తరుణీ శతకము
- Sudarsana Rao Pochampalli

- Feb 3
- 7 min read
#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #TaruneeSathakamu, #తరుణీశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Tarunee Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 03/02/2026
తరుణీ శతకము - తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
1.)శర్వరి గూర్చియు జెప్పగ
కర్వరి యందున మగువలె కరుణతొ నుండన్
మర్వని రీతిన మనుగడ
నిర్వహ ణనగను దలుతురు నిజమన తరుణీ
2.)జగమున చేడియ లనగను
సగముగ ఉండియు జనమున సంపద వారే
ఖగపతి వాహను కైనను
జగమున జలధిజ గనకను జరుగున తరుణీ
3.)అన్నుల మిన్నలు అతివలు
ఎన్నగ గుణశీలు రనగ ఎరుగగ నుండన్
వెన్నను బోలిన మనసుతొ
మన్నిక బొందుచు మసులును మహిలో తరుణీ.
4.)అందము నందున అతివలు
కుందన బొమ్మలు కనగను కుదురుగ నుండన్
డెందము వారిది పాలుము
ముందరి చూపుతొ సదనము ముదితలె తరుణీ
5.)వలలుడు జేసిన వంటలు
తెలియదు జేయను పురుషులు తెలుపగ నింకన్
కలియుగ మందున కమ్మగ
లలనలె జేతురు తినుటకు లావుగ తరుణీ
6.)ఇంటికి దీపము సతియన
కంటికి పాపలు నిరతము కాంతులు ఈయన్
ఇంటను శుభములె ఇకనన
తంటలు గనరిక సదనము తరుణులె తరుణీ
7.)తాళిని మెడలో గట్టగ
తాలిష మొందుచు మగువయు తాపము లేకన్
ఆలిగ ఇంటను వెలయుచు
జాలితొ పతిసుతు గనునిక జాగ్రత తరుణీ
8.)అమ్మయు అక్కయు చెల్లెలు
ఇమ్మహి శాలిని ఇతరులు ఇలలో వరుసల్
ఇమ్ముగ కలిగియు నుందురు
కమ్మని పలుకులు పలుకుచు కాంతలె తరుణీ
9.)తోడుగ ఆడది లేకను
వేడుక గనడిక పురుషుడు వెతలును ఇంకన్
ఆడదె పుడమిన దేవత
ఆడదె జగమున జనులకు ఆదరు తరుణీ.
10.)విలువల బతుకునె దలుతురు
చెలువలు సతతము మనమున చెప్పగ నింకన్
తలుతురు అందరి క్షేమము
ఇలలో ఇంతుల బలమగు ఇంపన తరుణీ
11.)అవనీ తలమున నారులు
నవనీత హృదయులు కనగ నయమని దల్వన్
అవఘళ బనులను సలుపుతు
ఎవరికి మోసము దలువరు ఎరుగగ తరుణీ
12.)శ్రమయన వెరువదు మహిళ
శ్రమయన పురుషుల కధికము శర్వరె జేయన్
శ్రమయన సంసృతి సుఖమె
శ్రమయని దలుచుచు సతతము శమమే తరుణీ
13.)అత్యంత శక్తివంతులు
అత్యంత ధ్రుతియు గలిగియు అతివలు ఉండన్
అత్యంత సేవ జేయుచు
అత్యంత ఎలమి గలిగియు అతివలె తరుణీ
14.)అతివలు జగతిన అలరులు
సతతము ప్రేమను పరిమళ సంపతి తోడన్
పతినిని సుతుల మనసిడి
ప్రతిశ్రయ జలధిజ అనగ ప్రాపును తరుణీ
15.)లోకము మారగ తలుతురు
లోకము నందున అతివలు లోకము తీరున్
లోకము నందున తామును
లోకము తీరుగ వినిమయ లోలురు తరుణీ
16.)తాలిమి అధికము మగువకు
జాలియు అధికము మగువకు జగమున జూడన్
మేలగు గుణములె అధికము
లాలిత హృదయము గలిగియు లలనలె తరుణీ
17.)పుడమన ఆడది అనగను
పుడమిన పుట్టువు సహితము పుడమియు వోలెన్
కడకును ఆడదె కనగను
పుడమిన పుట్టుక కరణము పూర్తిగ తరుణీ
18.)కవులును వ్రాసెడి కవితలు
చెవులకు ఇంపగు పలుకులు చెలులను గూర్చే
ఉవిదలు పుడమిన వేల్పులు
ఉవిదలు లేకను జగమన ఉండరు తరుణీ
19.)ఆడయు మగయును జాతిలొ
ఆడయె జూడగ భువిదివి ఆదరణ నగన్
ఆడయు లేకను జీవము
ఏడను గనమన పృథివిన ఎరుగగ తరుణీ
20.)పాలుయు ఫలముయు అన్నము
మేలగు తిండియు తినుటకు మేదిని గనగన్
చాలగ ఆడగు జాతియె
నేలను జీవుల బతుకన నేలను తరుణీ
21.)అమ్మగ అక్కగ చెల్లిగ
ఇమ్మహి ఆలిగ నిలిచిన ఇంతియు అయ్యున్
కమ్మని పాలతొ సుతులను
నిమ్మళ బరుచుచు బెనుచును నిజమన తరుణీ
22.)తల్లన బెంచును కొంచెమె
ఇల్లాలన మోయు బరువు ఈల్గుట వరకున్
తల్లియు ఆలియు పురుషుని
చల్లని బతుకును కనెదరు జగమున తరుణీ
23.)కూడుయు గూడుయు గుడ్డయు
తోడుగ ఆడది కలుగగ తోషము గాగన్
ఆడది లేకను బతుకన
నీడను ఈయని కుఠికడ నిలుచుటె తరుణీ
24.)అమ్మయు అక్కయు చెల్లెలు
ఇమ్ముగ తోడగు సతియును ఇలలో గనగన్
నిమ్మళ మగునిక బతుకున
సమ్మత మొందగ బురుషులు సహురిన తరుణీ
25.)అతివలు పుడమిన లేకను
బతుకను మాటయు కనమిక భరణిన గనగన్
క్షితితో సమముగ ఓర్పుతొ
అతివలు ఉండురు ధరణిన అనగను తరుణీ
26.)మహిలో మహిళల మహిమలు
ఇహపర సుఖములు ఒసగెడు ఇంపగు లేఖల్
సహనము ప్రేమయు స్నేహము
మహిళల స్వంతము పుడమిన మహిమన తరుణీ
27.) పురుషుల యందునను ప్రఘను
లెరుగగ నుందురు కనగను లేశము ఐనన్
తరుణులె గుణశీలు రనగ
పరువుతొ సంసృతి నడిపెడు పనియని తరుణీ.
28.) పుణ్యజను లనగ పురుషుల
రణ్యము నందున మృగముగ రభసయు జేయన్
పుణ్యము దక్కునని మగువ
అన్యము దలువక మగనికె అభినుతి తరుణీ
29.)యమునుకి ఎదురేగు తెగువ
సుముఖకె కలదన పతికని సుగుణము అదియే
యమునిని సావిత్రి గొరలె
రమణుని రక్షించ నురికి రయమున తరుణీ
30.)హరికిని తోడుగ రథమున
నరకుని జంపను గదిలెను నారియు సత్యే
నరకుని జంపెను వెరువక
ధరణిన ధైర్యము తరుణులె తగగను తరుణీ
31.) చరితను జదువగ దెలియును
భరతము నందున పడతులు బహువిధ కీర్తిన్
ధరణిన గలిగియు మదినిక
వెరువక తలపడు విధమన వెలుగగ తరుణీ
32.)అనికని వెళ్ళెడి దశరథు
వెనుకను కైకేయి వెడలి వేలును బెట్టెన్
కనగను రథము ఇరుసుకును
తొణకక ఓర్చుచు సమరపు తోషము తరుణీ
33.)చాకలి ఐలమ్మ అనగ
తేకువ గలిగిన వనితన తెలియగ నుండన్
చాకిరి మానియు తెగబడి
దూకుడు దొరలను ఎదురిడి దులిపెను తరుణీ
34.)వీరవని తనగను వినగ
బీరము రుద్రమ అరులకు భీకర మగుచున్
ధీరము జూపుచు రాణిగ
భారము బూనుచు నడిపెను బాగుగ తరుణీ
35.)విశ్వము నందున పుట్టుక
విశ్వస నీయము మగువయె విబుధులు జెప్పన్
విశ్వము నందున శక్తియె
విశ్వము కంటెను మొదలన వినగను తరుణీ
36.)అబలను కాలము చెల్లెను
అబలలు సబలలు సమముగ అగుదురు జూడన్
అబలలు అన్నిట నిపుణులు
సబలగ మారిరి కనగను సహురిన తరుణీ
37.)అత్తయు మామయు పిల్లల
మొత్తము బాధ్యత తనదని మోదము తోడన్
ఉత్తమ ఇల్లాలు అనగ
గుత్తగ జేయును బనులను గుమ్మయె తరుణీ
38.)కవితలు కథలును గేయము
చవిగొను పూర్వపు రచనలు చక్కగ వ్రాయన్
సువదన లందునె నేర్పన
అవనిన ప్రతిభతొ మెలగెడు అతివలె తరుణీ
39.)నింగిలొ సగము మహిళలన
నింగినె పూర్తిగ నిలిచెడు నిపుణత తోడన్
అంగన లందరు నేడన
హంగుయు గలిగియు నిలిచిరి హాయిగ తరుణీ
40.)కొంతగ కాలము సూష్యతి
కొంతగ కాలము ప్రసూత కోమలు లుండన్
ఎంతయు దిగులుయు జెందక
సంతస మొందుచు కనునన సంతును తరుణీ
41.)అమ్మకు ఎంతయు మ్రొక్కిన
ఇమ్మహి దీరదు రుణమన ఇదియును గాకన్
అమ్మన కనబడు వేలుపు
అమ్మకు మించేది జగతి ఆనదు తరుణీ
42.)ఆటలు పాటలు నాట్యము
నోటను పలుకులు మధురము నోపిక ఇంకన్
జోటిలె సమర్థు లనగను
సూటిగ జెప్పగ సకలము సుదతులె తరుణీ
43.)రోజుకు కూలిగ మహిళయె
రోజుకు చేటిగ మహిళయె రోతన కుండన్
రోజులు మారిన గూడను
బూజులు వదులక వసించె పుడమిన తరుణీ
44.)నాకును అక్కని చెల్లని
నాకును అమ్మని ఇతరులు నానా వరుసల్
నాకును లోకము అనగను
ఏకము మహిళని దలుచుట ఎరుగుము తరుణీ
45.)ఎందుకు వర్ణన జేయరు
కొందరు కవులన లతాంగి గొడివెల తీరున్
అందమె జూతురు అతివల
నందరు మరియిక ఎరుగరు నలతలు తరుణీ
46.) రవియును కైరవి పోటితొ
అవిరామ కృషియు అతివలు అలసట లేకన్
అవిరత మనగను జేతురు
అవనిన వెరువక మగువలె అనగను తరుణీ
47.)కట్టడి తోడనె అతివలు
నెట్టుక వత్తురు బతుకును నేరిమి తోడన్
పుట్టిన దాదిగ ఆడని
పెట్టిన పేరుతొ సహురిన పెరుగగ తరుణీ
48.)మగువల చులకన జూసిన
తెగువయు గలదని మరువకు తేటిలు వారున్
మగువకు సుగుణము ఎంతనొ
తగవున అంతనె తెగవన తలువగ తరుణీ
49.)మగనికి మగువయె సంపద
మగువకు మగడుయె సకలము మనుగడ యందున్
జగమున మహిళలె వేల్పులు
యుగములు మారిన అటులనె యుండును తరుణీ.
50.)నిండిన చెరువులొ వర్షము
మెండుగ గురియగ దెగునిక మేదిని గనగన్
దండిగ సహనము గలిగిన
దుండిని గదుపగ వదులక దులుపును తరుణీ
51.)మగడును జావగ మగువను
జగమున జూతురు అఘమును జరిపిన అటులన్
మగువయె పుట్టెడు దుఃఖము
దగులగ పద్ధతు లనుటయు తగునా తరుణీ
52.)శుభమగు పనులకు వలదని
అభముయు శుభముయు ఎరుగని అబలను అనగా
విభవము బోవున మగనితొ
అభయము ఇచ్చుట మరిచియు అరటమ తరుణీ
53.)సంగము నందున అతివల
భంగము పరచెడు విధముగ బలుపుతొ జూడన్
వెంగలి అనెదరు కనగను
అంగన లనగను దలువగ ఆప్తులు తరుణీ
54.)అమ్మగ అక్కగ చెల్లెగ
ఇమ్మహి దలువగ మగువల ఇంపుగ నుండన్
సమ్మత మొందుచు వారును
నిమ్మళ పడెదరు పుడమిన నిజముగ తరుణీ.
55.)కలకంఠి ఇంటను నిలువ
బలమగు సంసృతి గలిగియు భద్రత గుండన్
నిలయము పిల్లలు పెద్దలు
ఎలమితొ మెలగుచు కననగు ఎరుగగ తరుణీ
56.)ఎక్కద మహిళకు ఉగ్గుడొ
అక్కడ వేల్పులు నిలుతురు అనగను ఇంకన్
ఎక్కడ అతివల దలువరొ
అక్కడ అసురుల క్రియవలె అగుపడు తరుణీ
57.)పాపగ పుట్టియు పెరిగియు
చూపును ప్రేమను సదనము సుగుణము తోడన్
ఓపిక సహజము ఉవిదకు
ఏపని జేసిన అణకువె ఎరుగగ తరుణీ
58.)ఇంటికి దీపము ఇంతియె
కంటికి రూపము కలికియె కానగ నుండన్
తంటలు లేకను కననగు
ఇంటను సుఖములె సతతము ఇంపుగ తరుణీ
59.)మగువయు లేనిది జననము
మగువయు లేనిది గమనము మరిలే దనగను
మగువయు లేనిది సృష్టియు
మగువయు లేనిది జగముయు మరుగగు తరుణీ
60.)పనిలో దాసిగ మంత్రిగ
కనగను లక్ష్మిగ క్షమకును కర్వరి ఇంకన్
కనుమోడ్పు నందు రంభగ
తినగను జననిగ మగువయి తిప్పలు తరుణీ
61.)ప్రేమతొ జూడుము సతిని
ప్రేమతొ బెంచుము తనయల ప్రేమతొ జననిన్
ప్రేమతొ గనుము భగినుల
ప్రేమను మాటకు విలువలు పెంచుము తరుణీ
62.)దేవుడు అంతట ఉండగ
దేవుని రూపమె జననియు దేహియు జూడన్
దేవత అనగను మహిళయె
జీవుల పుట్టుక శరణము జీవిగ తరుణీ
63.)అవధాన ప్రక్రియ అతివ
కవకాశ మనగ అనుదిన కష్టము లందున్
అవనిన అతివకు పనులన
నవనీత హృదయ నరులలొ నాతుకె తరుణీ
64.)పుడమిన తల్లికి ప్రేమన
అడవిన మృగముయు అనుగుతొ ఆడదె ఉండన్
కడకును అసురులు ప్రేమను
విడువరు పెంచగ సవమును విశదము తరుణీ
65.)పిల్లలు ఎటులను ఉన్నను
తల్లికి అందము మనమున తనరగ నుండన్
పిల్లల రక్షణె కావలె
తల్లికి సతతము కలికవ తానన తరుణీ
66.)మగువకు ప్రేమన అధికము
మగువకు జాలియు అదనము మహిలో గనగన్
మగువయు లేకను మనుగడ
మగవారు గనరన నదియె మయివడి తరుణీ
67.)ధనముయు ధాన్యము కన్నను
అనయము ఇంటిలొ మగువయె ఆదరు వనగన్
కనగను కలికియు లేకను
ధనముయు ధాన్యము అగునిక దండుగ తరుణీ
68.)జగమున జాయయు లేకను
జగపతి అయినను గదులడు జగములు దిరుగన్
తగవులు ఉన్నను తరుణియె
సగమగు దేహము గనుకను సంపదె తరుణీ
69.)వరునకు దక్షిణ అనుచును
పరువుయు పోయిన వదులరు పట్టును అనగన్
ధరణిలొ వధువుయె దాతన
కరువన కుండను సదనము కలిమియె తరుణీ
70.)అక్కతొ చెల్లెతొ ఆడిన
చక్కని కాలము కనమన జగమున జూడన్
అక్కయు చెల్లెలు అరుగగ
మక్కువ తోడను మగలతొ మనువున తరుణీ
71.)ఆలిగ ఇంటను అడుగిడు
శీలము గలిగిన పడతితొ శివమన గలుగన్
ఏలన పిల్లలు పాపలు
ముల్లెగ గలుగగ సదనము ముదమగు తరుణీ
72.)ఇందుని భాస్యయె అందము
ఇందుని కంటెను అధికము ఇలలో గనగన్
అందని దూరపు కొండల
నందున నునుపుగ శిలలన నగుపడు తరుణీ
73.)గతిలేని సంసృతి అయిన
అతెవలె మిక్కిలి సహనము అనుచును ఉంటున్
మతలబు ఇంటను బయటను
సుతరాము దెలుపక నుండు సుగుణమె తరుణీ
74.)సంసృతి యందున గరువము
సంసృతి పోషణ మగడును సరిగను జేయన్
సంసృతి చక్కగ మలచును
సంసృతి బాధ్యత తనదని సకియను తరుణీ
75.)సొమ్ములు పుస్తెలు అమ్మియు
ఇమ్ముగ సంసృతి నడువను ఇంతియె గాగన్
సమ్మత మనుచును కంటికి
చెమ్మయు రానీదు పడతి చెప్పగ తరుణీ
76.)తరములు మారిన తరుగవు
తరణుల ఇడుములు పుడమిన తారల నంటన్
పెరుగుచు నుండును ఇంకను
వెరువక నుందురు అనరిక వెతలని తరుణీ
77.)అన్నియు రంగము లందున
మన్నిక వృద్ధితొ అతివల మనుగడ సాగన్
దన్నుగ నిలుచును దేశము
వెన్నెము కగుచును కరుగును వెతలన తరుణీ.
