top of page
Original.png

వందనం! అభివందనం!!

#VandanamAbhivandanam, #వందనంఅభివందనం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #కార్గిల్

ree

 26 జూలై కార్గిల్ యుద్ధ అమర వీరులకు అశ్రునివాళి

Vandanam Abhivandanam- New Telugu Poem Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 26/07/2025

వందనం! అభివందనం!! - తెలుగు కవిత

రచన: కందర్ప మూర్తి


 భారత సాహస సైనికా! వందనం-అభివందనం!!

******************************

 సాహస భారత సైనికా! వందనం నీకు!!

 భరతమాత రక్షణలో దేశ సరిహద్దులను

 రాత్రింబవళ్లు డేగ కన్నులతో శత్రు మూకల

 దాడి నుంచి రక్షించే నీది ఉద్యోగం కాదు

 ప్రాణాలను ఫణంగా పెట్టె విద్యుక్త కర్తవ్యం


 నూనూగు మీసాల యవ్వనంలొ సైనికుడిగ

 అడుగిడి సుదీర్ఘ సేవల అనంతరం పదవీవిరమణ

 పొంది నెరసిన జుత్తుతో ముదుమి వయసులో 

 ఇంటికి వచ్చే నీ త్యాగనిరతి ప్రశంసనీయం సైనికా!


 ఎముకలు కొరికే హిమాలయ మంచు సానువుల్లొ

 రక్తం మరిగించే ఉష్ణోగ్రతల ఇసుక ఎడారిలో

 ఆకాశాన్ని అంటె మహా పర్వత శ్రేణుల్లో

 పగలే చీకటిని తలపించే దట్టమైన చిట్టడవుల్లో

 ఊపిరి అందని హిమాలయ శిఖరాగ్రంలో

 నిరంతరం గడ్డకట్టే నీటిసరస్సుల అంచుల్లో

 తాగే నీరు కాదు తినే తిండి దొరకని గమ్యస్థానాల్లో

 తారీఖు ఏదో రోజు ఏదో తెలియని బంకర్లలో

 విధులు నిర్వర్తించే ఓ సాహస సైనికా అభివందనం నీకు


 ముష్కరులు దేశ సరిహద్దులు దాటి అమాయక

 జనాలను కర్ఖశంగా చంపిన వేళ ఆపరేషన్ సింధూర్ తో

 నీ సాహస వీర చర్యలతో దేశ సరిహద్దులు దాటి

 టెర్రరిస్టుల మూలాలను మట్టుపపెట్టిన నీ ధైర్యానికి సాటిలేదు

 యుద్ధ సమయంలోనే కాదు వరద భూకంప భీబత్సం, 

 జల ప్రళయం,  అగ్ని కీలల జ్వాలాముఖిలో

 ఆటంకవాదుల ఏరివేతలో నీ కర్తవ్యం మరువలేనిది

 

 కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రాంతాలు మారినా 

 భాషలు వేరైనా క్రమశిక్షణ బంధంతో జాతీయ జండా ఛాయలో

 దేశ రక్షణ ధ్యేయంగా కుటుంబ సబ్యులకు కడు దూరంగా

 కొండకోనల్లొ ఇసుక ఎడారుల్లొ మంచు పర్వత శిఖరాల్లో

 శత్రు మూకల కట్టడిలొ నీ సాహస జీవితం అమోఘం సైనికా!


 దేశ ప్రజలు నిశ్చింతగ నీ గొడుగు నీడలో నిదురిస్తు

 ఊపిరి పీల్చుకుంటున్నారంటె మీ రక్షణే వారికి కవచం. 

 నీ సాహస ధైర్యచర్యలకు,  త్యాగనిరతికి,  వందనం! అభివందనం!!

 సమాప్తం

 

 26 జూలై కార్గిల్ యుద్ధ విజయోత్సవం

 రచన : కందర్ప మూర్తి



 *** *** ***

 

ree

కందర్ప మూర్తి

 

Comments


bottom of page