top of page
Original.png

వందనాలు! అభినందన చందనాలు!

#గోపరాజువెంకటసూర్యనారాయణ, #వందనాలు! అభినందన చందనాలు!, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

భారత సాయుధ దళాల పతాక దినోత్సవం

Vandanalu Abhinandana Chandanalu- New Telugu Poem Written By Goparaju Venkata Suryanarayana Published In manatelugukathalu.com On 07/12/2025

వందనాలు! అభినందన చందనాలు! - తెలుగు కవిత

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ


జోహార్లు నీకివే వీర జవానా!

జేజేలు నీకివే శూర సైనికా!!

 జో “

శత్రు సైన్యము నిలువరించగ

ముష్కరమూకల పీచమణచగ

దేశ సరిహద్దుల కాపు గాయగ

జాతి గౌరవం రక్షణ చేయగ

సర్వధా సన్నద్ధమై యుండురక్షకా!

 జో “

గగన తలమున వాయు సేనగ

సాగర తీరాల రక్షణకు నౌకాసేనగ

కదన రంగాన పదాతి దళముగ

త్రివిధ రంగాల మేల్ భళాయనంగ

శత్రు దాడిని తిప్పికొట్టే దేశ సేవికా!

 జో “

మరువ లేనిది మొక్కవోనిది నీదు దేశభక్తి!

యుద్ధభూమిని వెన్నుచూపని నీదు నియతి!

నిలిచిపోవును చరితలో నీదు త్యాగ నిరతి!

ఉజ్వలమై వెలుగు భువిని నీదు ఘనకీర్తి!

శత్రు సీమలపై పంజా విసిరే నీ ఘనయుక్తి!!

 జో “

         @@@@@@@@

గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

 ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు! 




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page