top of page

శృతి గీత


'Sruthi Geetha' New Telugu Poem





అది ఏదో తెలియని శక్తిమయం

అదే సత్యం , జ్ఞానం, అనంతం

అదే శివం, సుందరం...

బిందువై విస్తరిస్తుంది...

అంతటా నిండి స్థాణువై

రమిస్తుంది...

త్రికోణమై ప్రసవిస్తుంది

విశ్వమై వ్యాపిస్తుంది...

అయినా అంతా శూన్యమే..


శూన్యంలో ఏదో సంకల్పం

ఆ సంకల్పమే విస్పోటనం

అమితమైన నీడలేని వెలుగులతో

నిండిన అనంతం

అచట అంతా జ్ఞాన దీప్తి వికాసం


విస్పోటన పరిణామం

అంతటా నినదిస్తున్న ఒక శబ్దం

అదే ప్రణవనాదం....

సకల విశ్వానికి ఆదిమ రూపం

అదే పరమాత్మ స్వరూపం

పరదేవీ అవతారం...


అంధకార బంధురమై

ఆవరించినది అజ్ఞానం

అదే మహత్తునై, అహంకారమై

పంచభూతాలుగా, పంచతన్మాత్రలుగా

వివిధ రూపాలలో, వివిధ గతులలో

దిగి వచ్చిన చైతన్యం...

సకల సృష్టి సంరంభం

కాల రూప సంపర్కం

జీవకోటి కారంభం ...


మానవత్వ విభవేందిర

పరిమళించి, పల్లవించి

పరవశించి ఆడి పాడి

తన్మయతతో నినదించిన

ఆ శబ్దం ఓం కారం..

అదే అదే పరమ శివుని ప్రణవనాదం...


రూపంలేని నాదంతో

ఆనందమే ఆర్ణవమై

నర్తించే ఆ విభవం

పరమ శివుని తాండవం..

సకల సృజన లయభావన


అతని తోడ నటన మాడు

అమ్మ చలిత పదలాస్యం...

సృష్టి స్థితి లయాలకు

ఆలంబనం

మానవుడి ఊహకి

వ్యక్త రూపం


ఆ నాట్యం ఆనందం

ఆ నాదం అమరత్వం

ఆ మూర్తియె రక్ష మనకు

ఆ భిక్షయె ఆర్తి మనకు...

అస్తిత్వపు మధురిమలో

ఆనందం అనుభూతులు

వాహినులై... జారి జారి

సౌందర్యపు లహరులుగా

శివానంద సంద్రంలో

లయమయ్యే తరుణంలో

అస్తిత్వం కనిపించదు...


అంతట నేనే నిండిన

అద్భుతమౌ యవనికపై

నాలో అంతా నర్తింపగ

అదియే... ఇదియై

ఇదియే ... అదియై

అద్వైతం... ప్రవహింపగ

ఆదిశక్తిలో నేను...

నాలో ఆ అది శక్తి...

అదియే అమరత్వం... మోక్షత్వం

***

Dr. M. రామ మోహన రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత ప్రొఫైల్: https://www.manatelugukathalu.com/profile/ramamohan/profile


68 views0 comments

Comments


bottom of page