సూపర్ గర్ల్స్ - రాక్షస లంక
- P. V. Padmavathi Madhu Nivrithi
- Apr 5
- 6 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #SuperGirlsRakshaLanka, #సూపర్, #గర్ల్స్, #రాక్షసలంక, #TeluguChildrenStories, #కొసమెరుపు

ముగ్గురు సూపర్ గర్ల్స్ 'రాక్షస లంక' లో '11 నెలలు'!
Super Girls Raksha Lanka - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi
Published In manatelugukathalu.com On 05/04/2025
సూపర్ గర్ల్స్ - రాక్షస లంక - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1)
అ, ఆ, ఇ... ముగ్గురు స్నేహితురాళ్ళు. చాలా చురుకైన - తెలివైన ఆడపిల్లలు. కేవలం చదువుల్లోనే కాదు... లోక ఙ్ఞానం లో కూడా.
అదేంటీ అ, ఆ, ఇ... పేర్లు విచిత్రంగా ఉన్నాయి అనుకుంటున్నారా...
అనురాధ, ఆమని, ఇలియా... ఆ ముగ్గురి ఆడపిల్లల అస్సలు పేర్లు. వారిది విడదీయలేని స్నేహబంధం. అ, ఆ, ఇ అయితే స్నేహపూరిత మైన పక్క పక్క అక్షరాలు. అందుకే అలా పిలుచుకుంటారు వారు అంతర్గతంగా - అనురాగం పెనవేసుకున్న మైత్రి బంధం తో.
2)
హైదరాబాద్ లో చదువులు ముగించు కొని అక్కడే ఉద్యోగం చేయాలని తీర్మానించుకున్నారు ఆ ముగ్గురు మిత్రులు. తల్లిదండ్రులు వద్ద ఉండవచ్చు. వారి మరియు ఇతర ఇంటి సభ్యుల బాగోగులు చూసుకోవచ్చు.
పలురకాలుగా డబ్బు ఖర్చులు కూడా కలసి వస్తాయి... బాగానే మిగులుతుంది హైదరాబాద్ లోనే ఉంటే ఇంటి పట్టున (ఒకే వంట, వేరే ఊరు - వేరు ఇల్లు - వేరు అద్దె - వేరే గ్యాస్ స్టౌ - సిలిండర్ ఇతరత్ర ఖర్చుల... ఊసే ఉండదు... చాలా డబ్బులు అదా అవుతుంది).
తమ చెల్లెళ్ళ - తమ్ముళ్ళ చదువులు పూర్తి చేసే వరకు కనిపెట్టుకొని ఇంటిపట్టున ఉండవచ్చు... మంచి చెడు చెబుతూ. అదా అయిన డబ్బులు వారి చదువుల ఖర్చులకు, ఇతర ఇంటి ఖర్చులకు ఉపయోగ పడుతుంది. లేదా బ్యాంక్ లో పొదుపు చేసుకోవచ్చు.
ముగ్గురి దీ ఒకే స్వభావం. ఉన్నతమైనది - దివ్యమైనది.
అంత పవిత్రంగా - స్వచ్ఛంగా - శ్రేష్టంగా - సూక్ష్మంగా ఆలోచిస్తారు వారు ముగ్గురు స్నేహితురాళ్ళు... ఆ ఒక్క విషయంలో నే కాదు, అన్ని విషయాల్లో... ప్రతి విషయంలో.
చాలామంది అంటారు... Every housewife is a great economist అని. ఈ ముగ్గురూ (అ, ఆ, ఇ) ఈ వర్గం - విభాగం లో వస్తారేమో మరి?
----- X X X ----
2)
అమాంతం పెద్ద సమస్య వచ్చి పడింది ఆ ముగ్గురికీ. ఓ కంపెనీ వారు వారి షరతులకు ఒప్పుకొని హైదరాబాద్ లోనే ఉద్యోగం ఇస్తామన్నారు. మంచి వేతనం. ముగ్గురికీ మేనేజర్ పోస్ట్ లు.
మరి ఇబ్బంది... సమస్య ఏమిటి?
కానీ, శిక్షణ (ట్రైనింగ్) మాత్రం వేరే ఊరులో... 'లంక పేట' లో చేయాలి ఓ '11 నెలలు' అని నిబంధన - నియమం పెట్టారు.
ఓ ఆరు నెలలే కదా (ఇంకో ఊరు లో)... అనుకోవచ్చు.
'లంక - పేట' అంటే రాక్షస రాజ్యం... రాత్రిళ్ళు ఇంట్లో దూరి ఆడ పిల్లలను మానభంగం - నాశనం - విధ్వంసం చేసే విషయానికి చరిత్ర గాంచిన ఊరు... ఇళ్ళు దోచుకోడానికి పెట్టింది పేరు. 'ఆజ్ కా గూండా రాజ్' అన వచ్చు ఆ ఊరిని.
రోజూ దిన పత్రిక లో కనీసం ఒక వార్త అయినా వస్తుంది... కనీసం ఒక ఆడదాని నైనా మాన భంగం చేశారని... కనీసం ఒక ఇంటి నైనా దోచుకున్నారని... ఆ రాక్షస రాజ్యం 'లంక పేట' లో.
అలాగని చూస్తూ చూస్తూ ఇంత మంచి ఉద్యోగాన్ని వదులు కో లేరు ఆ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. మంచి జీతం - వేతనం, మేనేజర్ పోస్ట్ తోనే మొదలు మరియు ముగ్గురికి ఒకే కంపెనీ. మళ్లీ అలా అదృష్టం కలసి రావటం అంటే మాటలా? చాలా కష్టం కదా!
ముగ్గురు అమ్మాయిలు విజ్ఞప్తి పెట్టుకున్నారు కంపెనీ కి. అది గూండాల ఊరు - రాక్షస రాజ్యం - (రోజూ) మాన భంగం కు ప్రసిద్ది - దొంగల దోపిడీ కి పేరు గాంచిన ఊరు. వేరే ఊరులో శిక్షణ (training) పెట్టమని.
కంపెనీ వారు ఒప్పుకోలేదు. అక్కడ వారి అతి పెద్ద ఫ్యాక్టరీ - కర్మాగారం ఉన్నది కాబట్టి. కావాలంటే ఓ నెల రోజులు కరాటే శిక్షణ తీసుకోవచ్చు... తరువాత అక్కడికి వెళ్ళ వచ్చు అని సూచన ప్రాయంగా వెల్లడించారు.
రాక్షస రాజ్యం లో... గూండాలు మూకుమ్మడిగా కత్తులతో, తుపాకులతో వచ్చి దాడి చేసి, అదీ కట్టి పడేస్తే... కరాటే శిక్షణ పనికి రాదు కదా!
ఇంటి వాళ్ళు శ్రేయోభిలాషులు. "పోవద్దు అక్కడికి... ఇంకో ఉద్యోగం వెతకండి... బతికుంటే బలుసాకు తినవచ్చు" అని మూకుమ్మడిగా చెప్పేశారు.
---- X X X -------
3)
ముగ్గురు స్నేహితురాళ్ళు (అ, ఆ, ఇ) కలిసి కూడబలుక్కుని 'ఓ మంచి ఉపాయం' పన్నారు. ఓ నెల రోజులు కరాటే లో చేరారు. చక్కగా వివిధ నైపుణ్యాలు నేర్చుకున్నారు. తరువాయి జేబు లో మిరప్పొడి, మిరియాలు పొడి పెట్టుకొని ప్రయాణ మయ్యారు ధైర్యంగా... రాక్షస రాజ్యం 'లంక పేట' కు.
11 నెలలు ఇట్టే గడచి పోయాయి. పగలు పూట వీరి ఇంట్లో లేనప్పుడు ఎవరు చొర బడలేదు. రాత్రిళ్ళు కూడా అంతే. యే దోపిడీ మానభంగం జరగలేదు.
మొదటి రోజే... వేరే ఊరు నుండి 'లంక - పేట' కు ముగ్గురు ఆడపిల్లలు వచ్చారు అని ఊరంతా కబురు ప్రాకిన కూడా.
ఎందుకు? వీరు చేసిన 'రక్షణ ఉపాయం' ఏమిటి?
---- X X X -------
4)
వీరు ముగ్గురు అద్దెకు తీసుకున్న ఇంటి ముందు 'విశ్రాంత మిలిటరీ బాబాయి గంగన్న ఇల్లు' అని పేరు తో ఫలకం పెట్టారు.
మొదటి రోజు హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు... ఓ కండలు పెరిగిన - తిరిగిన... పెద్ద మీసాలు ఉన్న మనిషిని మిలిటరీ యూనిఫాం లో ఒక ఉత్తుత్తి తుపాకీ - గన్ను తో సహా ఆ 'లంక - పేట' ఊరికి తీసుకెళ్లారు. ఓ మూడు రోజులు ఊరంతా తిప్పి అతడిని ఓ రాత్రి ఎవ్వరూ చూడని అంధకార చీకటి సమయం లో... యూనిఫాం లేకుండా, మామూలు బట్టల్లో... రైలు ఎక్కించి... వాపసు - తిరిగి పంపిచ్చేసారు హైదరాబాద్ కు.
ఆ యూనిఫాం ను, గన్ ను మొదటి గది లో మేకు పై గోడకు తగిలించారు.
అప్పుడప్పుడూ మిలిటరీ మనిషి కోపం అరుపులు వచ్చేలా... టేప్ రికార్డ్ లో ముందుగానే రికార్డ్ చేసిన శబ్ధాలను అరుపులను... పెద్దగా వినిపించేలా... టేప్ రికార్డర్ ను స్విచ్ ఆన్ చేసేవారు.
రెండు రోజుల్లో, ఓ గంభీర (గంగన్న) 'మిలిటరీ బాబాయి' అక్కడ ఆ ఇంట్లో... ఆ ముగ్గురు ఆడపిల్లలకి తోడు ఉంటున్నాడు అనే వార్త ఊరంతా ('లంక - పేట' అంతా) ప్రాకింది. అందుకే దోపిడీ దారులు, గజ దొంగలు, రాక్షసులు, ఆడ వారిని పాడు చేసే క్రూరులు వీరి ఊసే ఎత్తడానికి సాహసించే వారు కాదు. వీరి వైపు కూడా కన్నెత్తి చూసేవారు కాద... రాత్రయినా పగలయినా... ఆ (ఉత్తుత్తి) 'మిలిటరీ గంగన్న' కు... లేకున్నా... భయపడి.
అలా ఉపాయం గా వీరి శిక్షణ 11 నెలల్లో పూర్తి చేసుకొని... ఆ గూండా రాజ్.. రాక్షస రాజ్యం... 'లంక పేట' నుండి... తిరిగి హైదరాబాద్ వచ్చేశారు సురక్షితంగా.
అల నాడు సీతమ్మ 11 నెలకు అశోక వనంలో... ఆ రావణ రాక్షస లంకా రాజ్యం లో నీరసం గా బతికింది.
కానీ... ఈ ముగ్గురు అమ్మాయిలు... 3 సూపర్ గర్ల్స్... తెలివిగా బతికారు... ఈ నాటి రాక్షస లంక పేట లో.. యే దిగులు నీరసం కష్టం నష్టం లేకుండా.
అపాయం లో ఉపాయం అంటే ఇదేనేమో!... ముగ్గురు సూపర్ గర్ల్స్... తెలివైన ముగ్గురు అమ్మాయిలు... అంటే ఇదేనేమో!...
-------------------------------------
నీతి:
1) అపాయం లో ఉపాయం ముఖ్యం. దిగులు కాదు.
2) మంచి స్నేహాలు - మంచి మనుషులు - మంచి సంస్థలు - మంచి ఉన్నత ప్రగతి అభ్యుదయం కు... మంచి జీవితానికి... మెట్లు.
3) దుబారా లేని జీవితం, అదే... పొదుపు, అదా... అందరికీ మంచి అలవాటు (ప్రత్యేకంగా పేదలకు - మధ్య తరగతి కుటుంబాలకు). అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం పట్ట వచ్చు... వచ్చే కాలం లో... ముందు ముందు.
4) మహాత్మా గాంధీ ఆశయాలు అన్ని సందర్భాల్లో పనికి వస్తుంది:
I) శాంతి, స్నేహ శీలి తత్వం, మంచి పుస్తక పఠనం, శాఖాహారం... అలవాట్లు ఉండాలి... జీవ హింస చేయ రాదు
...
ii) డాలర్ వ్యామోహం - డబ్బు దురాశ ఉండ కూడదు
...
Iii) మద్యానికి - పొగాకు కు, మాంసాహారానికి - మోసం కష్టం నష్టం ఇచ్చే తత్వానికి... వైరాలు - పగ - ప్రతీకారం - యుద్ధం తత్వానికి... భూత సర్ప పైశాచిక తత్వానికి... కుళ్ళు కుతంత్రాలు... దూరం గా మెలగాలి.
...
Iv) చెడు చూడకు, వినకు, పలుక కు... ఇది సాధ్యం దుష్టులకు, ఇష్టం లేని మనుషులకు - స్థలాలకు - పనులకు... దూరము గా ఉంటే
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
Comments