top of page
Original.png

సుగుణా శతకము

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #SugunaSathakamu, #సుగుణాశతకము


Suguna Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 12/01/2026

సుగుణా శతకము -  తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


(1)శ్రీలు గన పొంగి పోకుము

చేలను జూసి మురిసేవు చేతుండ ధనం

కూలైన అడుగక నివుము

పేలుతు సతి నింద సేయ ప్రేమెటు సుగుణా


(2)కొలువా చేయుట రాదను

తెలువని పని యంటు నింక తెలుపెడు వాడున్

పిలువా వచ్చును తిండికి

అలుపన్నదెరుగక వేగి అటులన్ సుగుణా


(3)చదువా చదివితె వచ్చును

చదువగ నిక దీపమోలె ఛవులను దెచ్చున్

చదువే రాగను మానిసి

చదువందు అభిజను జేరు చరితన్ సుగుణా


(4)చెప్పిన మాటలు వినకను

చెప్పుడు మాటందు నికను చెడుపగు సుమ్మీ

ఎప్పుడు నీ గుణ మందున

తప్పుగ చూడకు నికెందు తప్పగు సుగుణా


(5)తల్లియె జావగ మనిషికి

ఉల్లము జల్లన నపుడును ఉలుకెట్లన్నన్

తల్లియె మనకగు దైవము

కల్లని తలచంగ నుండు కదరా సుగుణా


(6)తానొక ఎంబెన్న అనగ

తానును వేరొక అతనిని తన మిత్రన్నన్

తానము ఎవరును ఈయరు

తానమె గనకేడ నుండ తగదో సుగుణా


(7)ఓటును గోరుచు ఓటను

వేటలొ నుండుచు నగదను విలు వెంతన్నన్

నోటులు కనగను జూపుచు

ఓటుకు పదివేలు లివ్వ ఒదవా సుగుణా


(8)పని మంతుడ నాకేమని

పదుగురితితొ నిగ్రహించి పలుకుట బాగా

పనిమంత మైన ఉక్షము

పని తీరును జూడ పెట్టు పాదమె సుగుణా


(9)అప్పులు జేయకు నెప్పుడు

తిప్పల బడబోకు అప్పు తీర్చగ నెన్నడు

గొప్పలు జెప్పుట కన్నను

గొప్పలు చెప్పక నిలువగ గొప్పే సుగుణా


(10)బాలుర బంపకు పనులకు

బాలిక పెండ్లియు అనుచును బంపకు నింకన్

మేలగు చదువులు అనగను

మేలగు నీకును ఇకనును మేధిని సుగుణా


(11)ముడుపులు పొందకు పనులకు

చెడుపన నీకింక బతుకు చేదనుపించున్

కడుపుకు ఒంటదు నికనది

పడుపను వృత్తితొ సమమగు పనియది సుగుణా


(12)కరువగు కాలము రాగను

వెరువకు నీవిక తొలగని వెతలని దిగులుతొ

కరువిక అందరి కొచ్చును

మరువని బాధలు మిగులగ మదికిన్ సుగుణా


(13)తొమ్మిది నెలలలు కడుపున

ఇమ్ముగ మోయును తనయుల ఇమ్మహి నంతన్

అమ్మనె కాదను తనయుల

సొమ్మెటు బోవును తగదిక సోపతి సుగుణా



(14)ఇంటికి అందము ఇంతియె

కంటికి అందము అనగను కాటుక కాగన్

ఒంటికి అందము ఉడుపులు

జంటకు అందము అగునిక చంటిదె సుగుణా


(15)అంగడి బొమ్మగ గనుచును

అంగన వైపుగ నగుచును వెంగలి చేష్టల

సంగతి గనగను వానిని

అంగన ముందర ఒరయుట అనువగు సుగుణా


(16)తరుగని ధనమున్ గలుగన్

పొరుగును దలువక పిలువక పొగరుతొ నుండన్

పెరుగున ధనమిక పెద్దగ

గరువము తగదిక మనిషికి గడుసుగ సుగుణా


(17)సరసము లాడగ నెంచుము

సరియగు ఈడును తగునిక సరసము లాడకు

