వారికి బదులు మాకు
- Mohana Krishna Tata

- Jan 28
- 3 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #VarikiBaduluMaku, #వారికిబదులుమాకు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Variki Badulu Maku - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 28/01/2026
వారికి బదులు మాకు - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"సర్! మీకు ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సర్.." అన్నాడు పీఏ.
"మనం చేస్తున్న మంచి పనులు చూసి వచ్చిన ఉత్తరాలేమో"
"ఏమో సర్..ఇవన్నీ చూస్తే, మగవాళ్ళు రాసినవే...చదవనా సర్?"
"చదువు.."
"సర్ కి నమస్కారాలు..
"మీరేమో ఫ్రీ బస్సు అని ఆడవారికి పథకం పెట్టారు. మేము ఇలా ఆఫీస్ కు వెళ్ళగానే, ఆధార్ కార్డు పట్టుకుని మా ఇంట్లో మా ఆవిడ ఏ చిన్న పని ఉన్నా సరే, అనవసరంగా బస్సు ఎక్కి..టైం వేస్ట్ చేస్తున్నాది"
"బస్సుల గురించి అన్నమాట!"
“మొన్నటికి మొన్న బస్సు ఎక్కి, ఒళ్ళు నొప్పులని వంట చెయ్యకుండా మా ఆవిడ పడుకుంది..నేను వండుకోవాల్సి వచ్చింది. నెలలో ఇలా చాలా రోజులు జరుగుతుంది. మరో రోజు, బస్సు లో ఉన్న రష్ కు చీర చింపుకుని వచ్చింది. "ఎందుకే వెళ్లడం" అని అంటే.. "మాకు మాత్రమే ఇచ్చిన ఈ ఆఫర్...వాడుకోకపొతే ఎలా చెప్పండి..? మీకు లేదని బాగా కుళ్ళు" అంటూ చెడా మడా తిట్టేసింది
"ఏమైనా అంటే, "మాకు బస్సు ఫ్రీ కదండీ...వాడుకోకపోతే ఎలా?" అంటోంది,
మరొక ఉత్తరంలో...
"మా ఆవిడ ఇంటి పక్కన ఫ్యాన్సీ స్టోర్స్ ఉన్నా..చార్మినార్ వెళ్లి జత గాజులు, కోటి వెళ్లి షాపింగ్ చేసి వస్తాను..డబ్బులు ఇమ్మని ఒకటే గోల! షాపింగ్ లేనప్పుడు మా అమ్మ ఇంటికి పోయి, అక్కడ కబుర్లు చెప్పుకుని వస్తాను అంటుంది. మాకేమో చారు అన్నం పెట్టి...మా ఆవిడ పుట్టింటికి పోయి తిని వస్తున్నాది సార్.."
"ఏమైనా అంటే, "మాకు బస్సు ఫ్రీ కదండీ...వాడుకోకపోతే ఎలా?" అంటోంది,
మరొక ఉత్తరం...
సార్! మొన్న మా ఆవిడకు ఫోన్ చేస్తే ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళావని అడిగా.. "మా అమ్మ వొడియాలు పెట్టింది. చుట్టడానికి రమ్మంది. పాపం ఒక్కర్తే చేసుకోలేదుగా.. అందుకే వెళ్ళాను"
"ఎక్కడో ముప్పయ్ కిలోమీటర్లు అవతల ఉన్న మీ అమ్మకోసం ఇక్కడ ఇంట్లో పనులు మానుకుని వెళ్తావా?"
"దానికోసమే కాదండీ..! ఆ పక్కనే షాప్ లో డిస్కౌంట్ ఆఫర్ ఉందంటేను...అక్కడకు వెళ్లి నాలుగు చీరలు తెచ్చుకున్నా.."
"చీరలు ఫ్రీ ఇవ్వట్లేదుగా... బస్సు మాత్రమే ఫ్రీ కదా!"
"అవునండి బస్సు చార్జీలు ఒక వంద మిగిలాయి..చూసారా నా తెలివి?"
"చీరలు ఎంత అయ్యయో?"
"ఒక వెయ్యి.."
"వెయ్యి క్షవరం"
ఏమైనా అంటే, "మాకు బస్సు ఫ్రీ కదండీ...వాడుకోకపోతే ఎలా?" అంటోంది,
ఇంకొక ఉత్తరం చదువుతాను సర్...
ఒకసారి ఉదయం బయటకు వెళ్ళిన మా ఆవిడ సాయంత్రానికి గానీ రాలేదు. అప్పటికే నేను ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి ముందు చాలా సేపటినుంచి వెయిట్ చేస్తున్నా. మొత్తానికి ఒక పెద్ద బ్యాగ్ సామానులతో వచ్చింది.
"ఎక్కడకు వెళ్ళావు సురేఖా?"
"కిరాణా సామానులు కోసం వెళ్ళాను"
"కిరాణా షాప్ పక్కనే ఉందిగా...రోజంతా పట్టిందా?"
"అదా..! సిటీ లో పెద్ద షాప్ కి వెళ్ళాను. అక్కడైతే సరుకులు చాలా చవుక. ఒక రెండు వందలు మిగిలాయి తెలుసా? నా లాంటి తెలివైన పెళ్ళాం దొరకడం మీ అదృష్టం"
"మరి ఈ ఐదొందల బిల్ ఏమిటి?"
"మధ్యలో దాహం వేస్తే, ఎండాకాలం కదా, కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఖర్చులు"
"మొత్తానికి నష్టం..ఇంటిపక్కన ఉన్న కిరాణా షాప్ లో కొనకుండా...ఎక్కడికో వెళ్లి డబ్బులు తగలేసావు. ఇంటి పక్కన తెచ్చుకుంటే, డబ్బులు మిగిలేవి, టైం మిగిలేది..నా టైం కూడా వేస్ట్ చేసేసావు"
"ఏమైనా అంటే, "మాకు బస్సు ఫ్రీ కదండీ...వాడుకోకపోతే ఎలా?" అంటోంది,
ఈ ఫ్రీ బస్సు వలన, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. వారికి బదులు ఫ్రీ బస్సు మాకు ఇస్తే, చక్కగా ఆఫీస్ కు కార్, బండి పక్కన పెట్టి బస్సు లో పోతాము. ట్రాఫిక్, కాలుష్యం రెండు తగ్గుతాయి. ఇంటికెళ్ళిన వెంటనే ఆడవారు మంచి భోజనం వండి పెడతారు! ఆలోచించండి సర్!"
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments