top of page

తెలుగు వెలుగుల జిలుగులు



'Telugu Velugula Jilugulu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 03/02/2024

'తెలుగు వెలుగుల జిలుగులు' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


నాదేశం భారత దేశం

భాషా ప్రయుక్త రాష్ట్రముగా ఏర్పడ్డ

తెలంగాణ నేను పుట్టినది

తెలుగంటె మక్కువ ఎక్కువ

కారణం ఉగ్గుపాలతో అమ్మ నేర్పిన భాష

తెలుగు భాష తీయదనం తెలుపంగ

మాగిన మాకంద ఫలముకన్న

కలకండ కన్న కమ్మని జున్నుకన్న

చక్కెరకన్న చెరుకు రసముకన్న

పాయసంబుకన్న భ్రామరసముకన్న

పనస తొనలకన్న పాల మీగడకన్న

అమరుల బువ్వగు అమృతముకన్న

అధిక మాధుర్య మనగ నుండు

అట్టి భాష మిగుల అందమనగ

ఎందు లేనగు ప్రక్రియ లెరిగియుండ

కుందనంబగు భాష కువలయమందు

ఉండనుండ పరభాష కురుకనేల

మనది యను మాట మరచుటేల 

దోష  రహిత భాష దొరికి యుండ

ఆస లేల ఆంగ్ల భాషయందు

అదియె భావననగ నిలిచెను నా మదిలోన

మాతృ భాష యందె మమకారముంచ  

పాత్రమనుచు జీవిత యాత్ర యందు.

--సుదర్శన రావు పోచంపల్లి


16 views0 comments
bottom of page