వర్ష రాగాలు
- Gorrepati Sreenu
- Aug 1
- 2 min read
#VarshaRagalu, #వర్షరాగాలు, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Varsha Ragalu - New Telugu Poem Written By - Gorrepati Sreenu
Published In manatelugukathalu.com On 01/08/2025
వర్ష రాగాలు - తెలుగు కవిత
రచన: గొర్రెపాటి శ్రీను
సన్నగా కురుస్తున్న వర్షం చినుకులు
నీలాల నింగి ని వీడి నేలపై చేరి
మైదానాలను తడుపుతూ
కొండకోనల్లో పాయలు పాయలుగా పారుతూ
సెలయేళ్ళు గా మారుతూ గలగల సవ్వళ్ళ తో అలరిస్తూ
నదుల్లోకి చేరుతూ
జలసిరులతో ప్రాజెక్టులు సరికొత్త అందాలని సంతరించు కోవడానికి కారణమవుతాయి!
సన్నగా కురుస్తున్న వర్షం చినుకులు
చెట్లన్నీ ఆకుపచ్చ వర్ణాలని సంతరించుకునేలా
మరింత అందంగా మెరిపించే లా
తలంటు పోస్తూ తరిస్తుంటాయి !
సన్నగా కురుస్తున్న వర్షం చినుకులు
ఆకాశం లో విరిసిన ముచ్చటైన హరివిల్లును
నేలకి పరిచయం చేస్తూ దోబూచులాడుతుంటాయి !
సన్నగా కురుస్తున్న వర్షం చినుకులు
గగనసీమలో నుండి
దేవతలు పన్నీటి జల్లులు చల్లుతున్నట్లు గా
జనుల మేని ని మెత్తగా అల్లుకుంటూ
తన్మయాన్ని కలిగిస్తుంటాయి !
కోవెల కొలను లో
చేరిన వర్షం చినుకులు కొలనంతా నిండి భగవంతుని
దర్శనం కోసం
చక్రస్నానం కోసం
తపస్సు చేస్తుంటాయి !
వర్షం చినుకులు వినిపించే సరాగాలు
భగవంతుడి హృదిని మెప్పించే
భక్తిపూర్వక అనిర్వచనాలు ..లోకహితాలు !
***
సెల్ఫోనే సమస్తం కాదు మిత్రమా ..

అదొక మాయాప్రపంచం!
తలదూర్చి గమనిస్తుంటే దాని ప్రభావం అనంతం!
కాలం..
క్షణాలు,నిమిషాలు,గంటలు,రోజులు,మాసాలు..ఇట్టే గడిచిపోతాయి!
వెనుదిరిగి చూసుకుంటే అదంతా కాలక్షేపంగా సాగిన సమయం!
సెల్ఫోన్ పరిచయం చేసే అద్భుతం ఇదంతా..
పక్కవారిని పరికించి చూడలేనంత ఖాళీ లేకపోవడం సహజం !
ఇప్పుడు అన్ని వయస్సుల వారికి అదే లోకం !
తోటివారిని పలకరించే సమయం,
పెద్దవారిని పరామర్శించే సందర్భం,
పిల్లపాపలని ఆడించే తీరిక లేనంత బిజీ..
పరుగుల జీవితం సెల్ఫోన్ సాక్షిగా
కాలంతోపాటుగా
ఉరుకుల పరుగుల జీవన పోరాటాల ఆరాటాలు !
కసేపలా మాయా లోకాన్ని వీడి ..
అవసరమైన మేరకు సెల్ఫోన్ వినియోగిస్తూ ..
సమయం విలువ తెలుసుకుని
సద్వినియోగం చేసుకునేలా జీవిస్తే సమస్త ప్రకృతి మనతో కలిసి ఉంటుంది !
బతుకు బాటలో అడుగు అడుగునా చైతన్యాల పరవళ్ళు
స్నేహ పరిమళాల మాధుర్యాలు
అనుబంధాల ఆత్మీయతల అనుభవాలు ..ప్రత్యక్ష వీక్షణలు !
***
గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .
తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు
ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.
చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)
వెలువరించిన పుస్తకాలు:
"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),
"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),
"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).
ప్రస్తుత నివాసం: హైదరాబాద్.
Comments