top of page
Original.png

వాస్తవం

Updated: Jun 20, 2025

#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #వాస్తవం, #Vasthavam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Vasthavam - New Telugu Poem Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 19/06/2025

వాస్తవం తెలుగు కవిత

రచన: తాత మోహనకృష్ణ


ఓ మనిషి...

జీవితం శాశ్వతం కాదు

వాస్తవం తెలుసుకో..

తగ్గట్టు మసలుకో..


బతికేది ఒకప్పుడు ఎక్కువే

ఇప్పుడు ఎంతకాలమో ఎవరికి తెలుసు?

నిద్రలో పోతావో..

డాన్స్ చేస్తూ పోతావో..

నవ్వుతూ పోతావో..

లేక ఎవడి చేతుల్లో బలైపోతావో.. 

తొక్కిసలాటలో నలిగిపోతావో.. 

యాక్సిడెంట్ లో నుజ్జైపోతావో..

ఫ్లైట్ ఎక్కి గాలిలో పేలిపోతావో..

వైరస్ ని తట్టుకోలేక పోతావో..

జీవించలేక నువ్వే ఇక జీవితం చాలు అనుకుంటావో..

చావుకు ఇప్పుడు ఎన్నో కొత్త కొత్త ఆఫర్స్


కానీ...


నీ దేహం పై ప్రేమను పెంచుకుంటావు 

చివరికి ఆ దేహం..వెచ్చటి కట్టెల పరుపుపైకే


ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి డబ్బు సంపాదిస్తావు 

చివరికి దాచిన ధనం..నీది కాదు..ఎవరిదో


విలాసాలకోసం కొన్న వస్తువులు 

చివరికి నీ వస్తువులు.. ఎవరికి సొంతమో.. 


నిన్ను నిలబెట్టిన నీ శరీరం ఇక ఉండదు

చివరికి మిగిలే నీ అస్తికలు..గంగ పాలు


కొడుకు పెట్టిన తద్దినం

అదీ నీది కాదు..కాకుల పాలు 


సంపాదించిన పేరు మాత్రమే ఇక్కడ నీది

జనాల గుండెల్లో అదే శాశ్వతమైన నిధి..


మూటకట్టుకున్న పుణ్యం ఖచ్చితంగా నీదే

పై లోకాల ఎంట్రీకి అది నిధి.. 


అందుకే శ్వాస ఆడేవరకు...


ద్వేషం వద్దు..

ప్రేమించడం ఆపొద్దు..


కోపం వద్దు..

ప్రశాంతతే కోరు

 

అత్యాశ అసలే వద్దు

సంతృప్తి ముద్దు 


మంచి చెయ్యి

పేరు నిలుపుకో..


దానధర్మాలు చెయ్యి

పుణ్యఫలం నీ అకౌంట్ లో వెయ్యి 


ఉన్నంతకాలం హ్యాపీగా ఉండు..

నీవారిని హ్యాపీగా ఉంచు.. 


******


-తాత మోహనకృష్ణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page