top of page

శ్రీమతి డైరీ


'Srimathi Diary' - New Telugu Story Written By Mohana Krishna Tata

'శ్రీమతి డైరీ' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


సిటీ లో అంతా హడావిడి జీవితం. సుమతి ఉదయమే లేచి, తలకు స్నానము చేసి.. పూజ ముగించుకుని, వంటిట్లోకి వెళ్ళింది.


"ఏమండీ! కాఫీ ఇమ్మంటారా?"


"నీ చేతి కమ్మని కాఫీ ఇవ్వు సుమతి!" అన్నాడు సురేష్.


సురేష్ సుమతి పెళ్ళై 4 ఇయర్స్ అయ్యింది. ఇంకా.. పిల్లలు లేరు.. సురేష్ ఒక ప్రముఖ కళాశాల లో టీచర్ గా పనిచేస్తున్నాడు. మంచి మనిషి, కాస్త పద్ధతులు, పట్టింపులు ఎక్కవ. కాఫీ నుంచి భోజనం దాకా, పర్ఫెక్ట్ గా రుచులు ఉండాలని అనుకుంటాడు. పనిమనిషి ఇంట్లోకి రాకూడదని నమ్మకం పెట్టుకుని, పెట్టడం మానేసాడు.


ఇంక సుమతి విషయానికి వస్తే.. చాలా ఓర్పు ఉన్న ఇల్లాలు. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది. పెళ్ళి చూపులలో సురేష్ తెగ నచ్చేసాడు తనకి.. ఇష్టపడి మరీ పెళ్ళి చేసుకుంది. అవసరమైతే, ఇంట్లో ఎదిరించైనా.. పెళ్ళికి రెడీ అయ్యింది సుమతి అప్పట్లో..


"ఇదిగోండి! మీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ"


"ఏమండీ! మనం ఈ సండే బయట హోటల్ లో తిందామండీ!"


"హోటల్ ఫుడ్ మంచిది కాదు డియర్! ఇంట్లో వంట ఆరోగ్యానికి మంచిది సుమతి"


వారానికి ఏడు రోజులు, ఇంట్లో చాకిరీ చెయ్యాలి.. శ్రీవారు అసలే భోజన ప్రియులు.. అన్ని పద్దతిగా వండి వార్చాలి.. అయినా సరే అదే నాకు తృప్తి!


కాఫీ.. మంచి సువాసన తో ఉండాలి ఉదయం.. అదీ ఫిల్టర్ కాఫీ. టిఫిన్.. రోజూ.. ఉప్మా అంటే.. ఆయనకు నచ్చదు.. వారానికి రెండు సార్లు ఇడ్లీ పెట్టాలి, రెండు సార్లు దోసెలు.. వీకెండ్ అయితే, పూరి తప్పనిసరి. ఇవన్నీ చేసి, ఇంట్లో పనులు చేయడానికి రోజంతా సరిపోతుంది.. శ్రీవారు స్కూల్ మాస్టర్ కాబట్టి, మధ్యానమే వచ్చేస్తారు.. రాగానే.. స్నాక్స్ కు పకోడీ, బజ్జి.. వేడిగా వెయ్యాలి..


మా అమ్మ వాళ్ళింటికి ఎన్ని సార్లు రమ్మన్నా, వెళ్లడానికి కుదరట్లేదు.. ఇంట్లో పని తోనే సరిపోతుంది.. మరి


రాత్రికి మా వారికీ, కాలు పట్టి సేవ చేసుకోవాలి..


మా వారంటే నాకు చాలా ఇష్టం.. ప్రేమించి పెళ్ళి చేసుకున్న.. ఆయనంటే ప్రాణమని చెప్పాలి.. అందుకే ఆయనకు కావాల్సినవి చేయకపోతే, అయన ఇబ్బంది పడతారని.. ఎక్కడకు వెళ్ళలేదు..


ఇలా ఉంటుండగా ఒక రోజు సురేష్ ఆఫీస్ కు ఫోన్ వచ్చింది.

“ఏమండి.. మా నాన్న కు కొంచం వొంట్లో బాగోలేదంటే, ఊరు బయల్దేరానండి.. ఒక 2 డేస్ లో వచ్చేస్తా.. కాంటీన్ లోనే తినేయండి.. రాత్రికి పార్సెల్ తెచ్చుకోండి.. "


"అలాగే సుమతి! జాగ్రత్త!"


రెండు రోజులు చాలా ఇబ్బంది పడ్డాడు సురేష్. సురేష్ కు గ్యాస్ వెలిగించడం కూడా రాదు.. అంతా బయట ఫుడ్ మీద ఆధార పడాలి.. పుట్టిన ఊరు ఎప్పుడూ కదలలేదు. చదువు.. ఉద్యోగమూ అంతా.. ఇక్కడే.. అందుకే.. వంట నేర్చుకోలేదు..


