top of page
Original.png

వైభవ్ టవర్స్

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #VaibhavTowers, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Vaibhav Towers - New Telugu Story Written By Veereswara Rao Moola Published In manatelugukathalu.com On 19/01/2026

వైభవ్ టవర్స్ - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల

ఆ రోజు ఆదివారం.

మా వైభవ్ టవర్స్ సెక్రటరీ వామనరావు నుండి ఫోన్ వచ్చింది..

"వెంకట్, మూడు గంటలకు మీటింగ్ కు వచ్చెయ్యి" అన్నాడు.


"నేను రాను"


"అసలే అటెండెన్స్ తక్కువ గా ఉంది. నువ్వు కూడా రాక పోతే ఎలా?" 

 

"నా సమస్య లు పరిష్కారం కావడం లేదు. నేను రాను"


"ఈ సారి నీ సమస్య కే ప్రాధాన్యత. రా బాబూ"


 *******

వామనరావు మీటింగ్ ప్రారంభించి అందరికీ డ్రాప్ టీ పంచిపెట్టాడు. డ్రాప్ టీ అంటే గుటక పూర్తిగా పడని "టీ". 

పిసినారి సన్నాసి అని అందరూ వామనరావు ని తిట్టుకున్నారు. 

 B 304 నుండి సింగ్ గారు లేచారు. 

" నీ సమస్య ఏమిటి? "


" నాకు ఎదురుగా సముద్రం ఉంటుందని అపార్ట్ మెంట్ అమ్మారు. సముద్రం లేదు. ‘సీ వ్యూ’ లేదు." C" బ్లాక్ ఉంది”. 


"వచ్చే ఏడాది మా వామనరావు సముద్రం తవ్విస్తాడు లే, బాధ పడకు" అన్నాను. 


వామనరావు నాకేసి గుర్రుగా చూసాడు. 

"ఇదేమన్నా నుయ్యా తవ్వడానికి" అని 303 నైటీ మాలిని సాగదీసింది. మాలిని రెండు నైటీలు, ఒక చీర తో ఏడాది అంతా గడుపుతుంది. 


వామనరావు గొంతు సవరించుకుని ఇలా అన్నాడు. 

"మా మార్కెటింగ్ వాళ్ళు మాయ మాటలు చెప్పారు. మరీ "sea view" అని పట్టుపడితే ఒక పని చేస్తాను. సముద్రం హోర్డింగ్ పెట్టిస్తా. దానిని చూస్తూ మీ ఉదయాన్ని ప్రారంభించండి "


సింగ్ కి విషయం అర్థం కాక తల గోక్కుంటూ కూర్చున్నాడు. 

తరువాత 303 మాలిని లేచింది. 

" నా కారుకు పార్కింగ్ ఎలాట్ చెయ్యలేదు. ఎక్కడో పచ్చగడ్డి పెరిగిన జనరల్ పార్కింగ్ ఇచ్చారు" అని ఫిర్యాదు చేసింది. 


"పార్కింగ్ కి విపరీతమైన పోటీ ఉంది. కొన్నాళ్ళు సర్ధుకోండి. జనరల్ పార్కింగ్ ఈశాన్యం వైపు ఉంది. అది ఓనర్స్ కి వాస్తు ప్రకారం లాభం." 


"అక్కడ పెడితే నా కారుని దొంగాడు ఎత్తుకు పోయాడు." అంది మాలిని విచారంగా.

 

"ఈశాన్యం దొంగాడికి కలిసివచ్చింది." అన్నాను. 


వామనరావు మళ్ళీ కింగ్ సినిమా బ్రహ్మానందం లా చూసాడు. 

" తరువాత వారు సమస్య ని చెప్పుకోవచ్చు. " అన్నాడు వామనరావు ఉత్సాహం గా. 


"ఏమిటి చెప్పమంటారు. వారం రోజులనుండి గొట్టాల లీక్ గోల పెడుతున్నా. పై వాళ్ళ దరిద్రం వాసన నా బెడ్ రూమ్ లోకే " అని నేను గట్టిగా అరిచాను. 


"బాబూ వెంకట్, ఇప్పుడే ప్లంబర్ ని లైన్ లో పెడతాను" 

అని వామనరావు ఫోన్ చేసాడు. 

ఐదు నిమిషాలయ్యాక చెప్పాడు. 