78.)మహిలో మహిళలె గురువులు
అహమన ఎరుగని సుగుణులు అతివలు కాగన్
సహనమె శస్త్రము వారికి
ఇహమున వేల్పుగ విలసిన ఇంతులు తరుణీ.
79.)ఆడది తోడుగ లేకను
కూడును గొరకక పురుషులు కుదులుచు ఉంటున్
ఏడను సరిగను నిలువక
వాడలు దిరుగిక దిగులుతొ వారన తరుణీ.
80.)పాటలు పద్యము వ్రాయుము
పాటవ మున్నచొ పడతుల పాట్లను గూడన్
దాటను వేయక దెలుపుము
సూటిగ పడతుల ఇడుముల సూక్ష్మము తరుణీ.
81.)కోడలు కొత్తయు అల్లుడు
కాడిక పాతని దెలుపుచు కనికర మనకన్
కోడలు కొత్తది అయినను
జూడరు వెంటనె పనులిక జూపుచు తరుణీ.
82.)హక్కుల కొరకని మగువలు
పెక్కుగ పోరుచు ప్రభుతది పెడచెవి గనగన్
మిక్కిలి బాధయు జెందగ
దక్కదు కీర్తియు ప్రభుతతధర్మము తరుణీ.
83.) మహిళల అహమును జంపుచు
సహనము లేకను కినుకలు సాగెడు విధమున్
మహిలో పురుషులు దలుచుట
సహురియు గహనము అగునిక జనమున తరుణీ
84.)చెప్పుట వరకే విననగు
గొప్పలు జెప్పెడు పురుషుల గోమను మాటల్
తప్పవు మగువల కిడుములు
ఎప్పుడు కనగను మనమున ఎరుగరు తరుణీ
85.)నింగికి ఎత్తుగ నిలుపుతు
భంగిమ లన్నియు బొగడుతు బాగని అనుచున్
తుంగలొ దొక్కుచు మగువల
సంగతి మరిచియు దలువరు శమమును తరుణీ .
86.)అద్దము లాంటిది ఆడది
బద్దక మెరుగక సలుపును బహువిధ పనులన్
అద్దము పగిలిన విధముగ
వద్దిక ముద్దియ దలువగ వగపును తరుణీ.
87.)యుద్ధము తగదు వలతితొ
శ్రద్ధగ జేసెడి పనులలొ శ్రమయన నెంతో
బుద్ధిగ గనుచు మనసున
క్రుద్ధుడ వవకను మెలగుము క్రుంగగ తరుణీ.
88.)ఎన్నియు తప్పులు జేసిన
మన్నన జేసెడు గుణమన మగువకె ఉండన్
పొన్నుగ దలువగ సరియగు
అన్నుల మిన్నను గనగను అతిచర తరుణీ.
89.)కోరుము సంతుగ కూతురె
మారరు ప్రేమను మనసున మాటకు ఐనన్
దూరరు ఎపుడు ఎవరిని
క్రూరపు భావము దలువరు కులమున తరుణీ.
90.)చదువున ముందర బాలకె
అదుపున నుండగ చిరుతుకె అనగను నింకన్
పొదుపను విషయము దెలిసియు
తదుపరి దినముకు సరియని తలచును తరుణీ.
