top of page

తండ్రిని మించిన తనయుడు

#ThandriniMinchinaThanayudu, #తండ్రినిమించినతనయుడు, #సైనికకథ, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #తెలుగుకవిత, #TeluguPoem

Thandrini Minchina Thanayudu - New Telugu Poem Wtten By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 20/05/2025

తండ్రిని మించిన తనయుడు - తెలుగు కవిత

రచన: కందర్ప మూర్తి


"అమ్మా! నాన్న ఇంకా రాలేదు. స్కూలు బస్సుకు టైమయిపోతోంది. " తొందర పడుతున్నాడు కొడుకు విజయ్. 


"వస్తారులే, బాబూ! ఈ నెల మొదటి సోమవారం కదా, శర్మోనయం పేరేడ్ ఉంటుంది. రావడానికి కాస్త ఆలశ్యమవుతుంది. " అని తల్లి భారతి సర్ది చెబుతుండగా ఫేమిలీ క్వార్టర్ గుమ్మం ముందు స్కూటర్ హారన్ వినబడింది. 


తలుపు తీసుకుని ఆకు పచ్చని యూనిఫామ్, నెత్తిమీద బ్లు బేరెట్ కేప్, నున్నని గెడ్డం, నడుంకి బెల్టు, కాళ్లకు నల్లని పాలిష్ తో నిగ నిగ మెరుస్తున్న బూట్లతో స్మార్టుగా నడుస్తు లోపలికి అడుగు పెట్టేడు ఆర్మీ హవల్దార్ సాగర్. 


"విజయ్, స్కూలుకి రెడీయా? " అని కొడుకును పలకరించాడు. 


"నేను ఎప్పుడో రెడీ అయాను. మీ కోసమే ఎదురు చూస్తున్నా"

అన్నాడు స్కూల్ బేగ్ వీపుపై ఎక్కించుకుంటు కొడుకు విజయ్. 


భార్య భారతి ఇచ్చిన బ్రేక్ ఫాస్టు తిని కొడుకును స్కూటర్ వెనక కూర్చోబెట్టి బయలుదేరాడు హవల్దార్ సాగర్. 

***

హవల్దార్ సాగర్ గత పదిహేను సంవత్సరాల నుంచి భారత ఆర్మీలో సేవలు చేస్తున్నాడు. 


సాగర్ తండ్రి ఆర్మీలో విధులు నిర్వహిస్తుండగా, ప్రభుత్వ ఒడంబడిక ప్రకారం శ్రీలంక సైన్యానికి లిబరేషన్ టైగర్స్ తో ఘర్షణ సమయంలో భారత సైనిక బృందంతో వెళ్లినప్పుడు అక్కడ జరిగిన లేండ్ మైన్ ప్రమాదంలో కాలు పోగొట్టుకుని వికలాంగుడిగా పదవీ విరమణ చెయ్యవల్సి వచ్చింది. 


అప్పుడు విద్యార్థిగా ఉన్న సాగర్ సెంట్రల్ స్కూలు చదువు అవగానె మాజీ సైనికుల పిల్లల రిజర్వేషన్ కోటాలో సైన్యంలో చేరి దేశ సరిహద్దుల్లో, వివిధ ప్రాంతాలలో సైన్యం విధులు నిర్వహిస్తు అవకాశం ఉన్న చోట కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. 


కొడుకు విజయ్ ని ఎలాగైన ఆర్మీలో కమీషన్డు ఆఫీసర్ హోదాలో చూడాలని కోరిక పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టు సెంట్రల్ స్కూల్లో చదివిస్తు కృషి చేస్తున్నాడు. 


విజయ్ కూడా ఆర్మీ వాతావరణంలో పెరుగుతు సైన్యం మీద అవగాహన పెంచుకుంటున్నాడు. 


ఇంతలో మిలిటరీ స్కూల్ ప్రవేస పరిక్షలు రావడంతో సైనిక పిల్లల కోటాలో సెలక్టయి మిలిటరీ స్కూల్లో చేరాడు. చదువుతో పాటు ఆర్మీ శిక్షణ కూడా ఇస్తున్నారు. 


విజయ్ మిలిటరీ స్కూలు శిక్షణ పూర్తయిన తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రవేస పరిక్షలో ఉత్తీర్ణుడై ఇండియన్ మిలిటరి అకాడమి, డెహ్రాడూన్ లో ప్రవేశం పొంది బెస్టు కేడెట్ గా పాసవుటయాడు.. 


ఇంతలో హవల్దార్ సాగర్ కూడా సర్వీస్ సీనియారిటీతో జూనియర్ కమీషన్డు ఆఫీసర్ తర్వాత సీనియార్టీతో సుబేదార్ ప్రమోషన్ తీసుకుని ఎడ్మినిస్ట్రేట్ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. 


విజయ్ కి ఇండియన్ కమీషన్డు ఆఫీసర్ కెప్టెన్ హోదాలో తండ్రి సాగర్ విధులు నిర్వహిస్తున్న ఆర్మీ యూనిట్ కి ఆఫీసర్ ఇన్చార్జిగా పోష్టింగు ఇచ్చారు. 


రోజువారి సైనిక విధుల నిర్వహణ సమయంలో హోదాను అనుసరించి ఎన్నో ఏళ్ల సర్వీస్ ఉన్న తండ్రి సాగర్ సావధానంగా నిలబడి, కొత్తగా ఆఫీసర్ హోదాలో వచ్చి కుర్చీలో కూర్చున్న కొడుకు విజయ్ కి సెల్యూట్ చెయ్యాల్సి వస్తోంది. యూనిఫామ్ సర్వీసులో కుర్చీలో కూర్చుండే వ్యక్తి హోదాకే కాని వయసుతో సంబంధం ఉండదు. 


అదే తీరు ఇక్కడ జరుగుతోంది. ఇంటి దగ్గర తండ్రిగా సాగర్ కి గౌరవం ఇస్తున్నప్పటికీ డ్యూటీలో ఆఫీసర్ హోదాలో విజయ్ తండ్రిని చూడాల్సి వస్తోంది. 


ఈ తీరు కెప్టెన్ విజయ్ కి బాధగా అనిపించి పై అధికారుల్ని రిక్వెస్ట్ చేసి మరో యూనిట్ కి ఆఫీసర్ గా బదిలీ చేయించుకున్నాడు. 


ఏమైనప్పటికీ, అనుకున్న ప్రకారం తన కళ్ల ముందు పుట్టి పెరిగిన కొడుకు ఆర్మీ కమీషన్డు ఆఫీసర్ గా తన కన్న పెద్ద హోదాలో కనబడటం ఎంతో తృప్తి నిచ్చింది జుత్తు నెరిసిన సుబేదార్ సాగర్ కి. 

 సమాప్తం


 ***


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page