రాత్రి ఫోన్ మోగింది.. సురేష్ కాల్ లిఫ్ట్ చేసాడు..

"సుమతీ! మావయ్యగారికి ఎలా ఉంది?"


"ఇప్పుడు బానే ఉండండి. రేపు బయలుదేరుతా. బీరువా లో చీరలు కొన్ని ఉన్నాయి.. డ్రై క్లీనింగ్ కు ఇవ్వండి..


"అలాగే సుమతి!"


"సురేష్ బీరువా లో చీరల కోసం వెతుకుతున్నాడు.. అప్పుడు ఒక డైరీ కనిపించింది..

ఓపెన్ చేసి చూసాడు..


అది సుమతి రాసిన డైరీ..


మొదటి పేజీలో:


"మా అయన చాలా మంచివారు.. ఆయనంటే చాలా ఇష్టం.. నన్ను ఎప్పుడూ ఏ మాట అనరు.. ప్రేమగా చూసుకుంటారు.. నేను చాలా అదృష్టవంతురాలిని..


అది చదవగానే, సురేష్ ముఖం వెలిగిపోయింది.. చాలా సంతోషపడ్డాడు..


తర్వాత పేజీలో:


నా కోరికలు - ఇష్టాలు..


నాకు వంట చేయడమంటే ఇష్టం.. కానీ వారానికి ఒకసారైనా.. హోటల్ లో తింటే బాగుంటుందనుకుంటాను.. ఒక రోజు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది..


సంవత్సరానికి ఒక 2 టైమ్స్, బయట ట్రిప్స్ వెళ్తే బాగుంటుంది. మా వారికి ట్రావెలింగ్ ఇష్టం ఉండదు..


మా అమ్మ నాన్న ఊరు నెలకొక రోజు వెళ్లాలని ఉంటుంది.. కుదరట్లేదు.


ఒక వాషింగ్ మెషిన్ ఉంటే, కాస్త టైం మిగుల్తుంది..


మా శ్రీవారికి ఏది ఇష్టమైతే, అదే నాకు ఇష్టం.. అయన సంతోషమే నా సంతోషం..


ఈ లోపు కాలింగ్ బెల్ మోగింది..


తలుపు తీసాడు సురేష్


"సుమతీ! తొందరగా వచ్చేసావే!"


"లేదండి.. మా నాన్న ఇంటికి వెళ్ళమన్నారు.. మీ గురించే బెంగ ఆయనకు.. "


"సుమతీ! ఊరు నుంచి వచ్చావు.. వంట వొద్దు లే.. హోటల్ కు వెళదాం" అన్నాడు సురేష్.


సుమతి ఆనందానికి అవధులు లేవు.. స్నానం చేసి.. కొత్త చీర కట్టుకుని.. రెడీ అయింది..


"నేను రెడీ! వెల్దామా అండి?"


భార్య కళ్ళలో ఆనందం చూసిన సురేష్, తాను ఇన్నాళ్లు ఎంత తప్పు చేసాడో.. అర్ధమైంది..


ఇద్దరూ.. అలాగా షాపింగ్ వెళ్లారు. శ్రీమతి ఇష్టపడ్డ వాషింగ్ మెషిన్ తీసుకున్నాడు సురేష్.


బోనస్ డబ్బులతో అని సర్ది చెప్పాడు సుమతి కి. మంచి హోటల్ లో భోజనము చేసి రాత్రి ఇంటికి చేరుకున్నారు..


"చాలా థాంక్స్ అండి" అంది సుమతి. సుమతి మాటల్లో ఎంతో రిలీఫ్ కనిపించింది.


ప్రతి వారం సండే, హోటల్ కు తీసుకుని వెళ్ళాడు.. సురేష్ ఏదో ఒక కారణం చెప్పి.


ఒక రోజు.. “నా సెలవులన్నీ.. ఉండిపోయాయి, ఫ్రెండ్స్ అందరూ నార్త్ ఇండియా టూర్ ప్లాన్ చేస్తున్నారు.. రమ్మంటున్నారు.. మనమూ వెల్దాము” అన్నాడు సురేష్.


సుమతి ఎగిరి గంతేసినంత ఆనందంగా ఉంది..


వారం రోజులు సెలవు పెట్టి, ట్రిప్ ను చాలా బాగా ఎంజాయ్ చేసారు..


“సుమతి, దసరా కు మీ వాళ్ళింటికి వెళ్దాం.. నీకు కొంచం రిలీఫ్ గా ఉంటుంది..”


కొంపదీసి, నా డైరీ చదివారా ఏమిటి! చదివినా అంతా మంచికే అనుకుంది సుమతి!

***

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


51 views0 comments

Kommentare


bottom of page