top of page
Original.png

స్థాయిలు వేరు... బాధలు ఒక్కటే!

1 hour ago
2 min read

స్థాయిలు వేరు బాధలు ఒక్కటే – మధ్యతరగతి కుటుంబం, వలస కూలీ, అధిక జీతం పొందే ఉద్యోగి జీవితాల్లోని కష్టాలు, కుటుంబ ప్రేమ, సంతోషాన్ని ప్రతిబింబించే చిత్రం.

Sthayilu Veru Badhalu Okkate - Telugu Inspirational Articles | Ganti Asa Padmini

స్థాయిలు వేరు... బాధలు ఒక్కటే! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసాలు | గంటి ఆశ పద్మిని

Published in manatelugukathalu.com on 14/11/2026


మనిషి ఆర్థిక స్థాయి మారినా జీవితంలోని బాధలు పూర్తిగా తొలగిపోవు. మధ్యతరగతి కుటుంబాలు, వలస కూలీలు, అధిక జీతాలు పొందే ఉద్యోగుల జీవితాల ద్వారా నిజమైన సంతోషం ఎక్కడుందో తెలియజేసే వ్యాసం.


సమాజంలో ప్రతి ఒక్కరూ తనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని చూసి ఈర్ష్య, అసూయ పడుతూ, తాను ఉన్న స్థాయిని నిందించుకుంటారు. అలాగే తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని చులకనగా చూస్తుంటారు. కానీ ప్రతి స్థాయిలోనూ కొన్ని సుఖాలు, మరికొన్ని బాధలు ఉంటాయనే విషయాన్ని గుర్తించరు.


మధ్యతరగతి వారినే తీసుకుందాం. వీరిని ఆర్థిక పరిస్థితులను బట్టి ఎగువ, దిగువ మధ్యతరగతి అని విభజిస్తారు. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తమకే ఉన్నాయని భావిస్తుంటారు వీరు. మనసులో కలిగే ప్రతి కోరికను తీర్చుకోలేక, సమాజంలో గౌరవం పొందడం కోసం జీవితాంతం శ్రమిస్తుంటారు. తాము మధ్యతరగతిలో ఉన్నందుకు బాధపడుతూ, తమ దగ్గరున్న ప్రేమపూరితమైన కుటుంబం అనే అపురూపమైన సంపదను గుర్తించలేకపోతుంటారు. కొందరు ఉన్నదానితో తృప్తిపడితే, మరికొందరు ఆ జీవితాన్ని తిట్టుకుంటూ గడుపుతారు. ఇంకొందరు ఆ స్థాయి నుంచి ఎదగాలనే ఆరాటంలో ఉన్నదాన్ని కూడా కోల్పోతుంటారు.


ఇక వలసకూలీల జీవితాలను చూడండి. సొంత ఊరిలో తినడానికి సరిపడా ఆదాయం, చిన్నపాటి పొలం ఉన్నా, ఎదుగుదల ఉండదనే కారణంతో కన్నవాళ్లను, కట్టుకున్నవారిని, పిల్లలను వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. భాష రాదు, ఆప్తులు దగ్గరలో ఉండరు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కష్టపడుతుంటారు. బాధను పంచుకునేందుకు కుటుంబం దగ్గర ఉండదు. సొంత ఊరిలో కుటుంబం ఎలా ఉందోననే ఆలోచన అడుగడుగునా దహిస్తుంటుంది.


ఇక పెద్ద పెద్ద కంపెనీల్లో నెలకు లక్షల రూపాయల జీతాలు అందుకునేవారి జీవితాలు ఎంతో విలాసవంతంగా ఉంటాయని అనుకుంటాం. కానీ వారి బాధలు వేరు.


నెలకు ఎనిమిది లక్షల జీతం అందుకునే వ్యక్తి సైతం కంపెనీ అవసరాల కోసం ఊరూరూ తిరుగుతూ, కుటుంబానికి దూరంగా గడపాల్సి వస్తుంది. కన్నవాళ్లకు ప్రేమను పంచాలని, కుటుంబంతో ఆనందంగా గడపాలని ఉన్నా సమయం దొరకదు. కుటుంబానికి విలాసవంతమైన జీవితాన్ని అందిస్తూ, తాను మాత్రం ప్రేమానురాగాలకు దూరమై ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు.


అందుకే ఇతరుల స్థాయిని చూసి వారి జీవితాలు సుఖంగా ఉన్నాయని అనుకోకూడదు. 'పిండి కొద్దీ రొట్టె' అన్నట్లు, ఎంత సంపాదన ఉంటే ఆ స్థాయికి తగ్గ సమస్యలూ ఉంటాయి. మనిషి తన స్థితిని చూసి బాధపడటం కంటే, తన జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించి ఆనందించడం నేర్చుకోవాలి.


- గంటి ఆశ పద్మిని



*** 









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



గంటి ఆశ పద్మిని

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.

నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page