సరియని పిల్లలు పెద్దలు

సరసము తగదన వదులిక సలుపుట సుగుణా


(18)పెద్దల ముందర నవ్వకు

ముద్దగు పాపల గనుచును ముద్దన నవ్వుము

ముద్దుగ కథలను జెప్పుము

వద్దను వరకును విసుగక వారికి సుగుణా


(19)పూలలొ దారము గృచ్చుతు

మాలలు అల్లగ చెలువము మానస మందున

పూలలొ పరిమళ మొందెడు

పూలను వాడుదు రికగన పూజకు సుగుణా


(20)తల్లియు తండ్రియు యుండగ

అల్లరి జేయుచు తనయులు ఆస్థిని అడుగగ

తల్లియు తండ్రియు జెప్పిన

ఎల్లరు జెప్పిన వినమన నీతా సుగుణా




(21)మగువల మానము దోచగ

ఎగబాకె మనిషను పశువు ఎరుగను వారికి

ద గునిక ప్రభుతల పగ్గము

అగునిక నీచులు అగుపడ ఆగన్ సుగుణా


(22)మనసును ప్రమిదగ మార్చుచు

మనసిడి భక్తిని చమరుగ మరియును ఆత్మను

కనగను వత్తిగ దలువగ

అనబడు వెలుగుల వరుసలు అవునన సుగుణా


(23)కోపము గనగను మౌనము

కోపము తగదిక ధనముయు కోరక వచ్చిన

జూపుము నీతియె నిధనుడ

జూపగ అధిపుడు వినయము జోకగు సుగుణా


(24)పెట్టకు పాసిన కూడును

ముట్టని పశువున కయినను ముట్టని దేనికి

పెట్టకు నిన్నటి అన్నము

బెట్టుకు పోయెడి మనిషికి బెట్టకు సుగుణా


(25)వేలము వేయగ కొనకుము

కాలిన బ్రతుకుల సదనము కాంచుచు నరుడా

కాలము కలిసియు వచ్చును

వేలము తగదని అనుచును వేడన్ సుగుణా


(26)తద్దిన మనగను దివసము

శ్రద్ధగ జేతురు మనమున శ్రాద్దము తగినటు

పెద్దలు దివమున అరుగగ

శ్రాద్ధము పెట్టగ శుభమగు శ్రద్ధగ సుగుణా


(27) జారల జాడలు వెదుకకు

నేరము సేయకు నెపుడును నెరుగుచు నరుడా

మారను జూడుము మనిషిగ

మీరకు అధికులు నుడివిన మీదిక సుగుణా


(28)అందము అంగన కధికము

ముందరి చూపుయు కనగను ముదితకె కాగను

డెందము నందున సుదతులు

బంధము బెంచగ పలువురి బంధువె సుగుణా


(29)అమ్మగ అగుటకు అతివకు

కమ్మని భావన మదినిక కలిగియు యుండన్

ఇమ్మహి నందున ఇంతుల

అమ్మగ పిలువగ తలుతురు అనువుగ సుగుణా


(30)లేకను లేనటు లుండుము

పోకడ అధికము అనగను పోకుము నరుడా

ఆకలి కలుగను కుదులకు

నూకల అన్నము అయినను నోపుము సుగుణా


(31)పదుగురు సుతులును ఉండగ

ఎదుగను మాతయు పితరుడు ఎదురుగ నుండన్

పదుగురు తల్లిని తండ్రిని

కుదురుగ సాకను మదినిక కుదురదు సుగుణా


(32)పదవులు లేకను ఎరియుచు

పదవులు రాగను సరినిక పదవిన నుండన్

పదవిని బాధ్యత అనకను

పదవిక తమకనె తలతురు పదవని సుగుణా


(33)తల్లిని తండ్రిని వలగొని

తల్లియె గురువని మదినిక తలచుచు మ్రొక్కన్

తల్లియు దీవన లొసగును

తల్లిని మించగ అజుడును తగడను సుగుణా


(34)బంధువు లెందరొ రాగను

విందులు జేతురు ముదమన విందన గుండన్

విందులొ ఎందరొ తినగను

కొందరు ముదుసలు లగుపడ కోరరు సుగుణా



(35)పంచుడు ఫలములు కొంచెము

పంచగ వృద్దుల మనమున పండుగ కాగన్

ఇంచుక తద్దిన దినమున

