top of page
Writer's pictureMohana Krishna Tata

వరుడు కావాలి


'Varudu Kavali' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 31/10/2023

'వరుడు కావాలి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఏమండీ! మన అమ్మాయికి పెళ్ళి చెయ్యాలి కదా! ఏమిటి ఆలోచించారు?"


"ఆలోచించడానికి ఏముంది జానకి..అమ్మాయిని పిలిచి.. ఎప్పుడు పెళ్ళి చేసుకుంటుందో అడగాలి..ఈ కాలం పిల్లల అభిరుచులు వేరు కదా!..ఎలాంటి వాడు కావాలో? అసలు మనం చూసిన సంబంధం చేసుకుంటుందా? లేక లవ్ లాంటిది ఏమైనా ఉందా?"


"అవును లెండి! పిల్లలకి వ్యతిరేకంగా చేస్తే..లోకం లో జరుగుతున్నవి చూస్తున్నాం కదా! అమ్మాయి హ్యాపీ గా ఉంటే, అదే చాలు మనకి...దాని ఇష్టం మేరకే చేద్దాం అయితే!"

***


"అమ్మాయి కావ్య! ఒక సారి ఇటు రా!"


"వస్తున్నాను అమ్మా! ఏమిటి పిలిచారు?"


"ఏమీ లేదు...నీకు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం. నీతో మాట్లాడాలని పిలిచాము. నీ అభిప్రాయం తెల్సుకుందామని నాన్నగారు అడుగుతున్నారు”.


"నీకు ఎలాంటి అబ్బాయిని చూడాలి మాకు చెప్పు తల్లీ! నీ మనసులో ఎవరైనా ఉన్నారా?" అడిగాడు తండ్రి

"నాన్నా! నేను ఎవరినీ ప్రేమించట్లేదు..మీరు పెళ్ళి సంబంధాలు చూడండి"


"అమ్మాయి ఒప్పుకుందండీ! ఇక వేట మొదలుపెట్టండి...ఆ మాట్రిమోనీ లో డీటెయిల్స్ పెట్టేయండి.."


"అలాగే...అన్నీ చేస్తాను.."


ఒక వారం తరువాత, ఒక అరడజను అబ్బాయి ఫోటోలు వచ్చాయి...


"ఇవి చూడు కావ్య...ఇందులో ఎవరు నచ్చారో చెప్పు! పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తాం. ఈ అబ్బాయి డాక్టర్, ఈ అబ్బాయి లాయర్, ఇక ఇతను ఇంజనీర్, ఇతను పోలీస్..."


"మీరు ఎలాగా మంచి అబ్బాయినే చూస్తారు..నాకు తెలుసు!


డాక్టర్ వృత్తి చాలా గొప్పది. డాక్టర్ ని దేవుని గా కొలుస్తాము మనం...కానీ, ఎప్పుడు ఎమర్జెన్సీ కేసులు వస్తాయో తెలియదు..ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటి పట్టున ఉండేది చాలా తక్కువ కదా! నా లాంటి మామూలు అమ్మాయి, అలాంటి వాడిని చేసుకుని ఏమి సుఖపడుతుంది. డబ్బు, హోదా అన్నీ ఉంటాయి.. కానీ...భర్త తో గడిపే టైం తక్కువ ఉంటుంది. అందుకే, నాకు డాక్టర్ అబ్బాయి వద్దనుకుంటున్నాను.


ఇక లాయర్ ది కూడా చాలా భాధ్యత గల వృత్తి. ఎప్పుడూ..కోర్టు, కేసులు అంటూ తిరుగుతూ, వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని కేసులు నిద్ర లేకుండా చేస్తాయి. నాకు లాయర్ కుడా వదమ్మా!


ఇక పోలీస్ చాలా బాధ్యత తో కూడిన వృత్తి. ఎప్పుడూ, దొంగలు పట్టుకోవడము తో రోజంతా అలసిపోయి.. ఇంటికి ఏ రాత్రో వచ్చిన తర్వాత నాకు ఏమిటి సుఖం ఉంటుంది చెప్పండి...ఇలాంటి బాధ్యత గల వృత్తులలో ఉన్నవారికి టైం అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడు ఇంటికి వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదు. నా తో ఉండే సమయం చాలా తక్కువే. నాతో ఎక్కువ సమయం స్పెండ్ చేసే అబ్బాయినే పెళ్ళి చేసుకుంటాను.


"అయితే నీకు బ్యాంకు మేనేజర్ కరెక్ట్ తల్లీ!" ఆత్రుతతో అడిగింది తల్లి.


"బ్యాంకు మేనేజర్ అయితే ఎప్పుడూ టార్గెట్స్ ఉంటాయి. వాటి కోసమే బతుకుతూ ఉంటారు. ఏ తప్పు జరిగినా.. చాలా టెన్షన్ తో ఉండే జాబ్. ఈ మేనేజర్ పెళ్ళి కొడుకులు నాకు వద్దు."


"మరి నీకు ఎలాంటి వాడు కావాలో నువ్వే చెప్పు!"


"నాకు ఒక చిన్న ఉద్యోగం చేసే అబ్బాయిని చూడండి...అది కుడా..ఉదయం వెళ్లి..సాయంత్రం టైం కు ఇంటికి వచ్చి, నాతో టైం స్పెండ్ చేసేటట్టు, నా కోరికలు అన్నీ అర్ధం చేసుకుని తీర్చేటట్టు కావాలి..ఈ చిన్న జీవితానికి అది చాలు!"


"సరే తల్లీ! అలాగే చూస్తాం"


*****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ



42 views0 comments

Comments


bottom of page