91.)మనమున ఎంతయు దలచిన
కనగను ఇంతియె ఘనతన కలియుగ మందున్
పెనగొను బంధము తోడను
గుణమను శీలము గలిగిన గుమ్మలె తరుణీ.
92.)వేకువ జామునె వనితలు
చాకిరి జేయను మొదలిడి చతురత తోడన్
వాకిలి ఊడ్చియు ముగ్గుల
నేకము వేతురు ముదమన నేర్పుతొ తరుణీ
93.)ఏపని మొదలిడ మహిళలె
చూపను ఉందురు ప్రతిభను చురుకుగ నింకన్
ఓపిక అధికము మగువకు
మాపుయు పగలును తమవిధి మానక తరుణీ.
94.)పుడమిన సృష్టికి మూలము
పడతియె కనగను వినగను పరిపరి విధముల్
కడకును చెట్టుయు చేమయు
మడతుకె పుట్టుక అనగను మదిగన తరుణీ.
95.)ఉదరము లోకము నందున
కుదురుగ కదలుచు మెదలుచు కుశలము గుంటున్
తుదకును బుట్టగ పాలును
పదిలము బట్టగ కరుణతొ పడతియె తరుణీ.
96.)పనితన మందున పడతుల
కనగను మిక్కిలి పటిమతొ కౌతుక మనుచున్
జనముయు మెచ్చుచు నుండగ
వినయము తోడను ఒనరుచు విధమన తరుణీ.
97.)కులమున కూతురు బుట్టిన
నిలయము మెరయును సతతము నిగనిగ మనుచున్
దళపము దొరికిన విధముగ
కలుగును ఇంటను తనివియు కానగ తరుణీ.
98.)కడుపున ఉండగ తిండియు
కడుపుయు పండిన పిదపయు కానెడు పాలున్
కడుకును బతుకున మొత్తము
కడుపును నింపును కదనిక కలికియె తరుణీ.
99.)హక్కుల కొరకని మహిళలు
చిక్కులు పడనేల పుడమి చిందులు వేస్తున్
అక్కర పురుషుల కుండగ
దిక్కుగ మహిళలు సతతము దివిభువి తరుణీ.
100.)పురుషుడు పుట్టుట పెరుగుట
తరుణుల వలెనని తెలువగ తామర కంటిన్
ఇరుకున బెట్టగ బతుకున
మరియిక బురుషుల బతుకన మలినమె తరుణీ.
101.) వేషము లెన్నియు వేసిన
పోషణ బాధ్యత మరువకు పొలతుల యందున్
యోషిత వలననె బతుకన
తోషము జెందగ గనుమిక తొయ్యలి తరుణీ.
102.)బతుకును ఇచ్చిన దమ్మవ
బతుకున నిలిచిన దనగను భార్యయె గాగన్
సుతులను సుతలను ఇచ్చియు
సతతము వెంటనె నెలువగ సకియనె తరుణీ.
103.)చెడుయగు శీలము లన్నియు
విడువక నుండును బురుషుల విషయము నందున్
పడతులు ఎరుగరు ఎపుడును
చెడుయగు పనులను బతుకున చెప్పగ తరుణీ
104.)కొడుకుల కన్నను కూతురె
ఇడుములు తలిదండ్రి పడగ ఇంపన కుండన్
విడువక తోడుగ నిలుచుచు
కడుగను వారల శుభమును కాంచును తరుణీ.
105.)ఇడుములు పడినను ఇంతులు
విడువరు శీలము నెపుడును విపులన గనగన్
అడుసుయు ద్రొక్కుట కాలును
కడుగుట జేయరు మగువలు కానగ తరుణీ.
106.)వసుధలొ క్షీరమె సుధన
ప్రసవుయు ఇచ్చును కుడువగ ప్రాణము నిలువన్
వసుమతి యందున ఉవిదలె
అసువులు నిలిపెడు సురలను ఆప్తులు తరుణీ .
107.)నాతితొ ఉండగ నాకము
నాతిని వీడగ నరకము నరునకు గనగన్
మాతగ గృహిణిగ మగువ
ప్రీతిని గొలుపుచు బతుకున ప్రియమన తరుణీ.
108.)ధరణిలొ ధరుణము అనగను
తరుణితొ కాలము గడుపగ తనరగ నుండన్
శరణము బతుకున తరుణియె
ధరణిన అతివల సహజపు ధర్మము తరుణీ.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.




Comments