"ప్లంబర్ భార్య కి రీల్స్ పిచ్చి. అదే రీల్స్ పిచ్చి ఉన్న ఇంకొకడి వలలో పడి ఏటో వెళ్ళిపోయింది. భార్యను వెతుక్కుంటూ మన ప్లంబర్ ఏటో వెళ్లి పోయాడు." 

సమస్య ని వివరించాడు. 


"వెంకట్ ఒక పనిచెయ్యి. నువ్వు నా అపార్ట్ మెంట్ కి వచ్చెయ్యి. నా భార్య పుట్టింటికి వెళ్లింది. గొట్టాలు బాగుపడ్డాక నీ పాత చోటుకి పోదువు గాని. "


"రావడానికి నాకు అభ్యంతరం లేదు. కాని గురక పెడతాను కదా"


"భరిస్తాను. తగలడు" అన్నాడు వామనరావు పళ్ళు కొరుక్కుంటూ.


 *******

406 లో ఉన్న నంబియార్ లేచి "నా అపార్ట్ మెంట్ కి దగ్గరగా చెట్టు ఉంది" అని మొదలు పెట్టాడు.

 

"చూసావా? చక్కటీ గాలి చెట్టు నుంచి వస్తుంది" అని వామనరావు ఉత్సాహం గా అన్నాడు. 


"పూర్తి గా వినండి. చెట్టు మీద కోతి ఉంది. అది సరాసరి నా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్ఛి నా మొబైల్ ఎత్తుకు పోయి గార్డేన్ లో పడేసింది"


"అదే మరి ఒక చిన్న అరటి గెల కొని అలా చెట్టు కొమ్మ ల్లో పడేశావు అనుకో కోతి నీ జోలికి రాదు "


"వాళప్పళం రొంబ కాస్ట్లీ" 

"సర్లే చెట్టు కొమ్మలు కొట్టించే దాక సర్ధుకో. "


 ******

 

వామనరావు ఇంక సమస్యలు అడగాకుండా ప్రకటన చేసాడు. 

"వైభవ్ టవర్స్ లో ఉండే వాళ్ళు ప్రతీ నెల మొదటివారం లో మెయింటెనెన్స్ డబ్బులు కట్టండి. పెట్ ల విషయం లో జాగ్రత్తలు పాటించండి. రాత్రి పదిగంటల లోపే లోపలికి వచ్చేయండి. కుటుంబ సభ్యుల్లా కలిసిఉండండి" 


"అలా అన్నందుకు 206 లో సన్నాసి రావు బావగారూ రెండువేలు ఇవ్వండి అని ఏడాది క్రితం తీసుకున్నాడు. ఇప్పటికి ఇవ్వలేదు " అన్నాను విసుగ్గా. 


"మరొక శుభవార్త! వచ్చే దసరా కి మన వైభవ్ టవర్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సంగీతం, సాహిత్యం, నాట్యం, మృదంగం, వీణ వీటిల్లో ప్రవేశం ఉన్నవారు పేరు ఇవ్వచ్చు. "


"లాస్ట్ ఇయర్ మన మన్మధరావు మృదంగం వాయిస్తే, ఇద్దరు హార్ట్ పేషంట్ లు స్పాట్ లో లేచిపోయారు" 


"బి పాజిటివ్, వెంకట్ " అన్నాడు వామనరావు ఆయాసంగా.

 

" సరే ". 


ఆ తరువాత 602 లో ఉన్న షీలా, 

"నీకు నాకు ఉన్న లింకు ఈడనో ఆడనో చెప్పలేను. గౌలిగూడా...." 

పాట అందుకుంది వామన రావు కి దగ్గరగా వచ్చి.

"అమ్మా, షకీలా నీ ప్రతిభ ఆనక చూపిద్దువు కాని. 

 ప్రస్తుతం పేరు ఇచ్చి కూర్చో " అన్నాడు వామనరావు గాబరాగా. 


"మరిన్ని మెరుగైన సేవలతో మీ ముందుకు వస్తామని వాగ్ధానం చేస్తూ, ఈ మీటింగ్ ఇంతటితో ముగిస్తున్నా."

"ఇవే తగ్గించుకుంటే మంచిది." అన్నాను. 


వైభవ్ టవర్స్ లో ఉండేవాళ్ళందరికీ మళ్లీ మీటింగ్ డేట్ విషయం లో ఏకాభిప్రాయం కుదిరింది. 

కర్రా విరగకుండా, పాము చావకుండా సమస్య లను తిప్పడం లో ఆరితేరిన చెయ్యి అని వామనరావు

మరోసారి ఋజువు చేసుకున్నాడు. 

సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page