వైద్యో నారాయణో హరిః
- Neeraja Prabhala

- Jul 4
- 1 min read
Updated: Jul 6
#TeluguArticle, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #VaidyoNarayanoHari, #వైద్యోనారాయణోహరిః

Vaidyo Narayano Hari - New Telugu Article Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 04/07/2025
వైద్యో నారాయణో హరిః - తెలుగు వ్యాసం
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
విద్వత్తుని ఎరిగి చేసే సేవ వైద్యం.
“వైద్యో నారాయణో హరిః” అన్నది అక్షరాలా యదార్థం వైద్యులకు. తన మాటలతో, ఆదరణతో రోగుల సగం బాధ తొలగించే ఆప్తుడు వైద్యుడు.
తన ప్రజ్ఞాపాటవాలతో రోగుల నాడిని శోధించి వైద్యంతో వాళ్ల ప్రాణాలను నిలబెట్టే ప్రాణదాత వైద్యుడు. రోగుల హృదయ స్పందన తెలిసి మంచి వైద్యం చేసే పునర్జన్మ ప్రదాత వైద్యుడు. తన వైద్యంతో రోగుల మానసిక, శారీరక బాధలను పోగొట్టే ధన్వంతరే వైద్యుడు.
వేయి మాటలేల? వేయి రూపాలేల?
దైవమే వైద్యుల రూపంలో అవతరించినాడన్నది యదార్ధం.
ఎక్కడ వైద్యులు ఉంటే అక్కడ రోగుల దరిచేరడానికి మృత్యుదేవతకి భయం.
“శతమానం భవతి.. “ అనే దైవ సూక్తి వైద్యులకే చెల్లు.
కడదాకా తన శక్తినంతా ధారపోసి రోగుల ప్రాణాలను రక్షించే దైవం వైద్యులు. వైద్యులు నిండునూరేళ్లు చిరంజీవిగా ఉండాలని కోరుకుందాం.
“హ్యాపీ డాక్టర్స్ డే!” అని ఈ ఒక్క రోజే (01/07/2025) కాదు. ప్రతిరోజూ చెపుదాం. వైద్యనారాయణులకు భక్తితో, కృతజ్ఞతతో నమస్కరిద్దాం. 🙏

-నీరజ హరి ప్రభల




Comments