'Srimathi Kosam' - New Telugu Story Written By Mohana Krishna Tata
'శ్రీమతి కోసం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
గణేష్.. గంగ మ్యారేజ్ అయి.. ఆరు నెలలు అయింది. గణేష్ ది ఒక ప్రైవేటు ఉద్యోగం.
"ఏమండీ! ఈ రోజు డేట్ గుర్తుందా?"
"ఏమిటి ఈ రోజు స్పెషల్? నీ బర్త్ డే కాదు...నా బర్త్ డే కూడా కాదు.."
"మన మ్యారేజ్ డే శ్రీవారు! "
"అవును కదా! వర్క్ లో పడి మర్చిపోయాను"
"మీ మగవాళ్ళు అందరూ ఇంతే! బర్త్ డేస్...మ్యారేజ్ డేస్ గుర్తుండవు పాపం"
"మరీ అలగనకే గంగా!..వర్క్ బిజీ అంతే!"
"పెళ్ళిరోజు శుభాకాంక్షలు... శ్రీమతి!"
"ఏమండీ! ఈ రోజు ఆఫీస్ కు సెలవు పెట్టండి..ఎంచక్కా...షికారు చేద్దాం..."
"ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది...కుదరదు..."
"పోనీ సాయంత్రం తొందరగా రండి! రెడీ అయ్యి ఉంటాను...డిన్నర్ కు వెళ్దాము"
"ట్రై చేస్తాను!"
"మీ కోసం వెయిట్ చేస్తుంటాను..."
గణేష్ ఆఫీస్ కు వెళ్ళిపోయాడు.. ఇంట్లో పని చేసుకుని...నీట్ గా రెడీ అయి భర్త కోసం వెయిట్ చేస్తుంది గంగ. ఈలోపు ఇంటినుంచి ఫోన్ వచ్చింది...
"గంగా! పెళ్ళిరోజు శుభాకాంక్షలు...అల్లుడుగారికి ఫోన్ ఇవ్వు...విష్ చెయ్యాలి..."
"ఇంకా ఆఫీసు నుంచి రాలేదు అమ్మా!"
"అదేంటి...ఆఫీస్ కు సెలవు పెట్టలేదు?"
"లేదమ్మా! ఆఫీస్ లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట!"
"మీ నాన్న తో ముందే చెప్పాను!...ఏ టీచర్ కో ఇచ్చి పెళ్ళి చెయ్యమని...సెలవులు ఎక్కువ....వర్క్ తక్కువ...లీవ్స్ ఎక్కువని..నా మాట వినకుండా ప్రైవేటు జాబ్ అల్లుడు వస్తే..ఇలాగే ఉంటుంది...లీవ్స్ ఉండవు...వర్క్ ఎక్కువ"
"ఏమండీ! అమ్మాయి ఫోన్ లో చెప్పింది అర్ధమైందా? అల్లుడు చాలా బిజీ అంటా! మూడు నెలలు నుంచి ఎక్కువ ఆఫీస్ లోనే ఉంటున్నాడు...పెళ్ళి రోజు కూడా సెలవు లేదని.. ఇంటికి ఇంకా రాలేదంట...అందుకే మీకు చెప్పాను...మీలాగా టీచర్ ఉద్యోగం చేసే అబ్బాయి ని అమ్మాయికి చూడమని...ఉన్న ఒక్క అమ్మాయి అచ్చటా ముచ్చటా ఇలా ఉంది మరి.."
"అప్పట్లో...మీకు స్కూలు మధ్యాహ్నం అయిపోగానే..ఇంటికి వచ్చేసేవారు...నాతో ఎక్కువ సమయం గడిపేవారు..చాలా బాగా షికార్లు చేసేవాళ్ళము కదా! ఎంచక్కా..అన్ని ప్రదేశాలు తిరిగేము...కావాల్సిన అన్నిసెలవులు...ఆ రోజులే వేరు కదండీ!...ఇప్పుడు చూడండి..ప్రైవేటు ఉద్యోగంలో అల్లుడితో అమ్మాయి ఎంత కష్టపడుతుందో!..."
"కాలం మారింది కాంతం! ఎక్కువ డబ్బులు కోసం కష్టపడాలి...అల్లుడు చాలా తెలివైనవాడు...నువ్వు ఏమీ కంగారు పడకు...అమ్మాయి ని బాగా చూసుకుంటాడు...నాకు ఆ నమ్మకం ఉంది"
గంగ భర్త కోసం రాత్రి వరకు వెయిట్ చేస్తూనే వుంది. అలా, వెయిట్ చేస్తూ.. నిద్రలోకి జారుకుంది. కొంత సేపటికి కాలింగ్ బెల్ మోగింది. మెల్లగా లేచి తలుపు తీసింది. గణేష్ చాలా అలసటగా ఇంటికి వచ్చాడు.
"సారీ గంగా! లేట్ అయ్యింది...ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉంది. భోజనం చేసావా?"
"లేదండి! మీ కోసమే చూస్తున్నాను."
"పదా! భోజనం చేద్దాం"
ఇద్దరూ భోజనం చేసిన తర్వాత...
"గంగా! నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను.. ఫస్ట్ కళ్ళు మూసుకో..చెబుతాను...!"
"మూసుకున్నాను...చెప్పండి!"
"ఇప్పుడు కళ్ళు తెరువు గంగా!"
గంగ కళ్ళు తెరిచి చూడగానే...ఎదురుగా...దగ దగా మెరుస్తున్న నెక్లెస్..
"గంగ ముఖం లో ఆ నెక్లెస్ మెరుపు కనిపిస్తుంది. అంతులేని ఆనందం... ఆమె పెదవిపై చిరునవ్వు లో తెలుస్తుంది.. ఉదయం నుంచి భర్త పై ఉన్న కోపం, చిరాకు...అంతా మాయమైపోయింది.
"ఏమండీ! ఇది నేను మిమల్నిపెళ్ళైన కొత్తలో అడిగిన నెక్లెస్ కదా!"
"అవును! నీకోసం.. ఎలాగైనా కొనాలని తీసుకున్నాను"
"మరి ఇంత డబ్బులు ఎలా వచ్చాయి? బోనస్ వచ్చిందా?"
"లేదు గంగా! గత మూడు నెలల నుంచి.. ఓవర్ టైం చేస్తున్నాను...ఆ డబ్బులతో కొన్నాను....నీ కోసం"
"నా కోసం ఇంత చేసారా! ఇంత కష్టపడ్డారా? నేనంటే ఎంత ప్రేమండీ మీకు! మిమల్ని చాలా అపార్ధం చేసుకున్నాను…” సారీ చెప్పి… భర్త ను గట్టిగా వాటేసుకుంది గంగ.
********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments