తీపి గుర్తులు
- Veluri Sarada

- Feb 10
- 2 min read
#తీపిగుర్తులు, #TheepiGurthulu, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Theepi Gurthulu - New Telugu Story Written By Mayukha
Published in manatelugukathalu.com on 10/02/2026
తీపి గుర్తులు - తెలుగు కథ
రచన: మయూఖ
రాజేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తన హోదాకి తగ్గట్టుగా SUV కారు తీసుకున్నాడు.
ఆ కారు రాజేష్ యొక్క జీవన స్థాయిని పెంచేదిగా ఉంది. భార్య గీత కారుకు బొట్టు పెట్టి, "ఇంత పెద్ద కారు మన ఇంటిలో పెట్టుకోవడానికి మన చిన్న గేటు సరిపోదుగా" అంది.
"నాకు తెలుసు. అందుకే గేటుకు ఆనుకుని రోడ్డు పక్కన పార్కు చేశాను" అన్నాడు రాజేష్.
"ఇంత పెద్ద కారు మనకు అవసరమా? రాత్రంతా దీన్ని బయటపడితే ఎలా? చెప్పండి!"
రాజేష్ చిరాకుపడ్డాడు. "ఏం చేస్తాం? మా మేనేజర్ ప్రమోషన్ ఇస్తానంటే, మంచి ఇన్సెంటివ్ వస్తుందంటే తీసుకున్న. ఈ మోడల్ కారు ఉంటేనే కదా? ఆఫీసులోనూ, మన చుట్టుపక్కల మన స్టేటస్ పెరిగేది. కారు ఇంట్లో పట్టలేదు అనుకో, అప్పుడు ఈ ఇంటిని అమ్మేసి, ఏ విల్లానో, ఏ అపార్ట్‌మెంట్ కొనాలి" అన్నాడు.
"మీ నాన్నగారు కట్టించిన ఇల్లు అమ్ముతానంటారా?
ఈ ఇంటిలోనే మన పెళ్లి, పిల్లలు, అత్తమామలతో గడిపిన జ్ఞాపకాలు, ఇరుగుపొరుగు వాళ్ళతో
స్నేహాలు ఇవన్నీ మర్చిపోయారా?" అంది గీత బాధగా.
"ఇంటికి, మన స్టాండర్డ్‌కి మ్యాచ్ కావట్లేదు గీత! నాకు కూడా ఇల్లు అమ్మాలంటే గిల్టీ ఫీలింగ్‌గానే ఉంది" అన్నాడు రాజేష్.
***
మర్నాడు రాజేష్ కొడుకు బన్నీ. "డాడీ! పక్క అంకుల్ మన కారును చూసి, అదేంటి మీ కారు రోడ్డు మీద ఉంది, మా చిన్న కారు కూడా మేము లోపలే పెట్టుకున్నాం!" అన్నాడు. ఆ మాటకి నాకు సిగ్గేసింది డాడీ!" అన్నాడు బన్నీ. రాజేష్ మొహం మాడింది.
"ఈ కారు తనను పై స్థాయికి తీసుకువెళుతుందని అనుకుంటే, దీనివల్ల అవమానం పొందవలసి వస్తోంది" అనుకున్నాడు.
కారు రోడ్డు మీద పార్క్ చేస్తుంటే స్థానికులకు ఇబ్బంది కలిగిస్తోంది.
ఒకరోజు రాత్రి కారు అద్దాలు పగలగొట్టి దొంగలు విలువైన వస్తువులు తీసుకువెళ్లిపోయారు.
మర్నాడు రాజేష్ ఆ నష్టాన్ని చూసి బాధ పడ్డాడు. దాంతో గీత
"చూడండి! ఈ కారు రోడ్డు మీద ఉండడంతో, మనల్ని కూడా రోడ్డు మీద పెట్టినట్టు అయింది. మన ఇంట్లో చోటు లేనిది, మన జీవితంలో ఎలా ఇముడుతుంది? అంతేకాకుండా రాకపోకలకి ఇబ్బంది కలుగుతోందని కాలనీ వాళ్లు కంప్లైంట్ చేస్తున్నారు" అంది.
రాజేష్ ఆలోచించాడు. "తన పాత జీవితం, ఇరుగుపొరుగు స్నేహాలు, తన కుటుంబ బంధాలు
ఇవన్నీ ఈ కొత్త స్టేటస్ సింబల్ వల్ల దూరం అవుతున్నాయని అర్థమైంది."
ఆరోజు డీలర్‌కి ఫోన్ చేసి కారు అమ్మకానికి పెట్టి, చిన్న కారు కొనుక్కున్నాడు. అది చక్కగా వాళ్ళ చిన్న గేటు లోపల పార్క్ అయింది. ఆ రాత్రి బన్నీ. "డాడీ! మన కారు మన ఇంట్లోనే ఉంది" అన్నాడు సంతోషంగా. రాజేష్ అనుకున్నాడు. చిన్నదైనా మన ఇంటి వస్తువు మన ఇంట్లో ఉంటేనే బాగుంటుంది అని, తన ఇంటితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ.
"సంపదలు శాశ్వతం కాదు,
సంబంధాలే శాశ్వతం."
******శుభం *******
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.




Comments