'Sri Gurubhyom Namaha' - New Telugu Article Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 05/09/2024
'శ్రీ గురుభ్యోమ్ నమః' తెలుగు వ్యాసం
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
శివుని అంశ దక్షిణామూర్తి కాగా, ఆ దక్షిణామూర్తి ప్రతిరూపమే గురువు.
అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించి దారి చూపే సద్గురువులు మీరు.
ఈ బ్రహ్మాండ సృష్టి అంతటా నిండి ఉండే పరబ్రహ్మ స్వరూపమే గురువు.
జననీ జన ,కుల అవ్యాజ ప్రేమకు మరో రూపం గురువు.
నిష్కల్మషమైన , నిర్మలమైన, స్వఛ్ఛమైన ప్రేమా ప్యాయతలు చూపేది గురువు.
పామరులను సైతం పండితులను చేసి ప్రయోజకులను చేసేది గురువు .
నిస్వార్థంగా విద్యాదానం చేసి కన్నవారి ప్రేమను మరిపించేది గురువు.
ఉన్నత స్థాయిలో శిష్యులు ఉండాలి అని ఆశించి, అహరహం వాళ్ల ప్రగతికి పాటు పడి వాళ్ళ అభ్యున్నతిని కోరుకునేది గురువు.
వటవృక్షంలా ఎంత ఉన్నతికి ఎదిగినా ఆ వృక్షంబు తొలి బీజం గురువే.
ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలము?
పత్రం- ఫలం - తోయం ఇచ్చినా తీర్చ లేని మీ ఋణం ప్రజ్ఞా పాటవాలతో మిమ్ములను సంత్రృప్తిపరచటమే సుగమం.
వేయేల పలుకులు ? ఆ దేవుని ప్రతిరూపమే గురువు.
ఏమిచ్చి మీ ఋణము తీర్చుకోగలము?
ఏ సేవలతో మిమ్మల్ని సంతృప్తి పరచగలము?
ఆమూలాగ్రము విద్యనభ్యసించి ప్రజ్ణ చూపటం తప్ప.
ఎన్ని సత్కార్యాలు చేసినా మీకు చేసే సన్మానము లోనే సంతృప్తి, ఆనందము కలుగును మిన్న.
గురు పూజోత్సవము ఈ ఒక్క రోజే కాదు, ఎల్లెడలా , సర్వత్రా పూజలందుకునే దైవం మీరు.
గురుపూజోత్సవ శుభాకాంక్షలు.
మీకివే నా నమస్సుమాంజలులు.భక్తితో సాష్టాంగ ప్రణామములు.🙏🙏
....నీరజ హరి ప్రభల.
Comentarios