వాడిపోయిన మల్లెపూదండలు
- Nallabati Raghavendra Rao
- Aug 5
- 9 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #వాడిపోయినమల్లెపూదండలు, #VadipoyinaMallepudandalu, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Vadipoyina Mallepudandalu - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 05/08/2025
వాడిపోయిన మల్లెపూదండలు - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
షణ్ముఖం తన కొడుకు అమర్నాథ్ పెళ్లి సంబంధానికి విజయవాడ వెళ్లడం విషయంలో హడావిడిగా ఉన్నాడు.
సికాకుళం సైకిల్ మీద స్పీడ్ గా వచ్చి కొంచెం దూరం గా స్టాండ్ వేసి తన బుట్టలోంచి నాలుగు మూరలు మల్లె పూలదండ తీసి బయట నిలబడి ఉన్న షణ్ముఖం భార్య సావిత్రికి అందించి షణ్ముఖం వైపు తిరిగి..
''బాబాయ్ గారు ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం చేసుకుని వచ్చేయాలండీ. పెళ్లి బేరం మాత్రం నాదే ఎవరికి ఇవ్వకూడదు" అంటూ.. షణ్ముఖం ఇచ్చిన డబ్బులు తీసుకుని రోడ్డు దాటి అవతలకి వెళ్లి కొంచెం దూరంలో ఉన్న ఎలక్ట్రికల్ స్తంభం దగ్గర సైకిల్ స్టాండ్ వేశాడు అక్కడ ఉన్న ఇంట్లో వాళ్లకి పువ్వులదండ ఇవ్వాలని.
షణ్ముఖం తన కొడుకు, భార్య ఇతర బంధువులతో టాక్సీ ఎక్కి స్పీడుగా విజయవాడ వైపు వెళుతున్నా డు. రమారమీ 20 సంవత్సరాల నుండి తన కొడు కుకు సంబంధం గురించి ఈ విధంగా తిరుగుతూనే ఉన్నాడు షణ్ముఖం.
ఏ సంబంధానికి వెళ్లిన ఏదో మైనస్.. అసంతృప్తి. పిల్లపొట్టి అని, రంగు తక్కువ అని, కులం, గోత్రం తేడాగా ఉన్నాయని, బాగా లేనివాళ్లు అని, చాలా దూర ప్రాంతం అని, చదువు తక్కువ అని, పిల్ల తల్లి తండ్రి అందంగా లేరని, అన్నీ కుదిరితే జాతకం బాగో లేదని, కట్నకా నుకల విషయం సరిగాలేదని, పెళ్లికి బలమైన ముహూర్తబలం లేదని ఇలా రకరకాలు ఆలోచనతో ఆ భార్యాభర్తలు సంబంధం కుదర్చ లేకపోతున్నారు. రెండు మూడు సంబంధాలు ముహూర్తాల వరకు వచ్చి ఆగిపోవడం మళ్లీ సంబం ధాల కోసం దండయాత్ర. ఇది ఎప్పటికీ తరగని సీరి యల్లా కొనసాగుతూనే ఉంది.
20 ఏళ్ల క్రితం మొట్టమొదటి సంబంధానికి వెళ్లేటప్పు డు కూడా అప్పట్లోనే ఇంటింటికి చనువుగా తిరు గుతూ పువ్వులు అమ్ముకునే ఈ సికాకుళమే ఇదే రకంగా అప్పుడు కూడా అన్నమాట గుర్తొచ్చింది ప్రస్తుతం కారులో జారబడి సంబంధం కోసం విజ యవాడ వెళుతున్న షణ్ముఖానికి.
ఊరందరితో చనువుగా ఉండే సికాకుళం అప్పట్లో ఒకప్పుడు షణ్ముఖం దగ్గరకు వచ్చి, ''బాబాయ్ గారు, మీ పేరు నాకు నోటికి తిరగదు కానీ అయ్యా చిన్ని మాట వినండి.. ఈ వీధిలో రోడ్డుకి అవతల ఎలక్ట్రిక్ స్తంభం దగ్గర ఇల్లు ఉంది చూడండి అదే.. మీ దోస్త్ సత్యేం ద్రప్రసాద్ గారి అమ్మాయి బుజ్జమ్మ ఉంది కదా. బోల్డంత చదువుకుంది. బాగుంటుంది. మీలా గే బాగా ఉన్నవాళ్లే. మీ కులమే కదా.. ఆ అమ్మాయి ని మన అబ్బాయి గారికి చేసుకుంటే బాగుంటుందే మో'' అన్నాడు.
ఆ మాటలు విన్నాక షణ్ముఖం.. ఎదురింటి సంబం ధమా వద్దులే అంటూ తన కనురెప్పలు రెండు బాగా పైకి సాగదీసి పెదాలు కూడా పక్కలకు బాగా విడ దీసి ఒకసారి కనురెప్పలు మూసుకొని వదిలాడు. అతని భార్య సావిత్రి కూడా అది మనకు కుద రదు.. అంది.
సికాకుళం వాళ్ళిద్దరూ ఎందుకు అలా అంటున్నారో తన బుర్రకు ఏ మాత్రం అర్థంకాక మిన్నకుండి పో యాడు. పువ్వులు ఇస్తున్నప్పుడు అలా చాలా సార్లు చెప్పాడు కానీ ఆ భార్యాభర్తలు వినబడనట్లు గానే మసులుకొనేవారు.
ఇప్పుడు.. కారులో ఉన్న షణ్ముఖానికి అలాంటి విషయాలు అన్ని గుర్తు వచ్చి తన కనురెప్పలు బాగా పైకి సాగదీసి పెదాలు కూడా పక్కలకు బాగా విడదీసి ఒకసారి కళ్ళు మూసుకొని వదిలాడు.
ప్రస్తుతం టాక్సీ.. తన కొడుకు అమర్నాథ్ పెళ్లి సంబంధానికి విజయవాడ వెళ్లడం విషయంలో హడావిడిగా దూసుకుపోతుంది.
షణ్ముఖం లాగే సత్యేంద్రప్రసాద్ కూడా బిజినెస్ మ్యాగ్నెట్. ఎడతెరిపి లేని వర్షం పడుతున్నట్టు 20 సంవత్సరాలు నుండి అతను కూడా తన కూతురికి సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. తన కూతురు తోటి అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు పుట్టి ఆ పిల్లలకు రజస్వల కార్యక్రమాలు కూడా అయిపోవడం.. ఆ కార్యక్రమాలకు తమ కుటుంబ సైతంగా వెళ్లి రావడం సత్యేంద్రప్రసాద్ కు కొంచెం బాధగానే ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. సత్యేంద్రప్రసాద్ అతని భార్య సరస్వతమ్మ కూడా రాబోయే అల్లుడు విషయంలో రకరకాల గేటులు పెట్టేసుకున్నారు వందరకాలుగా. రాబోయే అల్లుడు, వారి కుటుంబం.. తమకు సరిపోవాలి అనే గాడిలో ఉన్న వాళ్ళిద్దరూ ఏ సంబంధాన్ని కుదుర్చు కోలేక పోతున్నారు.
20 ఏళ్ల క్రితం సత్యాంద్రప్రసాద్, అతని భార్య సరస్వతమ్మ ఒకనాడు పార్కులో కూర్చున్నప్పుడు ఆ లోపలే పూలు అమ్ముతున్న సికాకుళం తనకు ఉన్న పరిచయం తో వాళ్లను సమీపించి కొంచెం దూరంగా నిలబడి నెమ్మదిగా.. వాళ్ల ఎదురింటి షణ్ముఖం గారి అబ్బాయి గురించి ఇలా అన్నాడు.
''పెసాదంబాబు గారు.. మీరు కోప్పడనంటే ఒక్క మాట.. అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉన్న మీ ఎదురింటి షణ్ముఖంగారి అబ్బాయిని కుదుర్చుకుం టే ఒక పని అయిపోతుందికదా '' అంటూ అన్నాడు.
