స్వేచ్ఛ - స్వాతంత్య్రం
- Sudha Vishwam Akondi

- Aug 16
- 2 min read
#SudhavishwamAkondi, #SwechhaSwatantyram, #స్వేచ్ఛస్వాతంత్య్రం, #సుధావిశ్వంఆకొండి

స్వేచ్ఛ - స్వాతంత్య్రం : ఓ చిన్న విశ్లేషణ
Swechha Swatantyram - New Telugu Article Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 16/08/2025
స్వేచ్ఛ - స్వాతంత్య్రం - తెలుగు వ్యాసం
రచన: సుధావిశ్వం ఆకొండి
చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరూ అలవోకగా ఉపయోగించే పదాలు స్వేచ్ఛ, స్వాతంత్య్రం. నేడు ప్రతి వారు తమకు నచ్చినది చేయడానికి వీలు లేదంటే చాలు వారి నోటి వెంట వచ్చే పదాలు ఇవే!
పిల్లలకు ఆరోగ్యం పాడవుతుందని సరిపడనివి తినకూడదని తల్లి అంటే..
"ఇష్టమైనవి తినే స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేవా నాకు? " అనే ఆలోచన చిన్న పిల్లల్లో..
"బయటకు వెళితే చెప్పి వెళ్ళాలి. అసలే రోజులు బాగులేవు" అని కూతురితో
"అలా ఆవారాగా తిరగ వద్దు రా! జీవితానికి ఉపయోగపడే పనులు చేయాలి" అని కొడుకుతో తండ్రి చెబితే వాళ్లకు కోపం.
"ఇష్టమున్నట్టు వుండే స్వేచ్ఛ, స్వాతంత్య్రం మాకు లేవు ఇంట్లో" అనే డైలాగ్ వచ్చేస్తుంది వాళ్ళ వద్ద నుంచి.
అలాగే టీచర్స్ వద్ద..
"బాగా కష్టపడి, ఇష్టపడి చదవాలి" అంటే, స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేదనే భావన..
ఆ తర్వాత కొద్దిగా పెద్దయ్యాక కాలేజీ లో చేరాక, "లవ్వులు -, గివ్వులు ఉండొద్దు. బాగా చదవాలి. లేదంటే ఆవారా అంటారు" అని హితవు చెబితే..
"ఆవారా అయితే ఏంటి? ప్రేమించే స్వేచ్ఛ, స్వాతంత్య్రం మాకు లేవా? మా ఇష్టం వచ్చినట్టు వుండే స్వేచ్ఛ లేదా? ఇటు పేరెంట్స్, అటు లెక్చరర్స్ చంపుతున్నారు" అని భావనలు.
తీరా చదువు తర్వాత జాబ్స్ చేసే చోట, ఆ తర్వాత పెళ్లయ్యాక, జీవిత భాగస్వామితో ఇలా.. అన్నిచోట్లా ఇదే తంతు.
ఒక మందుబాబుకు తాగే స్వేచ్ఛ కావాలి. తాగి, వాగే స్వాతంత్య్రం కావాలి!
అసలు స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటే ఏంటి? అని అడిగితే సరియైన అవగాహన ఎవరికీ లేదు. ఎవరికి ఇష్టం వున్నట్టు వాళ్ళు వుండడం అని తీర్మానిస్తారు. మరి అలా వుండి, వేరే వాళ్ళ బాధకు కారణం అవ్వ వచ్చా? ఇది మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. ఇదీ నేటి సమాజ స్థితి.
అందుకనే ప్రతి చిన్న విషయానికి అనవసర ఉద్యమాలు.
కానీ..
ప్రతి ఒక్కరూ ఆలోచించ వలసినది అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? తెలుసుకోవాలి. మనకు కావాలని అనిపించినదల్లా దోచుకుని అయినా, లాక్కుని అయినా తీసుకోవడం స్వేచ్ఛ కాదు.
నోటికి వచ్చిందల్లా వాగడం స్వాతంత్య్రం కాదు!
మనకు నచ్చినట్టు మనం వుండవచ్చు కానీ..
అలా వుండడం వల్ల ఇతరుల స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని హరించేలా వుండకూడదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎదుటివారు బాధ పడేలా వుండకూడదు.
ఈ మాట అనగానే అలా వుండడం అసాధ్యం! అందరికీ నచ్చేలా వుండడం ఎలా సాధ్యం?
ఇది కరెక్టే! అందరికీ నచ్చేలా వుండడం కుదరదు కానీ మన ఇంట్లో వాళ్లకు నచ్చేలా కొంతవరకు వుండొచ్చు. సభ్యతకు తిలోదకాలు ఇచ్చేలా, సమాజం పై చెడు ప్రభావం పడేలా వుండకూడదు.
అది సమాజంలోని అందరూ పాటించడానికి ప్రయత్నించాలి! అప్పుడే సభ్యత, విలువలతో కూడిన సమ సమాజం ఏర్పడుతుంది.
79 సంవత్సరాల క్రితం, దేశం కోసం, తమ ప్రాణాలను సైతం ధారబోసిన స్వాతంత్య్ర సమర యోధుల త్యాగానికి అర్థం, పరమార్థం కల్పించిన వారం అవుతాము.
అందరికీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
�� ��
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments