top of page

తప్పుకి పరిహారం


'Thappuki Pariharam' New Telugu Story


Written By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

అదొక పేరు ప్రతిష్టలు కలిగిన ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్త! కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వణికింపచేస్తున్న తరుణంలో ఐ.టి. కంపెనీలతో బాటుగా చాలా కంపెనీలకూ, పరిశ్రమలకూ లాక్ డౌన్ నిర్భందించింది ప్రభుత్వం!


ఉమ ఆ కంపెనీలో ప్రాజక్ట్ డెవలప్మెంట్ విభాగంలో మేనేజర్ గా పనిచేస్తోంది.. దాదాపు పన్నెండుసంవత్సరాల సాఫ్ట్ వేర్ ప్రోగామింగ్ అనుభవంతో ఎంతో చాకచక్యంగా, చురుకుగా పనిచేసే "ఉమ" పట్ల ఆ విభాగం హెడ్ కు మంచి ఒపీనియన్ ఉంది.. అందుకనే ఒక మూడునెలల టైమ్ పరిధిలో పూర్తి చేయాల్సిన ఒక ప్రోజక్ట్ కి సాఫ్ట్ వేర్ డెవలప్ చేసి ఇవ్వవలసినదిగా ఆ ప్రోజక్ట్ హెడ్ "ఉమ"కు ఎసైన్ చేయడం జరిగింది..


ఆ సాఫ్ట్వేర్ విజయవంతం అయితే మరెన్నో ప్రాజక్ట్ ఆర్డర్లు క్లైంట్ కంపెనీ ఇస్తానని ప్రామిస్ చేయడంతో లాక్ డౌన్ ముందురోజే "ఉమ"ను తనఛాంబర్ లోకి పిలిచి ప్రాజక్ట్ వివరాలన్నీ ఆమెతో చర్చించి, ఏ ప్లాట్ ఫాం ఉపయోగించి చేస్తే సొల్యూషన్ ఔట్ పుట్ వస్తుందో బాగా స్టడీ చేయమని, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, మరింత దీక్షగా ప్రాజక్ట్ పూర్తిచేయమని, స్కెచ్ వేసి చూపించాడాయన.. అనుమానాలుంటే క్లైంట్ ను కూడా కోఆర్డినేట్ చేయమని "గుడ్ లక్ అంటూ విష్ చేసి పంపించాడు ఉమను!


లాక్ డౌన్ పిరియడ్ అయినా ఉమ కు దీక్షగా ఇంట్లో కూర్చుని పనిచేయడం కుదరడంలేదు.. తన రెండేళ్ల కొడుకుని అత్తగారు చూసుకుంటున్నా, గది తలుపులు వేసుకుని పనిచేసుకుంటుంటే వచ్చీరాని మాటలతో ' అమ్మా తాపు తీయి ' అంటూ వాడు తలుపులు బయటనుండి దబ దబా బాదుతూ ఉంటాడు.. అలాగే ఉమ అయిదేళ్ల కూతురు ' నిత్య' కు కూడా స్కూల్ లేని మూలాన పిల్లలిద్దరూ ఆడుకుంటూ, కొట్టుకుని ఏడుస్తుంటే అత్తగారు సంభాళించినా వాళ్లను ఆప శక్యం కావడంలేదు..


ఉమ భర్త రఘు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాడు.. వీడియో కాన్ఫరన్సెస్, మీటింగ్స్, ఫోన్స్ కాల్స్ తో అతను తలుపు తెరవడు.. ఇంక ఉమకు డే టైమ్ లో పని సరిగా చేయలేకపోవడంతో, రాత్రి పిల్లలను రఘు దగ్గరే పడుకోబెట్టి, రాత్రి అంతా కూర్చుని పని చేసుకోక తప్పడంలేదు!


అనుకున్నట్లుగా మూడునెలల టైమ్ ఫ్రేమ్ లో ప్రాజక్ట్ పూర్తిచేసింది.. ఎప్పటికప్పుడు ప్రాజక్ట్ స్టేటస్ విషయమై క్లైంట్స్ తో మాట్లాడుతూ ఉండేది.. తన బాస్ కు కూడా అప్ డేట్స్ ఇస్తూ ఉండేది.. ఇంక రెండురోజుల్లో క్లైంట్ కు ప్రాజక్ట్ రిలీజ్ చేయాలి, ప్రోగామింగ్, సాఫ్ట్ వేర్ టెస్టింగ్ అవీ క్షుణంగా పరిశీలించింది.. ఔట్ పుట్ అనుకున్నట్లుగా వస్తోంది.. తను ఉపయోగించిన ' డి కోడింగ్' పరఫెక్ట్ గా పనిచేస్తోంది!

సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది! తను డెవలప్ చేసిన సాఫ్ట్ వేర్ సింగపూర్ లో ఒక రిటైల్ బేంక్ కార్యాలయానికి అవసరమైనది.. సింగపూర్ లో ఆ బేంక్ చాలా ప్రతిష్టాత్మకమైనది.. ఆ బేంక్ తమ కష్టమర్స్ కు విస్తృత మైన సేవలను సకాలంలో అందిస్తూ మొత్తం బేంకింగ్ సెక్టారులో ఒక అత్యుత్తమైన నాణ్యమైన బేంక్ గా పేరు తెచ్చుకుంది.. ఆ బేంక్ అందించే వ్యాపార కార్యకలాపాలు చాలా ఉన్నాయి.


పబ్లిక్ నుండే కాకుండా అనేక వ్యాపార సంస్తలనుండి నిధులను సమీకరించడమే కాకుండా ఆ నిధులకు రక్షణ కల్పిస్తూ, వాటిమీద చక్కని వడ్డీలను ఆ డిపాజిట్ దారులకు అందిస్తూ , అనేక వ్యాపార సంస్తలకు, ఉగ్యోగస్తులకు బుుణసదుపాయం కలిగిస్తూ ప్రజలలో ఒక మంచి నమ్మకాన్ని సంపాదించించింది! ఆ కార్యకలాపాలన్నింటినీ సునాయసంగా నెరవేర్చడానికి కావలసిన సాఫ్ట్ వేర్ ప్రాజక్ట్ ఆర్డర్ "ఉమ"పనిచేసే కంపెనీకి రిలీజ్ చేసింది!


ఉమ అనుకున్నట్లుగా మరుసటిరోజు తను పూర్తిచేసిన ప్రాజక్ట్ ను సింగపూర్ బేంక్ కు రిలీజ్ చేసి ఆరోజు రాత్రి హాయిగా నిదురోయింది!


లాక్ డౌన్ పిరియడ్ లో కాస్త సడలింపులు వచ్చిన మూలాన ముఖ్యమైన పనులు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తూ వర్క్ కు వెళ్లవచ్చు అనేసరికి, అదీగాక ఉమ బాస్ ఒకసారి ఆఫీస్ కు రమ్మనమని ఫోన్ చేసిన మూలాన ఉమ ఆ మరుసటిరోజు ఉదయమే ఆఫీస్ కు వెళ్లింది!


బాస్ ఛాంబర్ కు వెళ్లగానే బాస్ చాలా ఆగ్రహావేశాలలో ఉన్నాడు.. “ఏం పని చేసారు మిసెస్ ఉమా ? అభాసుపాలైపోయాం, మీరు చేయలేనని చెపితే మరొకరికి ఎసైన్ చేసేవాడిని కదా, మీరు డెవలప్ చేసిన సాఫ్ట్ వేర్ లో "బగ్స్"ఉన్నాయిట.. దాని ప్రభావం, ఆ బేంక్ కస్టమర్స్ అకౌంట్స్ లో అవకతవకులు వచ్చాయిట.. ఒకరి ఎమౌంట్ మరొకరి ఎకౌంట్ కు క్రెడిట్, డెబిట్ అవడం జరిగిందట, క్లైంట్ ఫైర్డ్ మి” అనగానే........ ఉమ ఒక్కసారిగా నిశ్చేష్టిత అయిపోయింది, ఆకాశం బద్దలై తన నెత్తిమీద పడబోతుందా అన్నంత భయం కలిగింది! కళ్లమ్మట నీళ్లొక్కటే తక్కువ, గొంతు పిడచకట్టినట్లుగా అయిపోయింది!


“సర్.. గివ్ మి సమ్ టైమ్. ఎక్కడ బగ్ ఉందో నేను చూస్తాను. బిలీవ్ మి సర్! ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఇష్యూ అండ్ డీల్ విత్ ది క్లైంట్” అంటూ ముఖం ఎర్రగా చేసుకుంటూ తన కేబిన్ కు వచ్చి సిస్టమ్ ఓపెన్ చేసింది!


బాస్ కేబిన్ నుండి ఎర్రబడిన ముఖంతో బయటకు వచ్చిన ఉమను కొలీగ్స్ కొంతమంది అలా చూస్తూ ఉండిపోయారు!

ఉమ ఎవరితోనూ మాట్లాడకుండా తన సీట్ కు వచ్చి సిస్టమ్ ఓపెన్ చేసింది!


ప్రోగ్రామింగ్ స్టెప్స్ అన్నీ వెరీఫై చేసి చూసింది! ప్రోగ్రామింగ్ ప్రాసెస్ లో నాలుగు విభాగాలూ కరెక్ట్ గా ఉన్నాయి. మొత్తానికి కోడింగ్ ప్రాసెస్ లో బగ్ పట్టుకుంది.. ఎలా వచ్చింది? ఓ మైగాడ్.. తను ఎంతో జాగ్రత్తగా చేసింది!