సత్యేంద్రప్రసాద్ కాసేపు తల గోక్కుని ముక్కు సరి చేసుకుంటూ పైకి లేచి నిలబడి సికాకుళం వైపు పిచ్చి వాడిని చూస్తున్నట్టు చూసి వికటంగా నవ్వి
''ఎదురింటి సంబంధమా ఎందుకులే..'' అంటూ వెళ్లి పోయాడు. అతని భార్య కూడా అలాగే అంది.
అయినా అప్పుడప్పుడు సికాకుళం ఆ విషయం గురించి సత్యేంద్ర ప్రసాద్ సరస్వతములకు చెబు తూనే ఉన్నాడు.. 20 ఏళ్ల నుండి.
అలా వాళ్ల అమ్మాయికి సంబంధం చూడడం మొదలు పెట్టి 20 ఏళ్లు గడిచిపోయాయి సత్యేంద్ర ప్రసాద్ దంపతులకు.. కూడా.
***
ప్రస్తుతం
షణ్ముఖం పార్కులో తూర్పు మూల బల్ల మీద నీర సంగా కూర్చుని పల్లీలు తింటున్నాడు. పార్కులో పడమర మూల కూర్చుని పల్లీలు తింటున్న సత్యేం ద్రప్రసాద్ మరింత నీరసంగా నడుచుకుంటూ నెమ్మ దిగా ఈ పక్కకు వచ్చాడు.
"ఏమయ్యా షణ్ముఖం ఆ పల్లీలు అతను ఇలా వచ్చాడా?" అంటూ అడిగాడు.
"అదేంటి నీ దగ్గర నుంచే వచ్చేడట కదా నీకు కూడా పల్లీలు ఇచ్చాడట కదా. ఇలా కూర్చో" చోటు చూపిస్తూ అన్నాడు షణ్ముఖం.
"ఇచ్చాడు. మళ్లీ తీసుకుందామని వచ్చాను. 20 ఏళ్ల నుండి నాకు ఆ పక్కనే కూర్చోవడం అలవాటై పోయింది. ఇక్కడ కూడా చల్లగానే ఉంది"
"నేను కూడా చాలా సార్లు ప్రయత్నించాను నువ్వు కూర్చుండే ఆ పడమర బల్ల వైపు వద్దామని. కానీ ఏదో ఇలా అలవాటైపోయి నువ్వు అన్నట్టు 20 సంవత్సరాల నుండి ఇక్కడే గడిచిపోతుంది. "
"సరే ఇలా కూర్చుంటానే నీ పక్కగా. ఏమిటో ఎదు రెదురు ఇళ్లల్లో ఉన్నా 20 సంవత్సరాలు అయిపో యింది మనమిద్దరం మాట్లాడుకుని." కూర్చుంటూ అన్నాడు సత్యేంద్ర ప్రసాద్.
"ఈ బల్ల నాది కాదు కదా కూర్చో." నవ్వుతూ అన్నాడు షణ్ముఖం.
" జోకులు వేయడం ఇంకా మానలేదు నువ్వు. అవును మీ అబ్బాయి సంబంధాలు ఎంత వరకు వచ్చాయి?"
"నీకు తెలియందేముంది. ఒకటి కుదిరితే ఒకటి కుదరడం లేదు. ఎందుకూ పనికిరాని సంబంధాలు. ఖర్చు లెక్క పెట్టుకుంటే గడచిన 20 ఏళ్లలో పెళ్లి సంబంధాలుగా తిరగడానికి ఐదు లక్షల అయింది. నాకు వయసు అయిపోతుందేమో ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. ఓ పక్క సంబంధం కుదరటం లేదన్న మానసిక వేదన. చచ్చిపోవాలని ఉంది. మొన్న అమ్మాయి బాగుంది సంబంధం కుదిరిపోతుంది అనుకున్నాను. తీరా చూస్తే ఆ అమ్మాయికి పన్ను మీద పన్ను. మీ చెల్లాయి మన వాళ్ళల్లో ఎవరు అలాలేరు వద్దు బాబు అంది''. అన్నాడు షణ్ముఖం తిరిగి తిరిగి కాళ్ళు లాగినవాడిలా కాళ్లు నిమురు కుంటూ.
"అలాగే నాకు కూడా జరిగింది మేము సంబంధా లకు వెళ్లిన చోట ఆ అబ్బాయికి 75 వేలు జీతమట. వాళ్లు గొప్పగా ఉంటుందని లక్ష అని చెప్పుకుంటున్నారు. ఇదేమిటని అడిగితే మార్చి నుండి పెరుగుతుంది అన్నారు. మీ చెల్లెమ్మ.. వాళ్ళు అబద్ధం చెప్పారని ఆ సంబంధం వద్దు అంది. మా అమ్మాయి కి సంబంధం కుదిరే లోపల ప్రాణం పోయే లాగుంది. నాకు కూడా నీలాగే 5 లక్షలు ఖర్చు అయింది. ఇలాంటివి చెప్పాలంటే లక్ష ఉన్నాయి. వెయ్యి అబద్దాలు ఆడి పెళ్లి చేయమన్నారు కరెక్టుగా అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. అబద్ధాలు ఆడితేనే కానీ పెళ్లిళ్లు చేయలేమేమో.
నీకు నిజం చెబుతా. ఇంటికి ఎదురుగుండా ఉన్నావు ఇందులో తప్పేముంది.. మొన్న ఏమైంది అంటే మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇద్దరు వయ సు సమానంగా ఉంది. వాళ్లు ఒప్పుకోరు కదా. దాంతో మా అమ్మాయి వయసు రెండు సంవత్స రాలు తక్కువ ఉన్నట్టు ఇంకొక బయోడేటా తయా రు చేయించి పంపించాను. అన్ని మాట్లాడేసు కున్నాం. ముహూ ర్తాలు పెట్టుకునే టైంలో వాళ్లకు నిజం తెలిసిపోయి క్యాన్సిల్ చేసేసారు. తప్పు నాదే కదా.. నోరు మూసుకొని వచ్చేసాను'' నిట్టూరుస్తూ అన్నాడు సత్యేంద్ర ప్రసాద్.
"ఇలాంటివి నాకు కూడా చాలా జరిగాయి. నేను కూడా మా అబ్బాయికి మొన్న ఒక సంబంధం ఫిక్స్ చేసుకునే లెవెల్ కి వెళ్ళిపోయాను. కానీ పెళ్లి జరగడం కోసం నీలా నేను ఆడిన చిన్న అబద్ధం ఆ సంబంధాన్ని చెడగొట్టింది. సరే, మనవి మంచి కుటుంబాలు కనక మన పిల్లలు ఇప్పటి వరకు లేచిపోలేదు, అందుకు సంతోషిద్దాం. ''
''సంతోషించడం కాదు. అనవసరపు భేషజాలకు, అహంభావాలకు, అతిచాదస్తాలకు పోయి మనిద్దరం మన పిల్లల పట్ల పెద్ద తప్పు చేశాం.''
''వాళ్ళ యవ్వన జీవితాలను గుర్తించలేకపోయాం.''
''ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మనిద్దరం ఒక అడుగు ముందుకు వేద్దాం.''
''అవును.. నీకు చెప్పాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఐదు సంవత్సరాల క్రితం మా సిద్ధాంతి గారికి మీ అబ్బాయి జాతకం వేరే వాళ్ల దగ్గర సంపాదించి చూపించాను. మీ అబ్బా యికి మా అమ్మాయికి కరెక్ట్ గా సరిపోతుందట. " తెగ ఆనందపడిపోతూ చెప్పాడు సత్యేంద్రప్రసాద్.
