తనదాకా వస్తే
- Addanki Lakshmi

- 2 hours ago
- 4 min read
#తెలుగుకథలు, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #ThanadakaVasthe, #తనదాకావస్తే

Thanadaka Vasthe - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 13/12/2025
తనదాకా వస్తే - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
రామాపురం అనే చిన్న గ్రామం ఉంది. ఊరిలో ఒక ఉన్నత పాఠశాల. విద్యార్థులందరూ అందులోనే చదువుకునేవారు. జట్లు జట్లుగా బడికి వెళుతుండేవారు. అల్లరి చేస్తూ, నవ్వులు కేరింతలు, ఒకరినొకరు ఏడిపించుకుంటూ ఉండేవారు. బాల్యంలో విద్యార్థుల అల్లరిని ఆపలేం. చదువంటే ఒక సరదా.
నాలుగో తరగతిలోని రామునికి చిన్నప్పుడే పోలియో వ్యాధి సంక్రమించి, కుంటుతూ స్కూలుకి కష్టపడి వెళ్ళేవాడు. పిల్లలందరూ అతని చుట్టూ మూగి ఏడిపిస్తూ ఉండేవారు. ఇంటి దగ్గరకు వచ్చి అమ్మ దగ్గర ఎంతో ఏడ్చేవాడు.
"అమ్మా! నన్ను ఎందుకు ఇలా కుంటివాడుగా పుట్టించావు? నన్ను అందరూ బడిలో ఏడిపిస్తున్నారు," అని తల్లితో అన్నాడు.
అదే తరగతిలో రవి చాలా అల్లరి పిల్లవాడు. రాముని "కుంటోడా, కుంటోడా" అని హేళన చేస్తూ పిల్లలందరినీ వెంటబెట్టుకుని బాగా ఏడిపించేవాడు.
రాము ఇంటికి వచ్చి తల్లి దగ్గర ఏడ్చేవాడు. స్కూలుకు పోనని మారాం చేసేవాడు. తల్లి ఎలాగో నచ్చచెప్పి, "నాయనా, వాళ్ల మాటలు ఏమీ నువ్వు పట్టించుకోకు. బాగా చదువుకో. పెద్ద కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. అప్పుడు నిన్ను అందరూ ఎంతో గౌరవిస్తారు. ఇప్పుడు ఈ నవ్విన పిల్లలే రేపు నిన్ను ఎంతో గౌరవిస్తారు," అంటూ బుజ్జగించి చెప్పేది.
నిజానికి రవి చిన్నవాడు, అమాయకుడు. పాపం, ఏమి తెలియదు.
వాళ్ల నాన్న మోతుబరి. వ్యవసాయం మీద బోలెడు డబ్బు. లక్షాధికారి. పిల్లవాడంటే అతిగారాబం చేయడం వల్ల, వాడికి భయం భక్తి లేదు. ఎవర్నీ లెక్క చేసేవాడు కాదు. టీచర్ల మాట కూడా వినడు.
ఒకసారి స్కూల్ నుంచి వస్తూ ఉంటే, రవి స్నేహితులతో కలిసి దారిలో ఉన్న జామ చెట్టు ఎక్కి కాయలు కోసుకుంటూ, చెట్టు మీంచి కింద పడ్డాడు. అంతే, కాలు విరిగింది.
దాంతో హాస్పిటల్లో సిమెంట్ కట్టు వేశారు. ఆరు వారాలు కట్టుతో, స్కూల్ లేకుండా, కాలు నొప్పితో ఏడుస్తూ కూర్చునేవాడు.
కట్టు విప్పినా నడవలేక ఇంట్లో కూర్చున్నాడు. కాలులో విపరీతమైన పోటు. కాలు కదిపితే చాలు ఏడుపొచ్చేసేది.
డాక్టరు చెప్పిన ఎక్సర్సైజులు చేసినా ఇంకా కాలు నొప్పితో రోజు ఏడ్చేవాడు.
నడవలేక కుంటి కుంటి గా నడిచేవాడు.
ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటాడు? తల్లిదండ్రులు బడికి వెళ్ళమని చెప్పారు.
బడికి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఎవరైతే రోజు తన చుట్టూ చేరిన ఫ్రెండ్స్ రాముని ఏడిపించేవారో, వాళ్లందరూ ఇప్పుడు రవి వెనుకబడి, "కుంటోడు, కుంటీ" అని వెకిలిగా నవ్వుతూ కేరింతలు కొడుతూ, అల్లరి చేస్తున్నారు.
ఇప్పుడు రవికి రాము నిస్సహాయ స్థితి బాగా అర్థమైంది.
"కాలు విరిగి నడవలేక కొన్నాళ్లు అవస్థ పడుతుంటే తనకి ఇంత బాధగా ఉంది. పాపం, రాము జీవితాంతం ఆ కుంటి కాలుతో బాధపడతాడు కదా! అయ్యో! నిజంగా వాడికి ఎంత కష్టం!" అంటూ మనసులో ఎంతో పశ్చాత్తాపం పొందాడు రవి.
అప్పుడు రవికి బాగా తెలిసి వచ్చింది:
ఎదుటివారిలో లోపాలను చూసి జాలి పడాలి గాని నవ్వరాదు. అదే తనకు కష్టం కలిగితే అప్పుడు తెలుస్తుంది.
అప్పట్నుంచీ రవి గుణపాఠం నేర్చుకున్నాడు. ఎంతో మారిపోయాడు.
"రాము, చాలా పొరపాటయింది రా. నిన్ను కుంటివాడని ఏడిపించేవాడిని. నన్ను క్షమించరా. ఇప్పుడిక ఎదుటి వాళ్ళ కష్టాలు నాకు అర్థమయ్యాయి," అంటూ వాడి చేతులు పట్టుకొని, "ఈ రోజు నుంచి నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్‌వి రా," అన్నాడు.
ఇంక అల్లరి చేష్టలు మానేశాడు. ఎవరిని ఏడిపించేవాడు కాదు. అతనిలో మంచి మార్పు వచ్చింది.
రాముతో చక్కగా స్నేహం చేస్తూ అతనికి అన్ని విషయాలలోనూ సహాయం చేసేవాడు.
తమ్ముడిలా చూసుకునేవాడు.
అల్లరి పిల్లలు రాముని "కుంటోడా" అంటే వాళ్ల మీద విరుచుకు పడిపోయేవాడు.
నీతి:
మంచి మాటలు చెబితే చిన్న పిల్లలకైనా, పెద్దవారికైనా బుర్రకు ఎక్కదు. జీవితంలో అనుభవం మంచి పాఠాలు నేర్పిస్తుంది. మార్పును తెస్తుంది.
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments