top of page

త్యాగమయులు పూవులు

Updated: Mar 22

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #త్యాగమయులుపూవులు, #ThyagamayuluPuvulu, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 37

Thyagamayulu Puvulu - Somanna Gari Kavithalu Part 37 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 16/03/2025

త్యాగమయులు పూవులు - సోమన్న గారి కవితలు పార్ట్ 37 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


త్యాగమయులు పూవులు


అమ్మ తోటకు వెళ్ళింది

పూలు ఎన్నో చూసింది

చకచక వాటిని కోసింది

పూల సజ్జను నింపింది


చక్కని దండ అల్లింది

దేవుని మెడలో వేసింది

మిగిలిన మాలను సిగలో

తురిమి తురిమి మురిసింది


స్త్రీలకు పూలు ఇష్టము

దేవుని పూజకు అవసరము

పూవుల సేవలు గొప్పవి

తావులను వెదజల్లునవి


ఎన్నో ఎన్నో పూవులు

కనువిందు చేసే పూవులు

త్యాగానికి ఆనవాళ్లు

లేరు ఇష్టపడని వాళ్ళు

ree












తెలుగు మేలుకొరకు మేలుకో!

----------------------------------------

ఘన తెలుగు మేలుకోసము

తక్షణమే మేలుకొనుము

మాతృభాష పరిరక్షణ

మన బాధ్యత తెలుసుకొనుము


తల్లి భాష మరచితే

తలవంపులు తమ్ముడూ!

అభివృద్ధి అధోగతే

గ్రహించుకో! అమ్మడూ!


అందరినీ కలుపుకొని

అభిమానం నింపుకొని

అమ్మ భాష వైభవాన్ని

గర్విద్దాం! పెంచుకొని

ఎద ఎదను మీటుకుని


తెలుగోళ్ల కంటి వెలుగు

తెలుగు భాషేనని ఎరుగు

మన భాష భాసిస్తే

ఇక ఆనందమే కలుగు

ree

















మహనీయుల మంచి మాటలు

----------------------------------------

ముఖంలోని నగవులు

వనంలోని సుమములు

పరికిస్తే అందము

గృహంలోని బాలలు


రకరకాల పూవులు

విరజిమ్మును తావులు

అందచందాలతో

అలరించును మనసులు


పసివారి హృదయాలు

లేలేత కుసుమాలు

ముగ్ధమనోహరమే

మగువలున్న సదనాలు


చెట్టుకున్న ఫలములు

గట్టుపైన తరువులు

చూడంగా సొగసులు

చెరువులోని జలములు


కొలనులోని కలువలు

తనువుపైన విలువలు

చాలా ఉపయోగము

బ్రతుకులోన విలువలు

ree












హితమెంతో శ్రేష్టము

----------------------------------------

మనసు మంచిదైతే

శుభమే జరుగుతుంది

నోరు అదుపు చేస్తే

పోరు సద్దుమణుతుంది


అహం ఎక్కువైతే

ఆనందము ఆవిరి

బంధాలకు విఘాతము

తెలుసుకొనుము చదువరి


అనుదినము ధ్యానిస్తే

ఆరోగ్యము పదిలము

అసూయను వదిలేస్తే

బాగుండును జీవితము


దైవాన్ని ప్రేమిస్తే

మంచిని స్వాగతిస్తే

బ్రతుకంతా శుభములు

వర్థిల్లును బ్రతుకులు

ree








నిర్లక్ష్యం ప్రమాదం

----------------------------------------

నిర్లక్ష్యపు నీడలో

ఉన్నావంటే నేస్తము!

కాలనాగు పడగ కింద

ఉన్నట్టే అని అర్థము


చెప్పనలవి కాదు కాదు

నిర్లక్ష్యం దుష్ఫలితాలు

గత అనుభవాలు చూస్తే

కోకొల్లలు ఆనవాళ్లు


ఎప్పుడైనా కాటేయును

జీవితాన నిర్లక్ష్యము

నష్టమెంతో తెచ్చును

దానికుండు బహు దూరము


దేనిలోనూ! నిర్లక్ష్యము

వద్దు వద్దు సోదరా!

బుద్ధి తెచ్చుకొని కాస్త

ఇకనైనా మానరా!


ఎవరిని నిర్లక్ష్యంగా

ఎప్పుడూ చూడవద్దు

చేస్తున్న పనిలోనూ

ఉదాసీనత చూపవద్దు


నిర్లక్ష్యం భూతానికి

బలి చేయకు జీవితాలు

వాయిదాలు వేసి వేసి

తెచ్చుకోకు నష్టాలు


-గద్వాల సోమన్న


Comments


bottom of page