకొని తన కొడుకు అజయ్ భర్త మోహన్ రావు లు కూడా మేము మరణించిన తర్వాత మా అవయవాలను కూడా దానం చేస్తామని హాస్పిటల్లో రాసి ఇచ్చి “బతికున్నప్పుడు జానకికి ఎలాంటి బహుమానం ఇవ్వలేదు. ఇప్పుడు ఏ లోకంలో ఉన్న మేము చేసే ఈ మంచి పనికి ఏ లోకంలో ఉన్న జానకి సంతోష పడుతుంది. " అంటూ దుఃఖన్ని తమలో అణిచిపెట్టుకొని తమ ఇల్లు చేరుకుంటారు ఇరువురు.. 


 రెండు నెలల తర్వాత మోహన్ రావు అజయ్లు జానకి ట్రస్టును ఏర్పాటు చేసి ఎంతోమందికి చేయూతని అందించే దిశగా తమ కష్టా జీతాన్ని మొత్తం ఆ ట్రస్టుకు ఉపయోగిస్తూ జీవనపయనం సాగిస్తారు.. 

 

 అలా జానకి మరణించిన తను చేసిన సేవ రూపంలో, ఎందరికో అందించిన సహకారం రూపంలో ఎప్పటికీ బతికే ఉంటుందని నిరూపించింది. 

***

భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/priyanka

నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏




37 views0 comments

Comments


bottom of page