top of page

శ్రీ శారదా పీఠం

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #శ్రీజ్వాలాముఖిమందిరం, #శ్రీశారదాపీఠం, #లక్ష్మీనారాయణమందిరం

ree

శ్రీ శారదా పీఠం - జమ్మూ కాశ్మీర్

Sri Sarada Pitam - New Telugu Poem Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 10/08/2025

శ్రీ శారదా పీఠం - తెలుగు కవిత

రచన: అద్దంకి లక్ష్మి 

పంచ పదులు

1

శ్రీ శారదా పీఠం జమ్మూ కాశ్మీర్ లో గలదు 

పాక్ ఆక్రమిత కాశ్మీరు ప్రాంతంలో గలదు

ఉన్నత అభ్యాసానికి ప్రధాన కేంద్రముగా గలదు

 5000 సంవత్సరాల పైగా భారతీయ వారసత్వం గలదు

 శంకరాచార్యులకు సర్వజ్ఞాన పీఠముపై కూర్చునే హక్కు లక్ష్మీ అద్దంకి


2

కాశ్మీర్ పండిట్లకు ముఖ్యమైన పవిత్ర స్థలము

ఉండేది దేవత పేరుతో ప్రసిద్ధ విశ్వవిద్యాలయము 

దేవికుడిచేయి పడిన ప్రదేశము

కాశ్మీరీ శైలులో ఎర్ర ఇసుకరాయితో నిర్మాణము

విద్యా జ్ఞాన శక్తి స్వరూపం వ్యక్తీకరించే వాక్ దేవత లక్ష్మీ అద్దంకి 


3

కాశ్మీరీ పండితులు, వేత్తలు కొలుస్తారు 

దేవి ఆశీర్వాదము కొరకు రచనలు పెడతారు 

వస్త్రంతో కప్పి పళ్ళెంలో ఉంచుతారు 

దేవత ఆమోదం తెలుపుతుందని నమ్ముతారు

 శక్తి దేవత యొక్క త్రిసభ్య స్వరూపంగా విశ్వసిస్తారు లక్ష్మీ అద్దంకి


ree

శ్రీ జ్వాలాముఖి మందిరం - కాంగ్రా


Sri Jwalamukhi Mandiram - New Telugu Poem Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 10/08/2025

శ్రీ జ్వాలాముఖి మందిరం - తెలుగు కవిత

రచన: అద్దంకి లక్ష్మి 

పంచ పదులు

1

శ్రీ జ్వాలాముఖి మందిరము కాంగ్రాలో కలదు,

హిమాచల్ ప్రదేశము నందు కలదు 

51 శక్తి పీఠాలలో ఒకటిగా గలదు 

ఏ విగ్రహము లేని దేవాలయముగా గలదు 

అమ్మవారిని దుర్గా లేక కాళీ అని పిలుస్తారు లక్ష్మీ అద్దంకి, 


2

 సుదర్శన చక్రం శతీదేవి శరీరాన్ని ఖండించగా 

పడ్డాయి వివిధ ప్రదేశాల్లో 51  ముక్కలుగా

సతీ దేవి నాలుక పడిన ప్రదేశముగా 

పాండవులు దర్శించిన పవిత్ర క్షేత్రముగా 

తొమ్మిది జ్వాలలు వెలుగు ఆలయ ముగా ప్రఖ్యాతి లక్ష్మీ అద్దంకి, 


3

గుడిలో విగ్రహము లేని ఆలయము 

రాళ్ల పగుళ్ళ నుండి జ్వాల రూపంలో దేవీ దర్శనము

రోజు ఐదుసార్లు హారతుల వైభోగము

మహారాజు రంజిత్ సింగ్ నిర్మించిన ఆలయము 

సౌందర్యలహరి నుండి శ్లోకాలు హారతిలో పఠిస్తారు లక్ష్మీ అద్దంకి


ree

లక్ష్మీనారాయణ మందిరం - కురు క్షేత్రము


Sri Lakshminarayana Mandiram - New Telugu Poem Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 10/08/2025

శ్రీ లక్ష్మీనారాయణ మందిరం - తెలుగు కవిత

రచన: అద్దంకి లక్ష్మి 

పంచ పదులు

1

లక్ష్మీనారాయణ మందిరం కురు క్షేత్రములో ఉన్నది 

18 వ శతాబ్దమున నిర్మించ బడినది 

చోళ రాజవంశ పాలనకు చెందినది 

వాస్తు శాస్త్రానికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది

శ్రీహరి మరియు లక్ష్మి దేవికి అంకితం చేశారు లక్ష్మీ అద్దంకి


2

పాండవులచే  ప్రతిష్టించ బడింది

సూర్యుని మొదటి కిరణం దేవుని పాదాలు తాకుతుంది

ఆలయం ఎత్తు 124 అడుగుల వరకూ ఉంది

మంగళ గురువారాల్లో రద్దీగా ఉంటుంది,

 గోపురాన్నిఅన్ని ప్రాంతాల నుంచి చూడవచ్చు లక్ష్మీ అద్దంకి 


3

దేవునికి పసుపు నైవేద్యం పెడతారు 

భక్తులు ప్రతి పనిలో విజయం సాధిస్తారు 

ఆలయం చుట్టూ ఏడు ప్రదర్శ నలు చేస్తారు

కురుక్షేత్ర యుద్ధంకు ముందు పాండవులు కట్టించారు, 

చార్ధామ్ యాత్రకు వెళ్ళ అక్కర లేదని చెబుతారు లక్ష్మీ అద్దంకి


***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comentarios


bottom of page