పంచుడు ఫలములు మధురము పరులకు సుగుణా


(36)దివ్వెల దీధితి కనగను

సవ్వడి జేతురు బుడతలు సరసము తోడన్

అవ్వలు తాతలు సహితము

దివ్వెల పండుగ మురిసెడి దినమన సుగుణా


(37)మనమను మాటను మరువకు

మనసున నింకను పదుగురు మనవారనదగు

మనమున్న దేశము మనదె

మనదియె లోకము తలువగ మనదగు సుగుణా


(38)తులువల దెసకును జూడకు

తులువలు చెదలుతొ సమమగు తుంటరు లెంతన్

కలువుము యోగ్యుని ఎపుడును

కలువకు నింకను కలుషిత కారుని సుగుణా


(39)కనగను కలియుగ మందున

కని పెంచిన ఇరువురికను కనపడు పరమము

అనగను ఊఢయు దేవతె

కదలెడు దేవత సదనమె కనుదురు సుగుణా


(40)జాతిన పూవులె సొగసు

ఖ్యాతిన పరమాత్మ యనగ ఖ్యాతికి నెక్కన్

నాతిలొ రంభదె అందము

నీతియె కలియుగ మహిమన నీలిగె సుగుణా


(41)బూతుల మాటలు అనకుము

కూతలు చెడుపుగ అగునటు కూయకు నీవున్

ఏతులు గొట్టకు ఎచటను

చేతను కుదురని బనులను చేయకు సుగుణా



(42)ఒకరిని చెడుపుగ యెరుగకు

ఒకరిని యెంచకు అధికము ఒనరదు కీర్తిక

ఒకనిని తిట్టుచు తిరుగకు

ఒకరిని పొగడగ ధనమును ఒసగరు సుగుణా


(43)మనుషుల జేసిన దైవము

మనషులు వెదుకను పొడగన మనసిడు చుండన్

మనుషులు జేసిన దేవుని

మనుషులు నమ్మరు ఇకనన మనమున సుగుణా


(44)మగడిది గడనను జూసియె

మగువిక మర్యాద లిడిన మగనికి లేమన

మగువకు మనసుయు మారును

మగనివి మాటల వినదిక మసిడియు సుగుణా


(45)చదువను పంపకు పిల్లల

చదువును జెప్పెడి ఖలుడగు చదువరి కడకున్

చదువులు రావని దలువకు

చదువగ ఉత్తమ గురువుతొ చదువులె సుగుణా


(46)కొందరు నీచపు గురువులు

ఉందురు పసికందు జెరుచ ఉందురు బడులన్

ఎందరు చెప్పిన వినరిక

ముందరి చూపుతొ అణచుటె ముఖ్యము సుగుణా


(47)కొందరు సుఖముతొ నుందురు

కొందరు శ్రమపడ నిలువగ కొందరు ఉందురు

ఎందరు జెప్పిన వినకను

కొందరు ఇడుములె మనకను కొందురు సుగుణా


(48)కామము కళ్ళను గప్పగ

కామము పురిగొల్పు కాంత కాయువు దీయన్

కామము వీడగ మనిషగు

కామము వీడక ఉరికిగ కారణ సుగుణా



(49)గుణవతి రూపసి నడుమన

గుణవతె తగునిక మనువుకు గుణగణ మందున్

గుణవతి రూపసి లెరుగను

గుణవతె మనిషికి గురుతిడు గుణమే సుగుణా


(50)నెత్తురు కందును సహితము

ఎత్తుక పోవుచు చెరచను ఎత్తులు వేతురు

ముత్తెపు వెలుగుల పాపను

కుత్తుక తెగటార్చు టతని కుత్తము సుగుణా



(51)చేరకు రో పలుగాకుల

కోరకు రో అండ యెపుడు కూళుని ఇంటన్

మారకు రో గుణ మందున

మీరకు రో జనకు లాజ్ఞ మీదిక సుగుణా


(52)అడుగకు మీ ధన మెక్కడ

జడువకు మీ శత్రు జూచి జంకుచు నీవున్

కొలువకు మీ పరుల నికను

కుడువకు మీ ఒరుల కడన కూడిక సుగుణా


(53)భయమను దుండదు ఖలునకు

భయమను నదినిక ఎరుగడు బాపపు పనులన్

భయమగు గుణికిక చెడుపన

భయమిక పొరపాటు జరుగ భయపడు సుగుణా


(54)తెలుపుయు నలుపుయు జగమున

