బద్ధకం వద్దు
Baddhakam Vaddu - Telugu Moral Story | Ganti Asa Padmini
బద్ధకం వద్దు - తెలుగు నీతి కథ | గంటి ఆశ పద్మిని
Published in manatelugukathalu.com on 22/09/2026
బద్ధకం మనిషి జీవితంలో ఉన్న అవకాశాలను, సంపదను, విజయాన్ని క్రమంగా దూరం చేస్తుంది. ‘బద్ధకం వద్దు’ కథలో జమీందారు తన నలుగురు కుమారులకు ఒక చిల్లు పడిన గ్లాసు ద్వారా అద్భుతమైన జీవిత పాఠాన్ని చెబుతాడు. బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాన్ని తెలియజేసే ఈ కథ పిల్లలు, పెద్దలు అందరూ చదవదగిన నీతి కథ.
కష్టపడి పనిచేయడం, బాధ్యతగా జీవించడం ఈ కథ అందించే ముఖ్యమైన సందేశం.
నారాయణపురంలో రాజా బహదూర్ జమీందారుకు నలుగురు కుమారులు. నలుగురు కుమారులు తన తరువాత తమ జమీందార్‌గిరిని ముందుకు నడుపుతారని ఎంతో మురిసిపోతుండేవారు జమీందారు.
జమీందారుకు వయసు పైబడుతుండటంతో నలుగురు కుమారులను పిలిచి పొలాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అన్నీ అప్పజెప్పారు. నలుగురు కుమారులు బాధ్యత చేపట్టారు. కొంతకాలం తరువాత జమీందారు వ్యాపార వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి అని తలచి కుమారులను పిలిచి అడిగారు. వ్యాపారం బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు నలుగురు.
ఒక రోజు అనుకోకుండా గుమస్తాను ఇంటి వద్ద చూసి, ‘మీరు ఇంటికి రావడం ఏమిటి? మిమ్మల్ని నేను ఎప్పుడు కార్యాలయంలోనే కలుస్తాను కదా! ఈ కొత్త అలవాటు ఏమిటి?’ అని ప్రశ్నించారు జమీందారు.
పిల్లలకు బాధ్యత అప్పగించిన దగ్గరి నుంచి గుమస్తాగారు ఇంటికి వస్తున్నారని చెప్పింది జమీందారుకి తన భార్య. ఆ మాటలు విన్న జమీందారు గుమస్తాను తన గదికి పిలిపించి వ్యాపారం ఎలా జరుగుతోందని ప్రశ్నించారు. గుమస్తా బాగానే ఉందని చెప్పారు. కానీ అతని మాట తడబాటు గమనించిన జమీందారుకి అనుమానం వచ్చింది.
ఏది పద్దుల పుస్తకం ఇటు ఇవ్వండని అడిగి చూశారు జమీందారు. అందులో అన్ని నష్టాలే ఉన్నాయి. ఆస్తిలో పావు వంతు నష్టపోయారు. “ఏమిటిది గుమస్తాగారు?” అని ప్రశ్నించారు జమీందారు. తమ నలుగురు కుమారులు ఉత్తి బద్ధకస్తులు, జలసారాయుళ్ళు.
వాళ్ళు మీరు బాధ్యతలు అప్పగించిన దగ్గరినుంచి ఒక్క రోజుకూడా వ్యాపారం చూడడానికి కార్యాలయానికి రాలేదని చెప్పారు గుమస్తా. ఏమైనా ముఖ్యమైన పని, అవసరం ఉంటే ఇగో ఇలా నేను ఇంటికి వచ్చి సంతకాలు తీసుకుంటుంటానని బదులిచ్చారు గుమస్తా.
గుమస్తా మాటలు విన్న జమీందారు తన కుమారుల్లో మార్పు ఎలా తేవాలి అనే ఆలోచనలో పడ్డారు.
రెండు రోజుల ఆలోచన తరువాత తమ కుమారుల్ని పిలిపించి, నలుగురికి ఒక్కో గ్లాసు పట్టుకోమని చేతికి అందించి తను కూడా ఒక గ్లాసును చేతిలో పట్టుకున్నారు. జమీందారుగారు నలుగురి గ్లాసుల్లో నిండా నీళ్లు నింపి తన గ్లాసులో కూడా నీళ్లు నింపుకున్నారు. కొద్దిసేపటికే నలుగురు కుమారుల చేతుల్లో ఉన్న గ్లాసులోంచి నీళ్లు కారడం ఆరంభమైంది. నీళ్లు కారడం నలుగురు కుమారులు గమనించి “అయ్యో నీళ్లు పోతున్నాయి” అని అన్నారు. ఆ మాటలు విన్న జమీందారు “అవును నీళ్లు పోతాయి, మీకు ఇచ్చిన గ్లాసులు చిల్లు పడిన గ్లాసులు” అని చెప్పారు. “మరి మీది?” అని అడిగారు తండ్రిని కుమారులు. “నా వద్ద ఉన్న గ్లాసుకి చిల్లు లేదు” అని చెప్పారు జమీందారు. “ఎందుకలా?” అని ప్రశ్నించాడు నాలుగో కుమారుడు.
మా నాన్నగారు “నా వద్ద ఉన్న నిండు గ్లాసు మాదిరిగానే నాకు ఇంతటి ఆస్తిని అందించారు.” నేను నా తండ్రి అందించిన నిండు గ్లాసును ఎంతో కష్టపడి నిండుగానే ఉంచి మీకు అందించాను. కానీ మీరు నేను అందించిన నిండు గ్లాసులకు బద్ధకం అనే చిల్లుని పెట్టి ఆస్తిని అంతా పోగొడుతున్నారు. ఒక చిన్న చిల్లు గ్లాసులో ఉన్న నీళ్ళను చుక్క కూడా గ్లాసులో ఎలా ఉండనివ్వదో, అలాగే బద్ధకం అనే చిల్లు జీవితంలో చిల్లిగవ్వ కూడా మిగల్చకుండా మొత్తం ఖాళీ చేసేస్తుంది అని చెప్పారు జమీందారు.
తండ్రి మాటలకు నలుగురు సిగ్గుపడి “మమ్ముల్ని క్షమించండి, ఇవాళ్టినుంచి మేము బద్ధకాన్ని వదిలేసి కష్టపడతాం” అని తండ్రికి మాట ఇచ్చారు. కుమారుల్లో వచ్చిన మార్పుకి జమీందారు చాలా సంతోషించి, శేష జీవితం ఎంతో హాయిగా గడపసాగారు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.
నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.








Comments