కోడింగ్ లో ఒక చిన్న సింగిల్ డిజిట్ ఎర్రర్.......... ప్రోగ్రామ్ లైన్ చివర సెమీకోలన్ మిస్సింగ్ , అలాగే ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ లో అదనంగా బ్రాకెట్ పడిపోయింది!


ఎలా జరిగిందీ పొరపాటు ? అంత కష్టపడి చివరకు తను చేసింది ఇదా ?


తన కష్టం మొత్తం గంగపాలు అయిపోలేదూ! అసలు ఏమి జరిగింది ? ఎలాజరిగిందీ పొరపాటు ?


ప్రాజక్ట్ రిలీజ్ చేసేముందు.. ముందురోజు రాత్రి ఏమైంది.. ?

అంతక ముందు రెండురోజుల క్రితం రాత్రి ప్రోగ్రామింగ్ అంతా స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తోంది!


రాత్రి అంతా గదిలో లైట్ ముందు అదే పనిగా లేప్ టాప్ ముందు కూర్చుని పని చేస్తున్నమూలాన కళ్లు ఎర్రబారి నీళ్లు కారుతున్నాయి!


ఆ ప్రోగ్రామ్ స్టెప్ బాగా క్లోజ్ అయిపోయిందని, గేప్ ఇద్దామనుకుంటూ ఎడిట్ చేసింది! ఆ ఎడిటింగ్ లో సెమికోలన్ మిస్ చేసేస్తూ ఎడిషనల్ గా బ్రాకెట్ పెట్టేసింది.


అవును జరిగిందదే! ఇప్పుడు అర్ఘమైంది. ఇది తన నిర్లక్యమే.. ముమ్మాటికీ! తను చెప్పే ఏ ఎక్స్ ప్లెనేషన్సూ ఏ క్లైంటూ పాజిటివ్ గానూ, సహృదయంగానూ రిసీవ్ చేసుకోదు! ఛైల్డిస్ నెస్ అని నవ్వుతారు!


క్లైంట్ గానీ తన కంపెనీగానీ వ్యాపారపరంగా తమకు కలగబోయే నష్టాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తుంది! ఏది ఏమైనా క్లైంట్ ను ముందుగా కన్విన్స్ చేసి క్షమార్పణ అడగడం తన విధి!


అంతా కరక్ట్ చేసి క్లైంట్ కు కనెక్ట్ అయి ఎక్కడ పొరబాటు జరిగిపోయిందో తెలిపి, దానిని సవరించిన వైనం చెప్పింది! మళ్లీ ఎడిట్ చేసి సేవ్ చేసిన ప్రోగ్రామ్ పంపుతున్నానని, జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని, అవకతవకలు జరిగిన అకౌంట్ దార్ల అకౌంట్స్ ను ఏవిధంగా డీకోడ్ చేసి కరెక్ట్ చేయొచ్చో వివరించింది..


క్లైంట్ చాలా ప్లీజ్ అవుతూ........ ప్రస్తుత లాక్ డౌన్ పరిస్తితిని అర్ధం చేసుకున్నామని, జరిగిన పొరపాటుకు సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలంటూ పొలైట్ గా మాట్లాడేసరికి హమ్మయ్య అనుకుంటూ గుండెలమీద చేయివేసుకుంది! ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి అవడానికి మూడు గంటల సమయం తీసుకుంది!


ఆ మూడుగంటలూ అలా తలవంచుకునే పని చేసింది! లంచ్ తినలేదు, కనీసం పచ్చిమంచినీళ్లుకూడా తాగలేదు! క్లైంట్ ఓకే అన్నాక ' ఉమ ' తన బాస్ ఛాంబర్ వైపు నడిచింది..


బాస్ కు డిటైల్డె గా వివరిస్తూ, ఇదంతా బై ఓవర్ సైట్ జరిగిందని, జరిగిన తప్పుకు తనే బాధ్యత వహిస్తున్నానని సారీ చెపుతూ........ తన తప్పుకు పరిహారంగా రిజిగ్నేషన్ లెటర్ సబ్ మిట్ చేస్తానని చెప్పింది!


బాస్ ఒక్క క్షణం ఉమ వైపు సాలోచనంగా చూస్తూ......

"చూడండి ఉమా! పొరపాట్లు జరగవని కావు.. మన ఐటి రంగంలో ఏ చిన్నపొరపాటు జరిగినా మన ఇమేజ్ మొత్తం క్రేష్ అయిపోతుంది.. కంపెనీనే ఎత్తేసుకోవలసిన పరిస్థితి కలగొచ్చు..