తెలువగ చీకటి వెలుగగు తెలుపిక మంచన

నలుపన చెడుపుకు సూచన

తెలుపిక శాంతము అనగను తెలువగ సుగుణా


(55)మరణము ఎపుడని తెలియక

ధరణిలొ మనుజులు సుకరము ధరుమము జేయన్

మరణము లేదిక యశముకు

ధరుమము బనులిక శుభమగు ధరణిలొ సుగుణా

(56)బలియని పశువుల మేకల

బలముతొ తెలియని పశువుల బలియని ఈయన్

బలిగొను దేవత కనియెన

బలియను మూర్ఖపు జనులది బలుపగు సుగుణా


(57)పుడమను తల్లియె రుచులను

కడుపున నింపెను మనుషుల కడుపున కందన్

పుడమిని జీవుల గాంచును

ఇడుములు నెపుడును పడకను ఇంకను సుగుణా


(58)పెద్దల తద్దిన మనగను

పెద్దల శ్రాద్ధము మనసిడి పెట్టుచు నుండన్

పెద్దల దీవన లందును

పెద్దల మనసుకు తనివగు పెద్దగ సుగుణా


(59)దిక్కిక నెరుగని నిధనుడు

మెక్కెడి తిండిని అధిపుడు మెక్కగ వారికి

దిక్కెవ రింకను అశనము

మెక్కుట కొరకగు అనుగుణ మెక్కడ సుగుణా


(60)భానుని భగభగ మంటకు

మేనుకు చెమటలు కనగను మేలగు నీడన్

గానుచు చేరగ శరణన

మానువు బెంచగ మదినిక మానకు సుగుణా


(61)చీమలు గరువగ మంటన

పాములు గరువగ మనిషికి ప్రాణము బోవున్

దోమలు గ్రోలగ రకుతము

ఆమము గలుగును చెడుపగు ఆమమె సుగుణా


(62)తనివియె మనిషికి తగునిక

తనివిక గలుగను మనిషికి తనివగు బ్రతుకున్

తనివియె లేకను తగదిక

తనువున బాగుకు కనగను తనివే సుగుణా



(63)అధిపుని సరసన భటుడును

కదలక నిలిచిన అధిపుకు కలిగెడు మెరవడి

కదురును భటునకు కొంతన

కుదురుగ దారము విరులను కుదురద సుగుణా


((64)మొక్కగ ఉండగ వంచిన

చక్కని చెట్టుగ పెరుగును చక్కని రూపుతొ

చక్కని పిల్లల అటులనె

చక్కగ బెంచగ అగుదురు చక్కగ సుగుణా


(65)వృత్తుల వలననె కులములు

కొత్తగ బుట్టగ జగమున కొత్తవి గాగన్

సత్తువ గలిగియు వారును

ఉత్తము లగుచును బెరుగుచు ఉండిరి సుగుణా


(66)పంతులు కరమున బెత్తము

పంతులు పిల్లల చదువుల పంతము కొరకన

పంతులు బట్టెడు సమసము

కొంతను మనసిడి చదువగొ కింతను సుగుణా


(67)మగువలు కనపడ వెంటనె

తెగువతొ వత్తురు తులువలు తెలుపుచు ప్రేమని

తగవుల కయినను వెరువరు

తగదని జెప్పిన వినరిక తరుమను సుగుణా


(68)కులములు వలదని పోరిన

కులముల ప్రభుతయె అధికము కులసంఘ మనుచు

కులముల భవనము పేరిట

కులముల ఉపచితి నిరతము కుదరగ సుగుణా


(69)మగువల వెంటను బడుచును

తెగువతొ దుడుకడు నిరతము తెమలక యుండన్

అగుపడి నంతనె అతనికి

తగునిక శిరమును కొరుగుట తలువగ సుగుణా



(70)కవితల కదనము మనిషికి

భవితలు జ్ఞానము బెరుగుచు భావము మెండగు

కవితలె సతతము పొదలిక

కవినిక బుధులును పొగడగ కవనమె సుగుణా


(71)నృత్యము అనగను కళయగు

నృత్యము ఆత్మలొ నిలచెడి నృత్యపు భాషగు

నృత్యము చీకటి వెలుగులు

నృత్యము మనసుయు నెరయెడి నృత్తము సుగుణా


(72)కమ్మని కలలన మనిషికి

ఇమ్మహి నందున ముదమును ఇచ్చును క్షణికము

కమ్మని కలలును మరుగవ

సమ్మత మనకను మదినిక సణుగున సుగుణా


(73)మలముయు మూత్రము మేనున

మలినము సేయగ సమకొను మగువలు తల్లవ

కలలను గనుచును నుండది

తలచుచు తనయుల ఉలిగము తగునిక సుగుణా


(74)గొప్పలు బోవుచు జనమున

కుప్పలు కుప్పలు ఋణముతొ కుడుచుచు నుండన్

తిప్పలు దప్పవు నెప్పుడు

ఎప్పుడు అప్పలు నెగుడగు ఎరుగుము సుగుణా


(75)మనిషిని పశువుతొ బోల్చకు

మనిషుల కన్నను పశువులె మనిషికి మేలగు

మనుషులు బనులను జేయని

మనసుతొ ఉన్నను పశువులు మానవు సుగుణా


(76(అతియను పదమును మరువుము

అతియన నెపుడును దలువకు అతిగను నీవున్

అతియన సతతము తగదిక

అతియన చెడుపగు వదులుము అతినిక సుగుణా



(77)బొంకకు అసత్య మాటలు

పొంకపు మాటలె నెకడను పొసగగ నుండన్

బొంకకు ఉన్నను లేదని

జంకకు నిజమును పలుకగ జడుపుతొ సుగుణా


(78)పరిణయ మందున వ్యయమన

పరిమిత మైనను సరియగు పరువిక బోవదు

పరులును మెచ్చెద రంటును

పరిమితి మించిన అలమట పడుదువు సుగుణా


(79)అలలిక లేకను కడలిని

కలనను కనమిక కటకట కలగక మానదు

కలిగిన మనిషికి నైనను

కలుగుట కష్టము సుఖముయు కననగు సుగుణా


(80)పిల్లల నవ్వులు కనగను

తెల్లని మల్లెల విరులన తెలుపగ నుండన్

అల్లరి పిల్లల కనగను

ఉల్లము రంజిల్లు చుండు ఉనికగు సుగుణా


(81)ప్రకృతి వనరుల జెడుపక

ప్రకృతిన పొసగిన పనులిక ప్రజలకు సుఖమగు

వికృతపు చేష్టలు ఎపుడును

వికృతము అగునిక నెపుడును వినుమిక సుగుణా


82.దివ్వెల పండుగ ధ్వనులతొ

సవ్వడి అధికము ఒనరుచ సరసము తోడన్

అవ్వలు తాతలు గనగను

సవ్వడి అధికము అనెదరు సణుగుచు సుగుణా


83.పండని ఫలమును దెంచకు

ఎండీ తరువున కరుగకు ఎండకు భయపడి

దండుగ పనులను సేయకు

మొండిగ బలుకకు పరులతొ మెండుగ సుగుణా.


84.అధికము చదువులు జదివిన

అధికము అణకువ మనిషికి అదినిక మేలన

అధికపు పోకడ తగదిక

అధికపు ఫలముల తరువుక అదురున సుగుణా


85.మగువయు మగడును భావన

తగునిక కాపురమనగను తగదిక వేరని

అగునిక మనమున భేదము

తగునిక ఇరువురి ఎలమియు తనరగ సుగుణా


86.పగలిక వలదను నెపుడును

పగలును రేయిని మనమున పలువురి తోడన్

పగలిక దెచ్చును నెగడును

పగలను దలువక బతుకులు భవికము సుగుణా


87.కనికర మనునది మనిషికి

కొనగను దొరకదు నెకడను కొదువయు లేదన

కననగు మదిననె కలదది

కనికర భావము సుఖమన కలుగును సుగుణా


88.పేదరిక మెంతయు అయిన

బీదకు తండ్రియె దలుచును పేదగు కూతురె

బాధలు బాపెడి జగమని

బాధలొ తనయకు పితరుడె భానువు సుగుణా


89.తగదిక నిరాశ మనిషికి

తగదిక నెపుడును తృషయన తనకును అంటున్

తగదిక పగయును ద్వేషము

తగవులు గూడను ఎవరితొ తగవిక సుగుణా


90.పదవులు వచ్చును బోవును

పెదవుల జారక మెలుగగ పెనుపగు కీర్తియున్

పదుగురు మెచ్చగ ప్రమదము

మదినిక కలుగును సరియగు మన్నిక సుగుణా.


