top of page
Original.png

శ్రామిక దినోత్సవము

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #శక్తిస్వరూపిణి, #SramikaDinotsavamu, #శ్రామికదినోత్సవము, #TeluguPoemOnMayDay

గాయత్రి గారి కవితలు పార్ట్ 16

Sramika Dinotsavamu - Gayathri Gari Kavithalu Part 16 - New Telugu Poems Written By 

T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 01/05/2025

శ్రామిక దినోత్సవము - గాయత్రి గారి కవితలు పార్ట్ 16 - తెలుగు కవితలు

రచన: T. V. L. గాయత్రి


శ్రామిక దినోత్సవము

(కవిత)

******************************

శ్రామికుల దినమంటు సభలెన్నో జరుపుచూ

నీమములు మరిచెదరు నిష్ఠ లేదందురు


 స్వేదబిందువులెపుడు చెబుతాయి గాథలను

బ్రతుకులో బాధలను భయపెట్టు తమస్సును


అగ్గిని రాజేసే ఆకలిని జోకొట్టి 

తగ్గిపోయిన కూలి తలరాత మారునా?


చట్టాలు తెస్తారు సహాయమంటుంటారు

చుట్టాలమంటారు సూక్తులను వల్లిస్తారు


పాలకులకు పట్టవా పడుతున్న కష్టములు?

 కూలి పోయేదాక  గొడవలేదంటారు


కార్మికునికి మంచి కాలంబు వచ్చునా?

నర్మిలిని పంచు సాధు జనావళి మెచ్చునా?


బాసటగ నిలుచుండి భయము పోగొడదాము

దాసత్వమును త్రెంచి ధైర్యమును చెబుదాము!


సమిష్టిగా నడిచి మన జాతి నుద్ధరిద్దాము!

మమతతో కార్ముకునికి మాన్యత నిద్దాము!


గౌరవముతో నతడి ఘనతను గుర్తిద్దాము!

చేరబిలిచి జీవితంలోని చింత తొలిగిద్దాము!


అలిసిన మనసున కాలంబననిద్దాము!

కలిసి మన మందరము కరమునందిద్దాము!//

************************************

కర్షకుడా నీ కోసం!...

(కవిత)














ఎఱ్ఱ జెండాను పట్టి ఎరుపెక్కిన చేతులు 

వెఱ్ఱి మొఱ్ఱి భయాలను విడిచి వేస్తాయి!


ఆకాశమే హద్దుగా అడుగేస్తే చాలు నీ 

ఆశలన్నీ తీరగా నానందం దొరుకుతుంది.


ధైర్యమొక్కటే నీకు దారి చూపిస్తుంది 

శౌర్యవంతుడా!నీవు సాగిపోవోయి!


కత్తి గొడ్డలి కొడవలి గొప్పవని నమ్ముచూ

ఉత్తమ కార్యాల నుద్యమంగా నడుపవోయి!


నీ శ్రమతోనే నేడు దేశము బ్రతుకుతోంది 

చెమట చుక్కలే జీవమును పోస్తుంటే 


అందరమూ హాయిగా అద్దాల మేడల్లో 

విందులారగిస్తాము వెరపును వదిలేస్తాము!


నీకు బాసటగా మేము నిలిచి యుంటామోయి!

ఓ కార్మికుడా! నీ యున్నతినే కోరుకుంటాము!


రావోయి కర్షకుడా!మంచి కాలంబు వచ్చులే!

దైవంబు వనినిన్ను తలుచు కుంటాములే!//

*******************************

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page