"నేను పది సంవత్సరాల క్రితమే చూపించాను మీ అమ్మాయి జాతకం. బాగా కుదిరిందట ఇద్దరికీ. నీతో అందామంటే ఏమిటో అలా గడిచిపోతుంది. ఏ.. నీకు ఏమైనా ఉద్దేశం ఉందా?" మరింత ఆనందంగా అడిగాడు షణ్ముఖం.
"అలా అంటున్నావ్ గాని నీకు మాత్రం ఆ అభి ప్రాయం లేదా. సరే ఒకసారి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తే సరి "
"పెళ్లి చూపుల.. ఇంకా నయం రోజుకు 90 సార్లు ఒకరి నొకరు చూసుకుంటున్నారు. మాట్లాడుకుంటు న్నారు. మా అబ్బాయిని ఇదివరకు ఎప్పుడో మీ అమ్మాయి గురించి అడిగితే నాకు ఇష్టమే అన్నాడు ఏంటో మరి. "
"ఐదేళ్ల క్రితం మా ఇంట్లో మాట్లాడుకుంటునప్పుడు మీ అబ్బాయిని చేసుకోవడానికి మా అమ్మాయి కూడా బాగా ఇష్ట పడింది. "
"శుభం.. ఈ సంవత్సరంలో ఇంకా ఒకే ఒక మంచి ముహూర్తం ఉందట రేపు 20వ తారీకున. అది తప్పితే మళ్లీ సంవత్సరం వరకు ముహూర్తాలే లేవట. అంటే ఇప్పటికి పది రోజులు టైం ఉంది. సరిపోతుంది. డబ్బులు ఉంటే ఎంతసేపు ఈరోజుల్లో.. నడు ఆ పని మీద ఉందాం'''
"మరి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు.. ?"
"ఇప్పటికే వెధవ ఈగోలకు పోయి పిల్లల ఇద్దరి యవ్వన జీవితాలు నాశనం చేశాము. ఇంకా ఈ వెధవ గోల ఎందుకు. నువ్వు ఇచ్చినంత.. ఇవ్వక పోయినా పర్వాలేదులే. "
"చూసుకో.. నువ్వు అనుకున్న దానికి నాలుగు రెట్లు చేస్తాను నేను. "
***
10 రోజుల తర్వాత
దగ్గరలోని సిటీలో ఫైవ్ స్టార్ హోటల్లో అమర్నాథ్, బుజ్జమ్మల పెళ్లి ఘనంగా జరుగుతుంది. గేటు బయట వందలాది కార్లు, మోటార్ సైకిళ్ళు..
అదిగో అప్పుడే స్పీడుగా సైకిల్ మీద వచ్చి తన బుట్టలో 20 మూరల మల్లెపూల దండలతో లోపలికి వెళ్లాలని ప్రయత్నించాడు సికాకుళం. వెళ్ళనివ్వ కుండా అడ్డుకున్నారు కాపలావాళ్ళు.
పెళ్లి పూర్తయి జనం అందరూ వెళ్ళిపోయి ఆ ప్రాంతం నిర్మానుష్యం అయిపోయింది. అయినా ఇంకా అక్కడే రోడ్డు అవతల తన బుట్టలో వాడి పోయిన మల్లెపూదండలను చూసుకుంటూ అలగా మనిషిగా నిలబడ్డాడు తన సైకిల్ పట్టుకొని సికాకుళం.
''వాళ్లకు పుట్టిన పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడవలసిన వయసులో.. పాపం.. వాళ్ళిద్దరకూ పెళ్లి చేశారు వాళ్ళ పెద్దలు''. అనుకున్నాడు మనసులో.
వయసు ముదిరిపోయాక పెళ్లి అయిన ఆ కొత్త జంటను తలచుకుని అక్కడ తెగ బాధపడేది సికాకుళం ఒక్కడే!
****
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
@gayatritokachichu6450
• 12 hours ago
పెళ్లి సంబంధాలు 20 ఏళ్ళు చూశారనకుండా ఐదేళ్లు పెట్టాల్సింది. కథ బాగుంది.