91.పాముల పుట్టలొ పాలను

సేమము ఎరుగుచు విడుచుము సేవయు అనుచున్

పాముల కనులకు మేలగు

పాముకు పోయుట బయటనె పాలను సుగుణా


92.ఇరుగుయు పొరుగుయు కలబడ

ఉరుకకు కలహము నణుచను ఉడుకుచు నీవున్

మరుగుచు ఉండెడి తరుణము

పరుషపు పదముల నిలువదు పరువుయు సుగుణా


93.చిలుకకు పలుకులు నేర్పగ

పలుకును మృదువగు పలుకులు పలుకుచు నుంటున్

ఖలునకు పొసగవుమృదువగు

పలుకులు పరుషపు పదములె పలుకును సుగుణా


94.నీరస దైన్యపు బనులన

కారణ మగునిక చెడుపను కారక మగుచున్

పోరుచు ముదమున బనులన

కోరెడు సఫలము గలుగిక గోముగ సుగుణా


95.చురుకుగ నుండుము ఎపుడును

బెరుకుగ నుండను తగదిక బెదురుచు నీవున్

కరుకుగ గుణమును జూపకు

జరుగకు కినుకతొ జగడము జరుపను సుగుణా


96.అక్కరకు రాని చదువుయు

పెక్కుగ ఫలముల నొసగక బెరిగెడి వృక్షమున్

దక్కని ఫలితము బనులలొ

మక్కువ యేలగు మరియిక మనిషికి సుగుణా


97.మనిషిని గనగనె అసహన

మనసుయు గలుగగ నతనిని మనిషన నెవరున్

మనుషులు అందరు సమమని

మనసున దలువగ అనెదరు మనిషని సుగుణా


98.శిశువులు యువతులు వృద్ధులు

పశువను మనుషుల మరులకు బలియగు చుండన్

పశువులు దలచును వింతగు

పశువులు తమకును సరియగు పశువని సుగుణా


99.సరసము అధికము అనగను

విరసము గలుగిక వినయపు విధమును మారున్

సరసము వలదిక నెపుడును

విరసము గలుగగ తగునిక వినయము సుగుణా


100. తెలియని కాలము నుండియు

తెలియును జననము మరణము తెలుపగ సహజం

కలియుగ మందున నిరతము

కలిగెడి ప్రకృతి విధమనగ కననగు సుగుణా


101. ప్రకృతిక జీవికి వరమున్

ప్రకృతిలొ వనరుల బెనుచుచు ప్రజలిక నుండన్

ప్రకృతిని చెరచగ యున్న

ప్రకృతియు నిచ్చును ఫలములు ప్రజలకు సుగుణా


102. అచ్చము భాషయు తెలుగుయు

విచ్చిన విరివలె పరిమళ వియ్యగ మనకున్

అచ్చపు భాషను కాదని

నచ్చున ఇతరుల పలుకుల నాణ్యత సుగుణా


103. మనసుకు నచ్చని వారితొ

మనువన జరుగదు సరిగను మనుగడ జూడన్

మనసిడి మెచ్చిన వారితొ

మనువిక సరిపడు కుదురుగ మనిషికి సుగుణా


104.కాగిన పాలనె కదనిక

కాగల కమ్మని రుచులిక కనగను యుండన్

కాగను మనిషికి పంతము

కాగను మేధయు చురుకగు కానగ సుగుణా


105.మనదను సంసృతి మనకది

అనగను ఘనతయు అధికము అగునిక జూడన్

మనదగు భాషయు ఘనతయె

మనకును యశమును కలుగిక మరువకు సుగుణా


106.చోరుల శోధన ధనముకె

దారులు వెదుకుచు దిరుగును దాపుడు కొరకున్

పోరులు చేయుచు నిధనుని

మారగ జూచును హసదుడు మనసిడి సుగుణా


107.జ్ఞానము కానని విధమున్

జ్ఞానపు కాంతన ప్రసురిత జ్ఞానపు వెలుగే

జ్ఞానము వెన్నెల యనగను

జ్ఞానపు వెలుగులొ తొలగున జ్ఞానము సుగుణా


108.సుగుణుని అందరి నోటను

మిగులుగ పలికిన వినదగు మితమును మీరగన్

సుగుణుడు సతతము వినయము

తగునటు మెలగగ హితుడన తగునిక సుగుణా 


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page