సింగపూర్ క్లైంట్ కు నేను కూడా చెప్పాను, కోవిడ్-19 తో ప్రపంచం అతలాకుతలం అవుతున్నా మేము ప్రోజక్ట్ డెలివరీ చేయడానికి ఎక్స్ టెన్షన్ కూడా మిమ్మలని కోరలేదని. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఫేమిలీ, పిల్లలు ఉన్నవారికి అందునా ఈ పరిస్తితిలో ఎంత కష్టమో అని కూడా వివరించాను!


ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలను సముదాయిస్తూ, ఈ మహమ్మారీ కరోనా వైరస్ లో కూడా మీరు రాత్రీ పగలూ ఇంతగా కష్టపడి పనిచేయడాన్ని నేను గుర్తించలేదని అనుకోకండి ఉమా!


మీమీద విశ్వాసంతోనే మీకు ఈ వర్క్ ఎసైన్ చేసాను!

ఫైనల్ గా మీరు ఏమిటో నిరూపించుకున్నారు..

నేను ఈరోజు ఆఫీస్ కు రాగానే క్లైంట్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాకా చాలా ఆవేశానికి లోనైనాను. మూడ్ అంతా పోయింది.. దాని పరిణామమే మీమీద కోప్పడడం!


ఇదిగో ఇప్పుడే వచ్చిన సింగపూర్ క్లైంట్ రెస్పాన్స్ చూడండి...... "ఏన్ ఎక్ట్రార్డినరీ వర్క్ డన్ బై యువర్ ఆఫీస్" అంటూ వచ్చిన ఇ-మెయిల్!


కంగ్రాట్స్ మిసెస్ ఉమా, నో రిజిగ్నేషన్ నంధింగ్........ వుయ్ నీడ్ పీపుల్ లైక్ యూ......” అంటూ అభినందించాడు!


బాస్ ఎంత అభినందించినా "ఉమ"లో ఆ టెన్షన్, మానసిక ఒత్తిడి అలాగే ఉంది.. ఇంటికి వచ్చిన ఉమ అలాగే డల్ గా ఉంది.. నిస్త్రారణగా ఓపికలేని దానిలా!


భార్యను గమనించిన రఘు, "ఏమైంది ఉమా, ప్రాజక్ట్ సక్సెసే కదూ అని పలకరించేసరికి అంతవరకు దాచిపెట్టుకున్న దుఖం, బాధ కట్లు తెచ్చుకుంటూ కన్నీటి రూపంలో ప్రవహించి రఘును పట్టుకుని ఏడ్చేసింది.. ఉమ దుఖాన్ని చూస్తూ కాసేపు రఘు మౌనంగా ఉండిపోయాడు..


ఉమ నెమ్మదిగా పొద్దుట ఆఫీస్లో జరిగిన సంగతి అంతా వెక్కిళ్లు పడపతూ చెప్పేసరికి రఘు అనునయంగా,“చూడు ఉమా, ప్రతీ విషయానికి ఇలా ఎమోషనల్ అయిపోతే ఎలాగ? సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో ఇవన్నీ కామన్ ఇష్యూసే! నీవు కావాలని చేసిన తప్పుకాదు..

వర్క్ ఫ్రమ్ హోమ్, నీలాంటి స్త్రీ ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలను పెట్టుకుని రాత్రి పగలూ కూర్చుని ఏక దీక్షగా చేయడం సామాన్యవిషయం కాదు.. అదీ ప్రస్తుత క్లిష్ట పరిస్తుతులలో!

అయినా కూడా నీవు నీ పొరుపాటు ని సరిదిద్దుకున్నావు.. అది చాలా గొప్పవిషయం..


నేను కూడా మా బాస్ నుండి ఇప్పుడే తలవాచే చివాట్లు తిన్నాను.. కాని మా బాసే అన్నారు తరువాత, ‘రఘురాం, ఇవన్నీ కామన్, మనసులో పెట్టుకోకంటూ, కోవిడ్ -19 తన ప్రతాపాన్ని ఒక్క మనుషులమీదే కాకుండా తద్వారా అన్ని రంగాలకూ చూపిస్తోంది, ఏది ఏమైనా ఆరోగ్యం ప్రధానం, జాగ్రత్తగా ఉండం’డంటూ ధైర్యం చెప్పారు..


నీ బాధ, టెన్షన్ అన్నీ వదిలేయ్ ఉమా, హాయిగా పిల్లలతో ఎంజాయ్ చేద్దా”మంటూ ఊరడించేసరికి ఉమ ముఖంలో ఒకలాంటి రిలీఫ్ కదలాడింది!


***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


44 views0 comments

Comments


bottom of page